కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారతప్రభుత్వం మార్చి25 నుంచి లాక్‌డౌన్‌ని ప్రకటించింది. అయితే మొదట ఏప్రిల్ 14తో ముగుస్తుంది అనుకున్న లాక్‌డౌన్‌ను రెండు సార్లు పొడిగించారు. దీంతో మరోసారి లాక్‌డౌన్ పొడిగించకపోతే మే17 వరకు కొనసాగనుంది. లాక్‌డౌన్ కారణంగా చాలా మంది ఉపాధి కోల్పొయి ఆకలితో పస్తులు ఉంటున్నారు. పూట కూడా గడవక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారిని స్వచ్ఛంధ సంస్థలతో పాటు సామాన్యులు సైతం చేతనైనంతా సాయం చేస్తూ ఆదుకుంటున్నారు. (కష్టంలో తోడుగా కామన్మ్యాన్)
టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు హైకోర్ట్ న్యాయవాది మన్నెం రంజిత్ యాదవ్ ఆర్థిక సహాయంతో నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో,పోలీస్ సిబ్బందికి,ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, గ్రామపంచాయతీ సిబ్బందికి,జంగాల కాలనీకి చెందిన 250 కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో త్రిపురారం S. I రామ్మూర్తి, గ్రామ సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి, టీఆర్‌ఎస్‌వి మండల అధ్యక్షుడు షేక్ ఆలిమ్ చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి మాజీ యంపీటీసీ, మన్నెం వెంకన్న ,హాలియా ఏయమ్‌సీ డైరెక్టర్ కొట్టే రమేష్ యాదవ్, టీఆర్‌ఎస్‌వినియోజకవర్గ కార్యదర్శి కుంటిగొర్ల రాజశేఖర్,ఇరిగి ప్రభాకర్, కోటి,శివ,నవీన్,ఉపేందర్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా గుంటిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిడ్మనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, ఎంపీపీ సలహాదారు బొల్లం రవి, ఎర్రబెల్లి మాజీ సర్పంచ్ తాటి సత్యపాల్, తదితరులు పాల్గొన్నారు.
నాం ఉల్ హుస్సేన్ ఆధ్వర్యంలో కర్నూలు రోజా వీధి లోని 70 పేద ముస్లిం కుటుంబాలకి రేషన్ సామాన్లు అందించారు. కర్నూలులో పూర్తి రెడ్ జోన్ గా ఉన్న రోజా వీధిలో లాక్ డౌన్ వల్ల, రెడ్ జోన్ వల్ల రోజు వారి పనులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చినట్టు, అందుకు సహాయం చేయాలనీ నిర్ణయించినట్టు సౌదీ అరేబియా లో ఉండే ఇనాముల్ హుస్సేన్ తెలిపారు. తన కుటుంబ సభ్యులు పెద్ద మొత్తంలో సహకారం అందించడంతో సరుకులను కొనుగోలు చేసి కిట్స్ గా మార్చి , క్యూపన్స్ ద్వారా వస్తువులను అవసరమైన వారికి అందిస్తున్నట్టు తెలిపారు. కందిపప్పు, గోధుమ పిండి, చక్కర, కరం, అల్లం పేస్ట్, నూనె, ఉప్పు తదితర నిత్యావసర సరుకులు ఒక్కొకటి రూ.1000 విలువ గల కిటను హుస్సేన్ సౌదీ నుంచి అందించారు. (కరోనాపై పోరాటంలో మీరు చేయి కలపండి)
కరోనా విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులకు ఎస్ఎఫ్ఐ కృష్ణాజిల్లా కమిటీ వారు సాయం అందించారు. వీరు ప్రతి రోజు కృష్ణాజిల్లాలో 265 మందికి భోజనాలు, మాస్కులు సరఫరా చేస్తున్నారు. జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ , నూజివీడు , చందర్లపాడు ,మచిలీపట్నాలలో శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.
మీరు చేస్తున్న సేవ కార్యక్రమాలు కూడా అందరికి తెలియజేసి వారిలో స్ఫూర్తి నింపాలంటే మీరు చేస్తున్న సేవ కార్యక్రమాల వివరాలు webeditor@sakshi.comకి పంపించండి.
Comments
Please login to add a commentAdd a comment