
సాక్షి, కరీంనగర్: కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో చాలా మంది నిరుపేదలు, వలస కార్మికలు, దినసరి కూలీలు, నిరాశ్రయులు అష్టకష్టాలు పడుతున్నారు. అయితే ఈ కష్టకాలంలో అనేక స్వచ్ఛందసంస్థలు, సామాన్యలు వారికి తోడుగా నిలబడుతున్నారు. వారి ఆకలిదప్పులు తీరుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో దినసరి కూలీలకు, నిరుపేదలకు శ్రీసేవా మార్గం స్వచ్చంద సేవా సంస్థ వారు ప్రతిరోజు ఏదో ఒక రకంగా సాయం చేస్తున్నారు. (‘మాతృభూమి’ కోసం చేతనైన సాయం’)
శ్రీసేవా మార్గం వ్యవస్థాపకురాలు మునిపల్లి పణిత ఒక రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టగా, మరో రోజు పండ్లు పంచిపెట్టారు. ఇంకొరోజు రాగి జావాని చెట్లకింద ఉంటున్న నిరుపేదల వద్దకే వెళ్లి స్వయంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. ఇలా రోజుకు ఒక కార్యక్రమంతో ప్రజలకు అండగా నిలుస్తున్న పణిత ఒకరోజు మాస్క్‌లు, గ్లౌజ్లు కూడా పంచిపెట్టారు. అదేవిధంగా కరోనా కట్టడిలో ఎండలో పనిచేస్తున్న వారికి 400 మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఇదేవిధంగా లాక్‌డౌన్ ముగిసేవరకు ఏదోఒక సేవా కార్యక్రమంతో నిరుపేదలకు సాయం అందిస్తానని పణిత తెలిపారు.
.ఈ కార్యక్రమంలో శ్రీ సేవ మార్గం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, వీరితో పాటు పోలీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు.
చదవండి: మందులు ఇంటికే తెచ్చి ఇస్తున్న వైఏసీ
Comments
Please login to add a commentAdd a comment