rubic cube
-
మెగా అభిమానం : క్యూబ్స్‌తో 6.5 ఫీట్ల చిరు ఫోటో
సాక్షి, చెన్నై : మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆదివారం(ఆగస్టు22)న చిరు బర్త్‌డే సందర్బంగా ఆయనకు ప్రముఖులు సహా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడుకు చెందిన కొందరు ఫ్యాన్స్ చేసిన వినూత్న ప్రయత్నం అందిరి దృష్టిని ఆకర్షిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా తమిళనాడు రూబిక్ క్యూబ్ అసోసియేషన్‌కు చెందిన బిందు, ఆనంద్ కలిసి 955 రూబిక్ క్యూబ్స్ తో 6.5 అడుగుల ఎత్తయిన అరుదైన ఫోటోను దృశ్యంతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మరోవైపు ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్లతో సినీ అభిమానులను ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా గాడ్‌ఫాదర్, బోళ శంకర్, ఆచార్య, డైరెక్టర్ బాబీ సినిమాలు లైన్లో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డే సందర్భంగా తమిళనాడు రూబిక్ క్యూబ్ అసోసియేషన్ వారు 955 రూబిక్ క్యూబ్స్ తో 6.5 అడుగుల ఎత్తయిన పిక్చర్ ను తయారుచేసిన బిందుప్రియాంక, ఆనంద్. #MegastarChiranjeevi @KChiruTweets pic.twitter.com/H6ZqKXx9FT — BA Raju's Team (@baraju_SuperHit) August 23, 2021 చదవండి : వైరల్ : చిరంజీవి ఇంట్లో గ్రాండ్‌గా రాఖీ సెలబ్రేషన్స్ చిరు బర్త్‌డే: స్పెషల్ సాంగ్‌ని లాంచ్ చేసిన శ్రీకాంత్ -
రూబిక్ క్యూబ్‌తో ప్రపంచ రికార్డు!
పెద్దవాళ్లు సైతం కష్టపడి పరిష్కరించే రూబిక్ క్యూబ్‌ను నేటితరం పిల్లలు ఇట్టే పరిష్కరిస్తూ ఔరా అనిపిస్తున్నారు. చిచ్చర పిడుగులాంటి ఎనిమిదేళ్ల అధర్వ ఒకేసారి మూడు రూబిక్ క్యూబ్‌లను పరిష్కరించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. బెంగళూరుకు చెదిన అధర్వ ఆర్భట్ ఒకేసారి చేతులు, కాళ్లు ఉపయోగించి మూడు రూబిక్క్యూబ్లను పరిష్కరించి గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. అంతేగాకుండా ‘వరల్డ్ బెస్ట్ మల్టీ టాస్కర్’ను కనుగొన్నామని గిన్నీస్ యాజమాన్యం నుంచి ప్రశంస అందుకున్నాడు. అధర్వ 2020 డిసెంబర్ 9న ఈ రికార్డు సృష్టించినప్పటికీ... తాజాగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ (జీడబ్ల్యూర్) అధికారిక యూట్యూబ్ చానెల్లో అధర్వ వీడియో పోస్టు చేయడంతో అతని రికార్డు వెలుగులోకి వచ్చింది. గిన్నిస్ యాజమాన్యం పోస్టు చేసిన వీడియోలో... అధర్వ ఒక్కో చేతిలో ఒక్కో రూబిక్ క్యూబ్నూ, రెండు కాళ్లతో ఒక రూబిక్ క్యూబ్‌ను ఒకేసారి పరిష్కరిస్తుంటాడు. అతని పక్కనే ఒక వ్యక్తి అధర్వ ఎంత సమయం లో పజిల్‌ను క్లియర్ చేస్తున్నాడో తెలిపే టైమర్ ను పట్టుకుని కూర్చుని ఉంటాడు. చాలా వేగంగా క్యూబిక్ పజిల్‌ను అటూ ఇటూ కదుపుతూ ఒక నిమిషం ఇరవైతొమ్మిది సెకన్లలోనే పూర్తిచేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా క్యూబ్ పజిల్ పరిష్కరించి రికార్డులు తిరగరాసిన అధర్వకు మన దేశానికి చెందిన కృష్ణంరాజు, చైనాకు చెందిన జియాన్యూ క్యూలు ప్రేరణ. వీరు గతంలో అత్యంత వేగంగా క్యూబిక్ పజిల్‌ను పూర్తిచేసి గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. వీరికంటే వేగంగా పజిల్‌ను పూర్తిచేసి రికార్డు కొట్టాలనుకున్న అధర్వ ఆ దిశగా సాధన చేసి చివరికి తను అనుకున్నది సాధించాడు. 2017 నుంచి రికార్డు కోసం సాధన చేస్తున్న అధర్వ 2018లో రాష్ట్ర స్థాయి ‘ బెస్ట్ ట్యాలెంట్ ఆఫ్ కర్ణాటక’ లో పాల్గొని కాళ్లతో క్యూబ్స్‌ను పరిష్కరిస్తూ ఫైనల్స్ వరకు చేరుకుని వీక్షకులను ఆశ్చర్యపరుస్తూ విజయం సాధించాడు. అయితే ఈ పోటీ టాలెంట్‌ను ప్రదర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మరింత కష్టపడి ప్రయత్నిస్తే గిన్నిస్ వరల్డ్ రికార్డు టైటిల్ గెలుచుకోవచ్చని అధర్వ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కరోనా కాలంలో ఆన్లైన్ తరగతులు వింటూ..తన గిన్నిస్ రికార్డు కోసం సాధనం చేసేవాడు. ఈ క్రమంలోనే పలుమార్లు క్యూబ్‌లు పరిష్కరిస్తూ సర్టిఫికెట్లు కూడా అందుకున్నాడు. ‘‘పజిల్స్ అంటే ఎంతో ఇష్టం, వాటిని పరిష్కరించడం మరెంతో ఇష్టమని చెబుతూ.. కుటుంబ ప్రోత్సాహంతోనే తానీ స్థాయికి చేరుకున్నానని అధర్వ చెప్పాడు. -
షాకింగ్‌గా ఉంది.. నమ్మలేకపోతున్నా: సచిన్
ముంబై: ‘‘షాకింగ్‌గా ఉంది. అస్సలు నమ్మలేకపోతున్నా’’ అంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఓ యువకుడిపై ప్రశంసలు కురిపించాడు. రూబిక్ క్యూబ్ వైపు చూడకుండానే కేవలం 17 సెకన్లలోనే దానిని సెట్ చేసిన అతడి ప్రతిభకు ఫిదా అయ్యాడు. ఇందుకు సంబంధించి సచిన్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైకి చెందిన టీనేజర్ మహ్మద్ అమన్ కొలీకి పజిల్స్ సాల్వ్ చేయడం అంటే మహా ఇష్టం. ఆ ఆసక్తే అతడిని అందరిలో ప్రత్యేకంగా నిలిపింది. గిన్నిస్‌బుక్ రికార్డు సాధించేలా చేసింది. ఈ క్రమంలో అతడి గురించి తెలుసుకున్న సచిన్ తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా నెటిజన్లకు పరిచయం చేశాడు. ‘‘నాతో పాటు ఇక్కడ అమన్ కొలి ఉన్నాడు. మీ అందరికీ తెలుసు కదా. దీనిని రూబిక్ క్యూబ్ అంటారు. దీనిని ఇప్పుడు అమన్ చేతికి ఇస్తాను. అతడు దాని వైపు చూడకుండానే సాల్వ్ చేసేస్తాడు. అన్నట్లు తను గిన్నిస్ బుక్ రికార్డు కూడా సాధించాడు. ఈ భారతీయ యువకుడు మన అందరినీ గర్వపడేలా చేశాడు. మనం నేరుగా చూస్తూ కూడా చేయలేని పనిని అతడు చూడకుండానే చేశాడు. ప్రస్తుతం తన ముందు ఉన్న అతిపెద్ద సవాలు ఏమిటో తెలుసా. తన లాగా నాక్కూడా రూబిక్ క్యూబ్ సాల్వ్ చేయడం నేర్పించడమే’’ అని సచిన్ చమత్కరించాడు. ఇక వీడియోను వీక్షించిన నెటిజన్లు అమన్ ప్రతిభను కొనియాడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ సైతం.. ‘‘అస్సలు నమ్మలేకపోతున్నా! కవర్‌డ్రైవ్ చక్కగా ఉంది’’ అని ప్రశంసించాడు. చదవండి: జోరుగా కోహ్లి, రోహిత్, రహానే ప్రాక్టీస్ పాక్ క్రికెట్ బోర్డు ప్రతిపాదనపై మండిపడ్డ బీసీసీఐ -
రూబిక్స్ క్యూబుల రజనీకాంత్
రూబిక్ క్యూబ్ కీ సూపర్ స్టార్ రజనీకాంత్ కీ ఏమిటి సంబంధం? రూబిక్ క్యూబ్ లాగానే రజనీ స్టయిలిష్ గా ఉంటాడు. కానీ సాల్వ్ చేయడమే కఠినం. బహుశః అందుకేనేమో హైదరాబాద్ లోని బిట్స్ పిలానీ విద్యార్థులు రజనీకాంత్ బొమ్మను రూబిక్ క్యూబ్ లతో తయారు చేసి రికార్డు సృష్టించారు. తమ కాలేజీ యువజనోత్సవం పెర్ల్ - 14 లో అంతర్భాగంగా షామీర్ పేట్ లోని బిట్స్ పిలానీ విద్యార్థులు 14160 రూబిక్ క్యూబ్ లతో రజనీకాంత్ బొమ్మను తయారు చేశారు. తమాషా ఏమిటంటే రజనీ లేటెస్ట్ సినిమా కోచ్చడయాన్ ఒక వైపు రిలీజ్ కి ముందే సంచలనం సృష్టిస్తున్నా, బిట్స్ పిలానీ టెకీలకు మాత్రం రోబో చిత్రంలోని వశీ మాత్రమే నచ్చాడు. అందుకే ప్రొఫెసర్ వశీ బొమ్మను తయారు చేశారు. మొత్తానికి రజనీ మానియా బిట్స్ పిలానీ విద్యార్థుల దాకా పాకింది. నీల్ నితిన్ ముకేశ్, అలోక్ నాథ్ జోక్ లకన్నా చాలా ముందే రజనీ జోక్స్ యూత్ మధ్య హల్చల్ చేస్తూ ఉన్నాయి.