
యావత్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన ఆస్కార్ పండగ మొదలైంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్‌లో 95వ ఆస్కార్ ప్రదానోత్సవాలు జరుగుతున్నాయి. అవార్డుల ప్రకటనకు ముందు నాటునాటు పాటతో స్టేజీ దద్దరిల్లిపోయింది. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్‌లో సాంగ్ పాడుతుంటే డ్యాన్సర్లు తమ స్టెప్పులతో జనాలకు ఊపు తెప్పించారు. మన తెలుగు పాటకు స్టాండింగ్ ఒవేషన్ దక్కడం మరో విశేషం. అనంతరం హాలీవుడ్ పాటలను వెనక్కు నెడుతూ ఆస్కార్ అవార్డును ముద్దాడింది ఆర్‌ఆర్‌ఆర్ టీమ్. ఇకపోతే ఆస్కార్ సెలబ్రేషన్స్ కోసం రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ సూటులో రెడీ అయ్యారు.
తారక్ కోటుపై గర్జించే పులి బొమ్మ ఉంది. రాజమౌళి ట్రెడిషనల్ కుర్తాలో కనిపించారు. తారక్, చెర్రీ, ఉపాసన సహా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ అంతా కలసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అకాడమీ హాల్‌లోకి వెళ్లేముందు చరణ్, తారక్ హగ్ చేసుకున్న ఫోటో చూసి అభిమానులు చూపు తిప్పుకోలేకపోతున్నారు. 'మీరిద్దరూ గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారన్నా', 'ఆస్కార్ సాధించి భారత్ సత్తా చాటారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment