నిత్యావసర సరుకుల ప్యాకెట్లను పంపిణీ చేస్తున్న హీరో గోపీచంద్ ,శానిటైజర్లు సిద్ధం చేస్తున్న హీరో నిఖిల్
బంజారాహిల్స్: ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కరోనా వైరస్‌ను తరిమికొట్టాలంటూ ప్రముఖ సినీ హీరో విజయ్‌దేవరకొండ తాను మాస్క్ ధరించిన ఫొటోలు విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ మేరకు విజయ్ చేస్తున్న ప్రచారానికి ఆయన అభిమానులతో పాటు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదలు నివసించే బస్తీల్లో వెయ్యి మందికి హీరో గోపీచంద్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇక హీరో నిఖిల్ శానిటైజర్లు సిద్ధం చేసి అంతటా పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులకు వీటిని అందజేశారు.
పోలీసులకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్న ఉత్తేజ్
సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వంటల్లో తన భార్యకు సహాయం చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. సినీ తారలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తూ కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ఇంట్లోనే ఉందామంటూ ప్రచారం చేస్తున్నారు. ఒక వైపు సీఎం సహాయ నిధికి విరాళాలు అందిస్తూనే ఇంకో వైపు తమవంతుగా ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనే ఉందామంటూ టీవీల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ తేజ్ తదితరులు స్టే హోం–స్టే సేఫ్ అంటూ పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. ఇక నటుడు ఉత్తేజ్ ప్రతిరోజూ మధ్యాహ్నం పోలీసులకు అన్నం పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీసులే దేవుళ్లంటూ తారలంతా వివిధ రూపాల్లో సాయం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment