కరోనాని కట్టడి చేయడం కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడివారు అక్కడ ఉండిపోయారు. ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. దీంతో ఎంతో మంది రోజువారీ కార్మికులు, వలస కూలీలు, నిరుపేదలు పనులు దొరకక పస్తులుంటున్నారు. ఒక్కపూట కూడా తిండి దొరకక ఆకలితో అలమటిస్తోన్నారు. అటువంటి వారిని ఆదుకోవడానికి చాలా మంది సామాన్యులు సైతం వారికి చేతనైనంత సాయం చేస్తున్నారు. (కష్టంలో తోడుగా కామన్మ్యాన్)
వెంగన్నగూడెం గ్రామ పంచాయితీ పరిధిలో ఆముదాల ఫ్యాక్టరీ వద్ద నివాసం ఉంటున్న వలస కార్మికులకు మన్నెం రంజిత్ యాదవ్ గారి సహాయ సహకారాలతో నిడమనూర్ ఏఎస్‌ఐ సీహెచ్ రమేష్ గారు కూరగాయలు, బియ్యం పంపిణి చేశారు. దాదాపు 50 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి మాజీ ఎమ్‌పీటీసీ మన్నెం వెంకన్న యాదవ్, వెంగన్నగూడెం ఎమ్‌పీటీసీ చెలుముల సంతోష్, మండల ఎస్పీసెల్ ప్రధాన కార్యదర్శి లకుమాల మధుబాబు, కోటి, ఆవుల కృష్ణ, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు. (సేవ సైనికులు)
నెల్లూరు జిల్లా బ్రహ్మణ క్రాక పంచాయితీలో నిరుపేదలకు, రోజువారీ కూలీ దొరకక లాక్‌డౌన్ కాలంలో ఆకలితో అలమటిస్తున్న వారికి మంజుల నిత్యవసర సరుకులు అందించి అండగా నిలిచారు.
కదిరికి చెందిన నాగేంద్ర ప్రసాద్ కరోనా కష్ట కాలంలో పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో తమ ప్రాంతానికి చెందిన మున్సిపల్ కార్మికులకు, పేద ప్రజలకు తన కుటుంబసభ్యులతో కలిసి వంట సామాగ్రి అందించారు.
జయశంకర్ భూపాలపల్లి మోరంచపల్లి గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ గ్రామంలోని పేద ప్రజలకి, నిరాశ్రయులకి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే వారికి కరోనా రాకుండా చేతులు కడుక్కోవాలని, మాస్క్ ధరించాలని జాగ్రత్తలు చెప్పి వారిలో చైతన్యం నింపారు.
మీరు కూడా సేవ కార్యక్రమాలు చేస్తూ ఉండి ఉంటే అవి ఎందరిలోనో స్ఫూర్తిని నింపవచ్చు. వాటిని మాకు webeditor@sakshi.com ద్వారా పంపించండి.
Comments
Please login to add a commentAdd a comment