national cultural fest
-
పీపుల్స్ ప్లాజాలో జాతీయ సంస్కృతి మహోత్సవాలు–2024 (ఫొటోలు)
-
అలరించిన జాతీయ సంస్కృతి మహోత్సవాలు (ఫొటోలు)
-
పీపుల్స్ ప్లాజా : జాతీయ సంస్కృతి మహోత్సవాలు–2024 (ఫొటోలు)
-
భారత సంస్కృతీ సంప్రదాయాలు అత్యుత్తమం
సాక్షి ప్రతినిధి, వరంగల్: భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు అత్యుత్తమమైనవని, దేశంలోని ప్రతి రాష్ట్రానికీ ఓ చారిత్రక నేపథ్యం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా జాతీయ సంస్కృతీ మహోత్సవాలను కేంద్రం వేడుకగా నిర్వహించడం అభినందనీయమన్నారు. చారిత్రక నేపథ్యమున్న ఓరుగల్లులో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మంగళవారం నుంచి రెండ్రోజులు జరిగే రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథి గా హాజరై మాట్లాడారు. ‘మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, ప్రపంచంలోని ఇతర దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం, అన్ని రకాల కళలు, సంస్కృతిని ప్రోత్సహించడం వంటివి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం’అని చెప్పారు. సాంస్కృతిక శాఖ ఏటా రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్‌ను నిర్వహిస్తుందని.. కళాకారులు వారి కళాత్మకతను ప్రదర్శించడానికి ఇది చక్కని అవకాశమన్నారు. 7 జోన్ల నుంచి 15 మంది చొప్పున 525 మంది కళాకారుల ప్రదర్శనను చూసి గవర్నర్ ముగ్దులయ్యారు. వైభవంగా ‘సంస్కృతీ మహోత్సవ్’: కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి సంస్కృతీ మహోత్సవ్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ నెల 26, 27 తేదీల్లో ఏపీలోని రాజమండ్రిలో వేడుకలు జరగ్గా.. మంగళవారం తెలంగాణలోని వరంగల్‌లో ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు ఈసారీ దూరం గవర్నర్ పర్యటనకు ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈసారి కూడా దూరంగా ఉన్నారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలు హాజరైతే కనీసం గ్రేటర్ వరంగల్ మేయర్ స్వాగతం పలకకపోవడం, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరుకాకపోవడం మరోసారి గవర్నర్‌ను అవమానపరిచినట్లయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రొటోకాల్ ప్రకారం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి గవర్నర్‌కు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే అధికారులు కూడా కార్యక్రమం పట్ల అంటీముట్టనట్లే వ్యవహరించారు. -
26 నుంచి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ఈ ఉత్సవాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రతి ఒక్క రూ సిద్ధపడాలన్నారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రులతో పాటు సీనీ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే జాతీయ సాంస్కృతిక ఉత్సవాల ఏర్పాట్లపై హైదరాబాద్‌లో ఆదివారం ఆయన బీజేపీ కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తొలుత ఈనెల 26, 27 తేదీల్లో ఏపీలోని రాజమహేంద్రవరంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడ జరిగే ఉత్సవాల ప్రారంభానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హాజరవుతారన్నారు. తర్వాత వరంగల్‌లో ఈనెల 29, 30 తేదీల్లో, ఏప్రిల్ 1,2,3 తేదీల్లో హైదరాబాద్‌లో ఉత్సవాలను నిర్వహించనున్న ట్లు వెల్లడించారు. ఇక్కడి ఉత్సవాలకు కూ డా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలతో పాటు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామన్నారు. -
బిట్స్ పిలానీలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు
శామీర్‌పేట్(రంగారెడ్డి జిల్లా) : ఆటలు.. పాటలు.. వివిధ అంశాలపై ప్రతిభా పోటీలు.. సాంస్కృతిక ప్రదర్శనలు.. విద్యార్థుల కేరింతలతో శామీర్‌పేట్‌లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలానీ) హైదరాబాద్ క్యాంపస్‌లో కోలాహలం నెలకొంది. పెరల్-15 నాలుగు రోజుల వార్షిక జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రెండోరోజు ఉదయం నుంచి రాత్రి వరకూ విద్యార్థులు సందడి చేశారు. కోక్ స్టూడియో వారిచే అద్వైత క్లాసికల్ ర్యాక్బ్యాండ్, బాల్ రూం డాన్స్(పెరల్ బాల్) ఆడిటోరియంలో మిస్ దీవా ఫ్యాషన్ షో, ఫ్రాగ్లోర్ కంప్యూటర్ గేమింగ్ కాంపిటీషన్, క్లాసికల్ డాన్స్ వర్క్‌షాప్, నేషనల్ జియోగ్రఫీ చానల్ ఫొటోగ్రాఫర్ చంద్రశేఖర్ సింగ్ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ వర్క్‌షాప్, మోనో యాక్టింగ్ కాంపిటీషన్, సింగింగ్ కాంపిటీషన్స్ నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభ... బిట్స్ విద్యార్థి రవితేజ తన బృందంతో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ పెరల్-15 ట్రాక్ తోపాటు నిశాంత్, సంతోష్, శశాంక్, ప్రవీణ్, నిఖిల్‌సాయి, జీవన్‌రెడ్డి, చందు, హర్ష, చంద్రజ, నిషాంత్, సమర్, సాయిశ్రీ టీం నాలుగు వారాలు రేయింబవళ్లు కష్టపడి ఏర్పాటు చేసిన ట్రోజన్‌హార్స్, విద్యార్థులు వేసిన వివిధ రకాల పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో బిట్స్ డైరెక్టర్ వీఎస్‌రావు, విద్యార్థి సంఘం అధ్యక్షుడు అఖిల్పొట్లూరి, కార్యదర్శి చరితారెడ్డి, నిర్వాహకులు సౌమ్య, విష్ణుచరణ్, ఇన్చార్జి శ్రీవర్దన్‌రెడ్డి, ప్రదీప్, అర్జున్దేశ్పాండే, భానుతేజ గన్నేని, నాగార్జున, మహేష్, అమీర్చాంద్, ఫణీంద్రనాయుడు, అజయ్‌కుమార్‌రెడ్డి, సుమిత్ చావ్లా, దివేశ్జయ్, అన్వేషిత, దేశంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. గర్వంగా ఉంది.. బిట్స్ విద్యార్థులుగా ఉన్నందుకు గర్వంగా ఉంది. వార్షిక కార్యక్రమాల్లో వర్క్‌షాప్‌లో భాగంగా పెరల్ ట్రాక్‌ను తయారు చేయడానికి వారం రోజలు శ్రమించాల్సి వచ్చింది. పెరల్ ట్రాక్‌పై కారును రిమోట్ ద్వారా నడిపించడం ఆనందంగా ఉంది. రవితేజ, బీటెక్ ఫస్టియర్ షేక్స్పియర్ స్ఫూర్తితో.. గతంలో ఎన్నో కాంపిటీషన్స్‌లో పాల్గొని బహుమతులు సాధించాను. బిట్స్ వార్షికోత్సవంలో పెయింటింగ్ వేయడం ఆనందాన్నిచ్చింది. జీవితం అనేది ఒక నాటకం మాత్రమే అన్న షేక్స్పియర్ మాటలను ఆదర్శంగా తీసుకుని మట్టితో మొదలైన మనిషి జీవితం చివరికి మట్టిలోనే కలుస్తుంది అనే థీమ్‌తో ‘సెవంత్ సెన్స్’ పెయింటింగ్ వేశాను. సాయిశ్రీ, బీటెక్ సెకండియర్ పెయింటింగ్ అంటే ఇష్టం.. పేపర్‌పై అక్రాలిక్ కలర్స్‌తో పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. బిట్స్‌లో సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా పెయింటింగ్ వేసేందుకు ఎంపిక చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. బిట్స్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం బాగుంది. చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుకు సాగిన వారికి విజయం సాధ్యమవుతుంది. చంద్రజ, బీటెక్ సెకండియర్ మున్ముందు మరిన్ని కార్యక్రమాలు.. గ్రీఫెన్ (గ్రీకు కాలం నాటి దేవుళ్ల పెయింటింగ్ ) చిత్రాన్ని వేయడానికి వారం రోజులు పట్టింది. బిట్స్ విద్యార్థులంతా కలిసి దేశంలోనే అతిపెద్ద వార్షికోత్సవం నిర్వహించడం గర్వంగా ఉంది. వేల సంఖ్యలో వచ్చే విద్యార్థులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. మున్ముందు మరిన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తాం. సంజన, బీటెక్ సెకండియర్ సంతోషంగా ఉంది.. ట్రోజన్‌హార్స్ (గ్రీకులు ఓటమి అంచున ఉన్నప్పుడు తమను ఓడించే దేశానికి అందించే కానుక) నమూనాను తయారు చేయడానికి మూడువారాలు పట్టింది. పదిమందితో కష్టపడి రూపకల్పన చేశాం. ఈ సాంస్కృతిక వార్షికోత్సవంలో మా నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచినందుకు సంతోషంగా ఉంది. నిశాంత్, బీటెక్ సెకండియర్