
చెన్నై: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్ని కలవరపెడుతోంది. ఈ మహమ్మారి కారణంగా ఇంతక ముందు ఎన్నడు ఎదుర్కోని సంక్షోభాన్ని అన్నిదేశాలు ఎదుర్కొంటున్నాయి. కరోనా భారత్‌లోకి కూడా ప్రవేశించడంతో దానిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. తొలుత ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ అని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ ఆ తరువాత దానిని మే3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దినసరి కూలీలు, వలస కూలీలు, నిరాశ్రయుల ఆర్థిక పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వారిని ఆదుకునేందుకు కొన్ని వాణిజ్య సంస్థలు, సామాన్య ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. (కరోనా : సీఎం సహాయనిధికి విరాళాలు)
ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెన్నైలోని భారత్ యూనివర్సిటీ రూ. 10 లక్షల విరాళం ప్రకటించింది. కరోనా కష్టకాలంలో భారత్ యూనివర్సిటీ డీన్, అడ్మిషన్ మార్కెటింగ్ డైరెక్టర్ యం. రాజశేఖర్ రెడ్డి అండ్ టీమ్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షల విరాళాన్ని అందచేయనున్నామని ప్రకటించారు. రూ. 5 లక్షలు తెలంగాణకు, రూ. 5లక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్నామని వారు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు సేఫ్‌గా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటిలో చాలామంది తెలుగు విద్యార్ధులు చదువుతున్నారని, ఆ యూనివర్శిటిలు, కాలేజీలు కూడా తెలుగు విద్యార్థుల కోసం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తమకు తోచిన విధంగా ఎంతో కొంత సాయం చేయాలని ఆయా కాలేజీల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు లాక్‌డౌన్‌ను పాటిస్తూ కరోనా కాలంలో ఎంతో కొంత సహాయం అందించాలని ఆయన రాజశేఖర్ రెడ్డి సూచించారు. (కరోనా : విరాళాలు ప్రకటించిన కంపెనీలు)
Comments
Please login to add a commentAdd a comment