Deputy Registrar
-
బిట్స్ పిలానీ డిప్యూటీ రిజిస్ట్రార్ అనుమానాస్పద మృతి
జైపూర్: బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) డిప్యూటీ రిజిస్ట్రార్ అనుమానాస్పద మరణం కలకలం రేపుతోంది. హర్యానాకు చెందిన ఆర్సీ డాగర్ బిట్స్ క్యాంపస్‌లోని అతని నివాస గృహంలో ఉరివేసుకుని చనిపోయారు. రాజస్థాన్‌లోని జుంజు జిల్లాలో గురువారం ఉదయం ఈ విషాదం చోటు చేసుకుంది. డాగర్ ప్రస్తుతం యాక్టింగ్ రిజిస్ట్రార్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. డాగర్ మరణం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నామనీ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. పనిభారం కారణంగా డాగర్ మానసిక ఒత్తిడికి గురయ్యాడని అతని సోదరి ఆరోపించారని పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందన్నారు. -
కదులుతున్న బినామీ రుణాల డొంక !
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గరుగుబిల్లి మండలం రావివలస ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బినామీ రుణాల డొంక కదులుతోంది. సెక్షన్ 51 ప్రకారం అధికారులు ఆఘమేఘాల మీద విచారణకు ఉపక్రమించారు. రికార్డుల్లో ఉన్న రుణ గ్రహీతలకు నోటీసు లు జారీ చేస్తున్నారు. విచారణాధికారిగా నియమితులైన సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ పి. చిన్నయ్య పేరుతో జారీ అయిన 70 నోటీసులు ఇప్పటికే పంపిణీ చేసేశారు. ఈ నెల 16న రావివలస సొసైటీలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నా రు. మీపేరున ఫలానా మొత్తంలో రుణం తీసుకున్నట్టుగా ఉందని, సదరు రుణం తీసుకున్నదీ లేనిదీ చెప్పాలని ఆ నోటీసులో కోరారు. ఉదాహరణకు... రావివలసకు చెందిన దాసరి పార్వతీకి జారీ చేసిన సమన్లలో 2012సెప్టెంబర్ 24న రూ.74వేల రుణం తీసుకున్నట్టు ఉంది. ఆ మొత్తం తీసుకున్నారా లేదా అన్నది ఈనెల 16 న పీఏసీఎస్‌లో జరిగే విచారణలో తెలపాలని, హాజరు కానిపక్షంలో స్పల్ప కాలిక రుణం కింద తీసుకున్నట్టుగా పరిగణించాల్సి వస్తుందని సమనులో స్పష్టం చేశారు. ఇదే తరహాలో ఇప్పటికే 70మందికి పంపిణీ చేయగా, గ్రామంలో మరో 3,930మందికి పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ విచారణలో వాస్తవమేంటో తేలనుంది. బినామీల భాగోతం బయటపడనుంది. ఉలిక్కిపడ్డ రైతులు నోటీసులు అందుకోగానే రైతులు ఉలిక్కి పడ్డారు. తాము తీసుకున్న రుణం పది,పదిహేను వేల రూపాయల్లోనే ఉంటుందని డబ్బైయేసి వేలు ఉండదని వారంతా లబోదిబోమంటున్నారు. గ్రామ పెద్దల్ని కలిసి తమ గోడు చెప్పుకుంటున్నారు. ఒక్క సోమవారమే గ్రామ పెద్దలు రెండు పర్యాయాలు అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ సమన్లు విషయమై చర్చించారు. దీన్నెలా ఎదుర్కోవాలో అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారు. మంతనాల్లో నేతలు ఇదిలా ఉండగా, రుణబాగోతాన్ని దీన్ని ఏలాగైనా చేధించాలని టీడీపీకి చెందిన కొందరు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, తమను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు పన్నుతున్న పధకాన్ని ఎలా తిప్పికొట్టాలన్నదానిపై కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే నాడు చక్రం తిప్పిన కాంగ్రెస్ యువనేత ఒకరు ఆ గ్రామంలోకి వెళ్లి రహస్య చర్చలు జరిపారు. ఇదెక్కడికి దారి తీస్తుందో, బినామీల భాగోతం ఏ స్థాయిలో బయటపడుతుందో వేచి చూడాలి. -
ఈసీ సమావేశంలోనే రిజిస్ట్రార్ ఎంపిక
గుడుపల్లె, న్యూస్‌లైన్: ద్రవిడ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశంలోనే రిజిస్ట్రార్ ఎంపిక జరుగుతుందని, అంతవరకూ గవర్నర్ ఆదేశం మేరకు డెప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న మాధవనాయుడు ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తారని వైస్‌చాన్స్‌లర్ ఆచార్య కంకణాల రత్నయ్య స్పష్టంచేశారు. శనివారం వీసీ బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ద్రవిడ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆదినారాయణరెడ్డి పదవీకాలం ఈ నెల 22న ముగిసిందని, ఈ నేపధ్యంలో ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌ను నియమించాలని ఈనెల 6వ తేదీన గవర్నర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయని వీసీ వివరించారు. గవర్నర్ ఆదేశం మేరకు 23 నుంచి ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టాలని డెప్యూటీ రిజిస్ట్రార్‌ను ఈ నెల 7వ తేదీనే ఆదేశించామని చెప్పారు. ఇదిఇలా ఉండగా రిజిస్ట్రార్ ఆదినారాయణరెడ్డి పదవీ కాలాన్ని పొడిగించేలా ఈసీ కమిటీలో ప్రతిపాదించాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అజయ్ మిశ్రా లేఖరాశారని, కానీ అది ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖ కాదని వీసీ రత్నయ్య వివరించారు. ద్రవిడ వర్సిటీకి ఇంకా ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) నియమించలేదని చెప్పారు. కమిటీ నియమించేవరకూ రాష్ర్ట ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అజయ్ మిశ్రా, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి సాంబశివరావు, విద్యాశాఖ కొలిజియేట్ ఆఫ్ కమిషనర్ సునీతతో పాటు తమిళనాడుకు చెందిన ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి శ్రీ రాజరాంలు ద్రవిడ వర్సిటీకి ఎక్స్అఫిషియో సభ్యులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా వైస్‌చాన్స్‌లర్ ఉంటారన్నారు. ఎక్స్అఫిషియో సభ్యులందరూ రిజిస్ట్రార్ పోస్టు ఫలానావారికి ఇవ్వాలని ప్రతిపాదించినా కూడా వీసీ ఒప్పుకుంటేనే సాధ్యం అవుతుందన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటయ్యాక సమావేశం ఏర్పాటుచేసి నూతన రిజిస్ట్రార్‌ను నియుమిస్తావుని చెప్పారు. అప్పటివరకు ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా వూధవనాయుుడు కొనసాగుతారని వివరించారు.