
టాలీవుడ్ బెస్ట్ కపుల్‌లో రామ్‌చరణ్- ఉపాసన ఒకరు. 2012లో పెళ్లిపీటలెక్కిన వీరిద్దరూ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ మధుర క్షణాలను ఆస్వాదించకుండా తమ సమయాన్నంతా ఆర్‌ఆర్‌ఆర్‌కే అంకితం చేశారిద్దరూ.. ఆర్‌ఆర్‌ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అయినప్పటి నుంచి అమెరికాలో వరుస ప్రమోషన్లు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు చరణ్. తనకు సపోర్ట్‌గా ఉంటూ భర్తతో పాటే అమెరికాలో ఉంది ఉపాసన. ఇటీవలే వీరిద్దరూ ప్రీఆస్కార్ వేడుకలకు హాజరవగా తాజాగా 95వ ఆస్కార్ సంబరాల్లో పాల్గొన్నారు.
రామ్‌చరణ్ బ్లాక్ సూట్‌లో రెడీ అవగా ఉపాసన సాంప్రదాయాలకు విలువనిస్తూ చీరలో కనిపించింది. ఆస్కార్ సెలబ్రేషన్స్ ప్రారంభమవడానికి ముందు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడింది ఉపాసన. 'రామ్‌కు నేనెప్పుడూ సపోర్ట్ చేస్తాను. ఆర్‌ఆర్‌ఆర్ ఫ్యామిలీలో భాగంగా నేనిక్కడకు వచ్చాను. నాకు కొంత ఆందోళనగా ఉంది. కానీ ఈరోజు ఇక్కడ ఉండటం ఎంతో సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది. ఇంతలో చరణ్ మాట్లాడుతూ... 'తనిప్పుడు ఆరు నెలల గర్భవతి. పుట్టబోయే బిడ్డకు ఎక్కడలేనంత ప్రేమ లభిస్తోంది. కడుపులో ఉండగానే తను మాకెంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది' అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment