కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో అనేక మంది చేసేందుకు పనులు లేక తినేందుకు తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. రోజుకు ఒక్కపూట కూడా తిండి దొరకక అనేక మంది కుటుంబంతో కలిసి పస్తులుంటున్నారు. లాక్‌డౌన్‌ను ఇప్పటికే మూడు సార్లు పొడిగిచడంతో రోజు కూలీ చేసుకొని బతికే బడుగు బలహీన వర్గాల వారు ఆకలితో అలమటిస్తున్నారు. సాయం అందించే వారికి కోసం ఆశగా ఎదరుచూస్తున్నారు. అటువంటి వారికి అండగా నిలవడం కోసం చాలా మంది ముందుకు వస్తున్నారు.
ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న డాక్టర్లు, ఎఎన్ఎమ్‌లను గాదెరాజు బాలకృష్ణ ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.రెడ్ జోన్‌గా ప్రకటించినప్పటి నుంచి 20 రోజులుగా కంటైన్‌మెంట్ జోన్‌లో టింటికి సర్వే చేస్తున్న ఆశావర్కర్లను, ఎఎన్‌ఎమ్‌లు, మున్సిపల్‌సిబ్బంది పై పూల వర్షం కురిపించారు. వారందరికి 15 రోజులకు సరిపడా నిత్యావసరాలను కూడా అందించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పల్లవి, కంటైన్‌మెంట్ ఇంచార్జ్ ప్రకాశ్‌లు పాల్గొన్నారు. (అన్నార్తులకు అమీనామ్మ )
అమెరికాలో ఉంటున్న కడపజిల్లా గాలివీడు మండలానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి కరోనా లాక్‌డౌన్ కాలంలో పేదలకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో ఒక చారిటీ సంస్థను స్థాపించారు. దాని ద్వారా రూ. 1,50,000 లతో వికలాంగులకు, వలస కార్మికులకు సాయాన్ని అందించారు. తాను చేసిన ఈ కార్యక్రమంలో సహకరించిన సేవా భావం సంస్థకు, స్నేహితులకు వేణుగోపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.మానవత్వమే మన మతం)
(
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్టూరు మండలం వలపర్ల గ్రామంలో సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తూ అమెరికాలో నివాసం ఉంటున్న కార్యంపూడి శ్రీనివాస వరప్రసాద్ ఆర్థిక సహాయముతో , మాస్టర్ వీవర్ కార్యంపూడి కోటీనాగులు ఆధ్వర్యంలో పద్మశాలీ చేనేత కార్మికులకు భోజనం పంపిణీ చేస్తున్నారు. రోజు మధ్యాహ్నం అన్నం, పప్పు లేదా కర్రీ వండి పెరుగుతో పాటు ఆహార పొట్లాలు తయారు చేసి, వీటిని పద్మశాలీ యూత్ సహకారంతో రోజు మధ్యాహ్నం సుమారు 150 మంది చేనేత కార్మికులు, పేదలకు అందజేస్తున్నారు.
కరోనా కట్టడికి పోరాడుతున్న వారిలో వైద్యులు, పోలీసు వారు ముందు వరుసలో ఉంటారు. అటువంటి పోలీసులకు వోల్టాస్ మాజీ ఉద్యోగులు "ఎకో ఫ్రెండ్లీ హెర్బల్ పాకెట్ శానిటైజర్స్ " తయారు చేసి 500 బాటిల్స్ అందజేశారు. వోల్టాస్ మాజీ ఉద్యోగుల ప్రతినిధి శ్రీ కృష్ణా రెడ్డి, జీరో బడ్జెట్ పాలిటిక్స్ ప్రతినిధి శ్రీ మాధవ రెడ్డి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ చేతుల మీదుగా పోలీస్‌లకు అందజేశారు.
మీరు కూడా లాక్‌డౌన్ కాలంలో చేస్తున్న సేవ కార్యక్రమాలను నలుగురికి తెలిపి వారిలో స్పూర్తి నింపాలంటే webeditor@sakshi.com కి ఆ వివరాలు తెలియజేయండి.
Comments
Please login to add a commentAdd a comment