
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఆర్‌ఎంపీ, పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు డా. వెంకట్‌రెడ్డి అండగా నిలిచారు. వలస వచ్చిన కూలీలకు శేరిలింగంపల్లి నల్లగండ్ల దగ్గర పులిహోర, పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సందర్భంగా ఆకలి బాధలు పడుతున్న పేదవారికి తమ ముకేశ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తోటి వైద్య మిత్రులను కలుపుకొని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. (ఏపీలో మరో 15 కరోనా కేసులు )
Comments
Please login to add a commentAdd a comment