సాక్షి, బెంగళూరు: కరోనా... ఇప్పుడు ఈ పేరు ప్రపంచాన్ని వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో సహా అన్ని దేశాలు కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలాడిపోతున్నాయి. రోజు వేల మంది దీనికి బలవుతున్నారు. ఎప్పుడు చూడని సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటుంది. కరోనాని కట్టడి చేయడానికి ఉత్తమ మార్గాలు సామాజిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం. మన దేశంలో కూడా కరోనా మహమ్మారి విజృంభించడంతో 21 రోజుల పాటు ఎవరు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో చాలా మంది పేదలకు, రోజువారీ కూలీలు ఉపాధి కోల్పొయి పూట గడవక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది వారికి అండగా నిలుస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వారికి తోచినంతలో ఇతరులకు సహాయపడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఎంత సంపాదించిన మనతో రాదు కష్టాల్లో ఉన్న వారికి కడుపునింపడమే నిజమైన పరమార్థం అని తోటివారికి అండగా నిలుస్తున్నారు. కొందరు వారికి తోచినంత డబ్బును సాయం చేస్తుంటే ఇంకొందరు స్వయంగా వారే బృందాలుగా ఏర్పడి అన్నదానం లాంటివి చేస్తూ కరోనా కష్టకాలంలో అన్నం దొరకనివారికి, వలస కూలీలకు, పేదలకు ఆహారాన్ని అందిస్తున్నారు. బెంగుళూరుకు చెందిన ఐటీ ఉద్యోగులు కొందరు జగనన్న సైనికులు పేరుతో 2000నుంచి 3000 తెలుగు కుటుంబాలకు అన్నదానం చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. వీరు కొన్ని ప్రాంతాలకు మొబైల్ వాహానాల ద్వారా కూడా ఆహారాన్ని అందిస్తున్నారు. వీరు చేస్తున్న ఈ సేవ కార్యక్రమాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని శ్యాం కలకడ, భాస్కర్‌రెడ్డి అంభవరం నిర్వహిస్తున్నారు. బెంగుళూరులో ఉన్న తెలుగువారికి ఎవరికైనా ఆహారానికి సంబంధించి ఇబ్బందులు ఉంటే కింది నంబర్లకు ఫోన్ చేస్తే ఆహారాన్ని అందిస్తామని వారు తెలిపారు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 9900301234, 8123829473
Comments
Please login to add a commentAdd a comment