రూబిక్స్ క్యూబుల రజనీకాంత్ | Bits Pilani students make Rajini out of Rubic's cube | Sakshi
Sakshi News home page

రూబిక్స్ క్యూబుల రజనీకాంత్

Published Thu, Mar 13 2014 12:58 PM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

రూబిక్స్ క్యూబుల రజనీకాంత్

రూబిక్స్ క్యూబుల రజనీకాంత్

రూబిక్ క్యూబ్ కీ సూపర్ స్టార్ రజనీకాంత్ కీ ఏమిటి సంబంధం? రూబిక్ క్యూబ్ లాగానే రజనీ స్టయిలిష్ గా ఉంటాడు. కానీ సాల్వ్ చేయడమే కఠినం. బహుశః అందుకేనేమో హైదరాబాద్ లోని బిట్స్ పిలానీ విద్యార్థులు రజనీకాంత్ బొమ్మను రూబిక్ క్యూబ్ లతో తయారు చేసి రికార్డు సృష్టించారు.

తమ కాలేజీ యువజనోత్సవం పెర్ల్ - 14 లో అంతర్భాగంగా షామీర్ పేట్ లోని బిట్స్ పిలానీ విద్యార్థులు 14160 రూబిక్ క్యూబ్ లతో రజనీకాంత్ బొమ్మను తయారు చేశారు. తమాషా ఏమిటంటే రజనీ లేటెస్ట్ సినిమా కోచ్చడయాన్ ఒక వైపు రిలీజ్ కి ముందే సంచలనం సృష్టిస్తున్నా, బిట్స్ పిలానీ టెకీలకు మాత్రం రోబో చిత్రంలోని వశీ మాత్రమే నచ్చాడు. అందుకే ప్రొఫెసర్ వశీ బొమ్మను తయారు చేశారు. మొత్తానికి రజనీ మానియా బిట్స్ పిలానీ విద్యార్థుల దాకా పాకింది. నీల్ నితిన్ ముకేశ్, అలోక్ నాథ్ జోక్ లకన్నా చాలా ముందే రజనీ జోక్స్ యూత్ మధ్య హల్చల్ చేస్తూ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement