బాధ్యతల స్వీకరణ
పిలానీ: బిట్స్ పిలానీ తాత్కాలిక వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ వి. సాంబశివ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బిట్స్ పిలానీలోనే ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన ప్రొఫెసర్ రావు జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బీల్‌ఫెల్డ్ నుంచి ఎడ్యుకేషనల్ ఎకనమిక్స్ అండ్ రీసెర్చ్‌లో పట్టా పొందారు. ఇప్పటిదాకా నాలుగు ద శాబ్దాల కాలంలో బిట్స్ పిలానీలో డీన్ ప్రాక్టీస్ స్కూల్‌గా, డిప్యూటీ డెరైక్టర్‌గా, బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ డెరైక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. శిక్షణ అవసరాల అంచనా, పాఠ్యాంశాల అభివృద్ధి, మౌలిక వసతులు, ప్రాజెక్ట్ నిర్వహణ, కర్బన రసాయనశాస్త్రం, డ్రగ్ డిజైన్ సబ్జెక్టుల్లో కూడా ప్రొఫెసర్ సాంబశివ రావు నిష్ణాతులు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), సీఐఐ, ఫిక్కీ స్టేట్ కౌన్సిల్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వంటి విద్యా, పరిశోధక సంస్థల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. 2013 సంవత్సరంలో ఇండో గ్లోబల్ ఎడ్యుకేషన్ సదస్సులో ఉత్తమ విద్యావేత్త అవార్డును అందుకున్నారు. వి. సాంబశివ రావు నేతృత్వంలోని పీహెచ్‌డీ విద్యార్థులు రాసిన ఎన్నో పరిశోధన వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ సైన్స్ జర్నళ్లలో ప్రచురితమయ్యాయి. బోధనతో ‘అభ్యసనాన్ని అద్భుతమైన అనుభవం’గా మార్చినందుకు గాను రావు 2014 సంవత్సరంలో బిట్స్ పూర్వ విద్యార్థుల ప్రపంచ సమావేశంలో ఘనంగా సత్కారం అందుకున్నారు.
బిట్స్ పిలానీ వీసీగా వీఎస్ రావు
Published Sat, Aug 1 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM
Advertisement
Advertisement