
జైపూర్: బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) డిప్యూటీ రిజిస్ట్రార్ అనుమానాస్పద మరణం కలకలం రేపుతోంది. హర్యానాకు చెందిన ఆర్‌సీ డాగర్ బిట్స్ క్యాంపస్‌లోని అతని నివాస గృహంలో ఉరివేసుకుని చనిపోయారు. రాజస్థాన్‌లోని జుంజు జిల్లాలో గురువారం ఉదయం ఈ విషాదం చోటు చేసుకుంది. డాగర్ ప్రస్తుతం యాక్టింగ్ రిజిస్ట్రార్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. డాగర్ మరణం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నామనీ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. పనిభారం కారణంగా డాగర్ మానసిక ఒత్తిడికి గురయ్యాడని అతని సోదరి ఆరోపించారని పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment