ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం రూ.2 కోట్లు అప్పు చేసి.. | Young Man Commits Suicide Over 2 Crores Debt In Online Betting At Nalgonda, More Details Inside | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం రూ.2 కోట్లు అప్పు చేసి..

Published Tue, Aug 20 2024 11:57 AM | Last Updated on Tue, Aug 20 2024 12:41 PM

debt over 2 crores in online betting at nalgonda

నల్లగొండ క్రైం, పెన్‌పహాడ్‌: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. బెట్టింగ్‌ మాయలో పడి రూ.2 కోట్లు అప్పు చేసి.. తీర్చే మార్గం లేక సాగర్‌ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలివి. నల్లగొండ నెహ్రూగంజ్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న తడకమళ్ల సోమయ్య కుమారుడు సాయికుమార్‌ (28) అప్పు తెచ్చి ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ పెట్టి రూ.2 కోట్లు నష్టపోయాడు. 

అప్పు లు ఇచ్చిన వారు.. తిరిగి చెల్లించాలని అడగడంతో వారికి సమాధానం చెప్పలేక సాయికుమార్‌  మనస్తాపం చెంది ఈ నెల 17న ఇంట్లోంచి వెళ్లిపోయాడు. హాలియా వద్ద సాగర్‌ ఎడమ కాల్వలో దూకాడు. అతని సోదరుడు సతీశ్‌ అదేరోజు నల్లగొండ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సాయికుమార్‌ కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కాగా సోమవారం సాయికుమార్‌ మృతదేహం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం దోసపహాడ్‌ గ్రామ శివారులో సాగర్‌ ఎడమ కాల్వలో లభించినట్టు పెన్‌పహాడ్‌ ఎస్‌ఐ రవీందర్‌ తెలిపారు. మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement