కరోనా కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పొయి ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటివారి ఆకలి తీర్చేందుకు చాలా మంది ముందుకు వచ్చి ఆపన్నహస్తాలు అందిస్తున్నారు. వారికి అన్నం పెడుతూ, నిత్యవసరాలు అందిస్తూ సాయం చేస్తున్నారు. (టాప్10 లో టాస్క్ ఫుడ్ డ్రైవ్)
ప్రజా సర్వీస్ పౌండేషన్ చైర్మన్ దూపాటి సుధాకర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు, నెల్లూరు, బాపట్ల ప్రాంతాలలో వందల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయల పంపిణీ చేశారు. దీంతో పాటు ఆ ప్రాంతాల్లో కరోనా వైరస్ గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు, అది రాకుండా చేపట్టవలసిన చర్యలు, ఆచరించాల్సిన పద్దతుల గురించి అక్కడ ఉన్న వారికి వివరించారు.
హైదరాబాద్ బేగంపేటఉంటున్న బీవీ ప్రసాద్ రెడ్డి కరోనా కారణంగా అన్నం దొరక్క ఇబ్బందులు పడుతున్న వారిని చూపి చలించిపోయి వారికి అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నారు. వారి కుటుంబ సభ్యుల సహకారంతో తమ ఇంటి చుట్టు పక్కల ఉంటూ ఆకలితో ఉంటున్న వారికి ఆహారాన్ని అందించి ఆదుకున్నారు.
కరోనా లాక్ డౌన్ వాళ్ళ వివిధ రాష్ట్రాలలో చిక్కు పోయి ఇప్పుడు తమ తమ రాష్ట్రాలకు నడక ద్వారా, సైకిల్స్ మీద, బస్సులు, లారీల ద్వారా ప్రయాణం చేస్తున్న వలస కార్మికులకు ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి సభ్యులు ఫలహారం, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్, అరటి పళ్ళు, పప్పు ఉండలు, గ్లూకోస్ ప్యాకెట్స్ నేషనల్ హైవే మీద ప్రేమతో అందజేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలు ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ జి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగాయి. ఆర్‌ఏ నాయుడు, శ్యామ్ సబ్బవరం జాతీయ రహదారి వద్ద వస్తువులను పంపిణీ చేశారు. వారితో పాటు అసకపల్లి భజన మండలి కన్వీనర్ బంగారు నాయుడు, సాయి సేవాదళ్ & యువత ఈ సేవా కార్యక్రమాలలో సహాయపడ్డారు.
మీరు కూడా చేస్తున్న ఇలాంటి సేవా కార్యక్రమాలు మాకు కూడా తెలపాలనుకుంటే webeditor@sakshi.com కి వివరాలు పంపిచండి. (సీఎం సహాయనిధికి లలితా జ్యువెలర్స్ కోటి విరాళం)
Comments
Please login to add a commentAdd a comment