సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం... వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఎందరినో ఎంతో కాలంగా తన అక్కున చేర్చుకొని ఆశ్రయాన్ని, ఉపాధిని ఇస్తోంది. దేశ విదేశాల నుంచి ఎందరో ఇక్కడికి పొట్టకూటి కోసం వస్తూనే ఉంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ నుంచి వచ్చిన ఎందరో వస్త్ర కళాకారులకు హైదరాబాద్ దశాబ్ధాలుగా ఆశ్రయాన్ని ఇస్తోంది. హైదరాబాద్ వస్త్ర పరిశ్రమ దాదాపు వీరి మీదే ఎక్కువ శాతం ఆధారపడి ఉంది. అందమైన డిజైన్లతో బట్టలు తయారు చేసి భాగ్యనగరంలో ప్రజలకు ఎప్పటికప్పుడు కొత్త మెరుగులు అందిస్తూ ఉంటారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఇప్పుడు పనిలేక వారి పరిస్థితి దయనీయంగా మారింది. పూట గడవక రోజుకు ఒక్కపూట కూడ తిండి దొరకక విలవిలలాడుతున్నారు. అండగా నిలిచే ఆపన్న హస్తాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. (కష్టంలో తోడుగా కామన్మ్యాన్)
వారికి చేయూతనందించేందుకు ముగ్గురు స్నేహితులు ముందుకొచ్చారు. వారికి నిత్యవసర సరుకులు, ఆహారాన్ని అందిస్తు వారి ఆకలి తీరుస్తున్నారు. ప్రతి రోజు 1500ల మందికి పైగా కార్మికులకు, రోజువారీ కూలీలకు అన్నదానం చేస్తున్నారు. వారికి సేవకు కుటుంబ సభ్యలు, స్నేహితులు అండగా నిలవడంతో లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి వారికి నిత్యం ఆహారాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్ సంస్కృతిలో భాగంగా మారిపోయిన వివిధ రాష్ట్రాల వారిని కూడా సోదర భావంతో దగ్గరకు తీసుకొని కష్టంలో తోడుగా నిలుస్తున్న వారికి మీరు కూడా సాయాన్ని అందించాలంటే ఈ నెంబర్‌కి 9963009009 (సింధూరిక) జీపే/పేటీఎమ్ కానీ చేయండి. మనం అందంగా కనిపించడానికి వాళ్లు చాలా కష్టపడి బట్టలు తయారు చేస్తారు. మరి వాళ్లు బతకడానికి మనం సాయం చేయాల్సిన సమయం ఇది. మనకి తోచినంత సాయాన్ని చేసి మనం వాళ్లని ఆకలి నుంచి కాపాడగలం కదా. వెంటనే మీకు తోచిన సాయం చేసి వారికి అండగా నిలవండి. మానవత్వాన్ని చాటుకోవల్సిన సమయం ఇది. తోటి వారికి తోడుగా నిలవాల్సిన గడ్డుకాలం ఇది. ఆలోచించండి. సాయం చేయండి. (కరోనాపై పోరాటంలో మీరు చేయి కలపండి)
Comments
Please login to add a commentAdd a comment