బిట్స్ పిలానీలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు | national cultural fest in bits pilani | Sakshi
Sakshi News home page

బిట్స్ పిలానీలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

Published Fri, Mar 13 2015 9:09 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

బిట్స్ పిలానీలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు - Sakshi

బిట్స్ పిలానీలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

శామీర్‌పేట్(రంగారెడ్డి జిల్లా) : ఆటలు.. పాటలు.. వివిధ అంశాలపై ప్రతిభా పోటీలు.. సాంస్కృతిక ప్రదర్శనలు.. విద్యార్థుల కేరింతలతో శామీర్‌పేట్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలానీ) హైదరాబాద్ క్యాంపస్‌లో కోలాహలం నెలకొంది. పెరల్-15 నాలుగు రోజుల వార్షిక జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రెండోరోజు ఉదయం నుంచి రాత్రి వరకూ విద్యార్థులు సందడి చేశారు. కోక్ స్టూడియో వారిచే అద్వైత  క్లాసికల్ ర్యాక్‌బ్యాండ్, బాల్ రూం డాన్స్(పెరల్ బాల్) ఆడిటోరియంలో మిస్ దీవా ఫ్యాషన్ షో, ఫ్రాగ్‌లోర్ కంప్యూటర్ గేమింగ్ కాంపిటీషన్, క్లాసికల్ డాన్స్ వర్క్‌షాప్, నేషనల్ జియోగ్రఫీ చానల్ ఫొటోగ్రాఫర్ చంద్రశేఖర్ సింగ్ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ వర్క్‌షాప్, మోనో యాక్టింగ్ కాంపిటీషన్, సింగింగ్ కాంపిటీషన్స్ నిర్వహించారు.
విద్యార్థుల ప్రతిభ...
బిట్స్ విద్యార్థి రవితేజ తన బృందంతో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ పెరల్-15 ట్రాక్ తోపాటు నిశాంత్, సంతోష్, శశాంక్, ప్రవీణ్, నిఖిల్‌సాయి, జీవన్‌రెడ్డి, చందు, హర్ష, చంద్రజ, నిషాంత్, సమర్, సాయిశ్రీ టీం నాలుగు వారాలు రేయింబవళ్లు కష్టపడి ఏర్పాటు చేసిన ట్రోజన్‌హార్స్, విద్యార్థులు వేసిన వివిధ రకాల పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో బిట్స్ డైరెక్టర్ వీఎస్‌రావు, విద్యార్థి సంఘం అధ్యక్షుడు అఖిల్‌పొట్లూరి, కార్యదర్శి చరితారెడ్డి, నిర్వాహకులు సౌమ్య, విష్ణుచరణ్, ఇన్‌చార్జి శ్రీవర్దన్‌రెడ్డి, ప్రదీప్, అర్జున్‌దేశ్‌పాండే, భానుతేజ గన్నేని, నాగార్జున, మహేష్, అమీర్‌చాంద్, ఫణీంద్రనాయుడు, అజయ్‌కుమార్‌రెడ్డి, సుమిత్ చావ్లా, దివేశ్‌జయ్, అన్వేషిత, దేశంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

గర్వంగా ఉంది..
బిట్స్ విద్యార్థులుగా ఉన్నందుకు గర్వంగా ఉంది. వార్షిక కార్యక్రమాల్లో వర్క్‌షాప్‌లో భాగంగా పెరల్ ట్రాక్‌ను తయారు చేయడానికి వారం రోజలు శ్రమించాల్సి వచ్చింది. పెరల్ ట్రాక్‌పై కారును రిమోట్ ద్వారా నడిపించడం ఆనందంగా ఉంది.
రవితేజ, బీటెక్ ఫస్టియర్

షేక్‌స్పియర్ స్ఫూర్తితో..
గతంలో ఎన్నో కాంపిటీషన్స్‌లో పాల్గొని బహుమతులు సాధించాను. బిట్స్ వార్షికోత్సవంలో పెయింటింగ్ వేయడం ఆనందాన్నిచ్చింది. జీవితం అనేది ఒక నాటకం మాత్రమే అన్న షేక్‌స్పియర్ మాటలను ఆదర్శంగా తీసుకుని మట్టితో మొదలైన మనిషి జీవితం చివరికి మట్టిలోనే కలుస్తుంది అనే థీమ్‌తో ‘సెవంత్ సెన్స్’ పెయింటింగ్ వేశాను.
సాయిశ్రీ, బీటెక్ సెకండియర్

పెయింటింగ్ అంటే ఇష్టం..
పేపర్‌పై అక్రాలిక్ కలర్స్‌తో పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. బిట్స్‌లో సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా పెయింటింగ్ వేసేందుకు ఎంపిక చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. బిట్స్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం బాగుంది. చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుకు సాగిన వారికి విజయం సాధ్యమవుతుంది.
చంద్రజ, బీటెక్ సెకండియర్

మున్ముందు మరిన్ని కార్యక్రమాలు..
గ్రీఫెన్ (గ్రీకు కాలం నాటి దేవుళ్ల పెయింటింగ్ ) చిత్రాన్ని వేయడానికి వారం రోజులు పట్టింది. బిట్స్ విద్యార్థులంతా కలిసి దేశంలోనే అతిపెద్ద వార్షికోత్సవం నిర్వహించడం గర్వంగా ఉంది. వేల సంఖ్యలో వచ్చే విద్యార్థులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. మున్ముందు మరిన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తాం.
సంజన, బీటెక్ సెకండియర్

సంతోషంగా ఉంది..
ట్రోజన్‌హార్స్ (గ్రీకులు ఓటమి అంచున ఉన్నప్పుడు తమను ఓడించే దేశానికి అందించే కానుక) నమూనాను తయారు చేయడానికి మూడువారాలు పట్టింది. పదిమందితో కష్టపడి రూపకల్పన చేశాం. ఈ సాంస్కృతిక వార్షికోత్సవంలో మా నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచినందుకు సంతోషంగా ఉంది.
నిశాంత్, బీటెక్ సెకండియర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement