హాలీవుడ్‌లో ఆస్కార్ ఫీవర్ మొదలైంది. 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం సర్వం సిద్ధమైంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ ది మోస్ట్ గ్లామరస్ డే కోసం సుందరంగా ముస్తాబైంది. పుత్తడిబొమ్మ ఎవరెవరి సొంతమవుతుందోనని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఈ అవార్డుల వేడుక గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం..
చదవండి: Oscar Awards Facts: ఆస్కార్ ప్రతిమలో వీటిని గుర్తించారా? అది దేనికి చిహ్నమంటే?
అవార్డు అందుకోవడానికి వేదిక పైకి వచ్చే విజేతల్లో తడబాటు ఉండటం ఖాయం. అందుకే నామినేషన్ దక్కించుకునేవాళ్లతో అకాడమీ నిర్వాహకులు ముందే రిహార్సల్స్ చేయిస్తారు. అండ ద విన్నర్ ఈజ్.. అంటూ అనౌన్స్ చేసి, వేదిక పైకి పిలిచి ముందుగానే తయారు చేయించిన డమ్మీ ఆస్కార్ అవార్డు అందజేస్తారు. ఇలా చేయడం వల్ల వేడుక రోజు విజేతలుగా నిలిచే వాళ్లలో కొంచెం కంగారు తగ్గుతుందని నిర్వాహుల ఫీలింగ్. ఈసారి కూడా ఈ రిహార్సల్స్ జరిగాయి. శనివారం ఉదయం డాల్బీ థియేటర్‌లో నామినేషన్ దక్కించుకున్నవాళ్లు డమ్మీ ఆస్కార్ అందుకుని రిహార్సల్ పూర్తి చేశారు. రేపు ఉదయం అసలైన విజేతలకు నిజమైన ఆస్కార్ ప్రతిమను బహుకరిస్తారు.
చదవండి: ఆస్కార్ వచ్చే ఆస్కారం ఎవరికి ఎక్కువ?
Oscar Awards 2023: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే..
Comments
Please login to add a commentAdd a comment