
జగిత్యాలజోన్: అనాథకు అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు హెల్పింగ్‌హ్యాండ్ సభ్యులు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని రెండోవార్డుకు చెందిన అనాథ మహిళ లక్ష్మి శుక్రవారం గుండెపోటుతో మరణించింది. ఆ వార్డు కౌన్సిలర్ డిష్ జగన్ స్పందించి హెల్పింగ్‌హ్యాండ్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. లక్ష్మి మృతదేహాన్ని హెల్పింగ్‌హ్యాండ్ సభ్యులు నల్ల సురేష్, మందాడి సురేష్, సింగం భూమేష్, సాయిచరణ్ శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్పింగ్‌హ్యాండ్ సభ్యులను సంస్థ వ్యవస్థాపకులు డెక్క శ్రావణ్, కౌన్సిలర్ డిష్ జగన్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment