sherilingampally
-
శేరీలింగంపల్లి నియోజకవర్గం తదుపరి అధికార పార్టీ..!
శేరీలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన అరికపూడి గాందీ రెండోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ది భవ్య ఆనంద్ పై 44194 ఓట్ల మెజార్టీతో గెలిచారు.గాందీ 2014లో టిడిపి,బిజెపి కూటమిలో భాగంగా టిడిపి అభ్యర్దిగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత కాలంలో ఆయన అదికార టిఆర్ఎస్ లో చేరిపోయారు.2018లో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి గెలవగలిగారు. గాంధీకి 143005 ఓట్లు రాగా, ఆనంద్ కు 98811 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జి.యోగానంద్ కు 22 వేలకు పైగా ఓట్లు వచ్చి,మూడోస్థానంలో నిలిచారు. గాందీ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. శేరిలింగంపల్లిలో 2014లో టిడిపి అభ్యర్ధిగా అరికపూడి గాందీ 75904 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.శేరీలింగంపల్లిలో ఒకసారి బిసి యాదవ్ వర్గానికి చెందిన వ్యక్తి గెలవగా, రెండుసార్లు కమ్మ సామాజికవర్గం నేత గెలుపొందారు. శేరీలింగంపల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ప్రతిపాదనల్లోనే ‘మినీ ట్యాంక్‌బండ్’.. మంత్రి కేటీఆర్ ఆదేశాలు బేఖాతర్!
రాయదుర్గం: నగర శివారులోని ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు చేరువలో ఆహ్లాదాన్ని పంచే చెరువు.. దాని పక్కనే మట్టి, బండరాళ్లతో కూడిన కొండ.. ఇలా ప్రకృతి అందాలతో ఆకట్టుకొనఖాజాగూడ పెద్ద చెరువు రూపురేఖలు మార్చే ప్రక్రియ ఇంకా ప్రతిపాదన దశకే పరిమితమైంది. ఇప్పటికే ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో మగ్గుతుండటం విడ్డూరం. చెరువుకు పక్కనే లింకురోడ్లను అభివృద్ధి చేయడం, ఒకవైపు గ్రీనరీ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం కొంత వరకూ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఎంతో ఉంది. ఖాజాగూడ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే లింకురోడ్డులో కుడివైపు, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఎదురుగా 39 ఎకరాల్లో విస్తరించి ఉంది ఖాజాగూడ పెద్ద చెరువు. శివారులోని దుర్గంచెరువు, మల్కంచెరువు తరహాలోనే దీన్ని కూడా అభివృద్ధి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలు సేద తీరి ఆహ్లాదం పొందేందుకు అనువైన ప్రాంతంగా మారేందుకు అవకాశం ఉంది. ఒకప్పుడు బతుకమ్మల నిమజ్జన చెరువు... ఖాజాగూడ పరిసరాల్లోని వారు బతుకమ్మ ఉత్సవాల సమయంలో పెద్ద చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేసేవారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను జీహెచ్ఎంసీ చేసేది. బతుకమ్మ పండగు సమయంలో మాత్రమే ఈ చెరువు వద్ద సందడి నెలకొనేది. ప్రస్తుతం చెరువును ఆనుకొని లింక్ రోడ్డు ఏర్పాటు చేయడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది. లింకురోడ్డుతో కొత్త కళ.. ► ఖాజాగూడ, గచ్చిబౌలి లింకురోడ్డు నిర్మాణంతో ఈ చెరువుకు కొత్త అందం రావడమే కాకుండా ఈ ప్రాంత రూపురేఖలు కూడా మారిపోయాయి. ► ఈ లింకురోడ్డుకు రెండువైపులా ఫుట్‌పాత్‌లు, ఆకట్టుకునేలా గ్రీనరీని కూడా ఏర్పాటు చేశారు. ► చెరువు వద్ద లింకురోడ్డు పక్కనే మౌనముద్రలోని శిల్పంపెట్టడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ► ఈ చెరువుకు ఒకవైపు బండరాళ్లు, మట్టితో కూడిన భారీ కొండ ఉండటంతో ఇది మరింత ఆకట్టుకునేలా మారింది. ► ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, అంతగా ట్రాఫిక్ సమస్య ఉండకపోవడంతో వాకర్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ► వాకర్స్, సందర్శకులు గ్రీనరీ మధ్య కూర్చోవడానికి బళ్లలు అందుబాటులోకి తెచ్చారు. ► ఈ లింకురోడ్డు సెంట్రల్ డివైడర్‌పై ఏర్పాటు చేసిన భారీ బండరాళ్లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కానరాని వాటర్ ఫౌంటేన్లు...ఫ్లోటింగ్ ప్లాంట్స్ ► ఖాజాగూడ పెద్ద చెరువు పక్కనుంచే లింకురోడ్డు ఏర్పాటు చేయడంతో దాని పక్కనే చెరువుకు ఆనుకొని గ్రీనరీని ఆకట్టుకునే తరహాలో మార్చారు. ► ఇదే సమయంలో ప్రారంభంలో చెరువులో వాటర్ ఫౌంటేన్లు, ఫ్లోటింగ్ ప్లాంట్స్‌ను కూడా ఏర్పాట్లు చేశారు. కానీ అవి నేడు కనుమరుగయ్యాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాలు బేఖాతర్.. ► సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం సాక్షాత్తు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ చెరువు పక్కనే నిర్మించిన లింకురోడ్డు పనులను తనిఖీ చేశారు. ► ఈ సందర్భంగా రోడ్డు పక్కనే ఉన్న ఈ చెరువును చూసి ఆయన ‘ఖాజాగూడ చెరువు చాలా బాగుంది....దీన్ని అభివృద్ధి చేసి మినీట్యాంక్‌బండ్‌గా మార్చండి....ఈ ప్రాంత ప్రజలు వీకెండ్స్‌లో సేదతీరేలా దీన్ని వీకెండ్స్ స్పాట్‌గా మార్చాలి’ అని అధికారులను ఆదేశించారు. ► అయితే, ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కేవలం గ్రీనరీని అభివృద్ధి చేయడంతో పాటు మౌనముద్రలో మనిషి చిత్రాన్ని ఆకట్టుకునే తరహాలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ‘శివారు వీకెండ్స్పాట్’, ‘సండే ఫండే’లకు అనువైన చోటు .. ► ఖాజాగూడ పెద్ద చెరువును వీకెండ్స్ స్పాట్‌గా మార్చి, తొలగించిన రెండు ఫౌంటేన్లు, ఫ్లోటింగ్ ప్లాంట్స్‌ను పునరుద్ధరిస్తే మరింత అందం పెరిగే అవకాశం ఉంది. ► చెరువుకు ఆనుకొనే నిర్మించిన రోడ్డు పక్కనే ఫుట్‌పాత్‌ల మాదిరిగా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్‌లను కూడా ఏర్పాటు చేయాలి ► శని, ఆదివారాల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేసి ప్రజలు వాకింగ్, సైక్లింగ్ చేయడంతో పాటు, ట్యాంక్‌బండ్‌పై మాదిరిగా ‘సండేఫండే’ ఈవినింగ్ తరహాలా మార్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ► మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం, కాఫెటేరియా, టిఫిన్స్ సెంటర్ వంటివి ఏర్పాటు చేస్తే సందర్శకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. చదవండి: ఎమ్మెల్యే పీఏ అరాచకం.. ఫ్రెండ్స్ అంటూ మహిళకు కాల్స్ చేసి చివరకు.. -
పెళ్లై 24 గంటలు: కోమాలోకి వెళ్లిన వధువు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శేరిలింగంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లై ఒక్క రోజు కూడా పూర్తవ్వకముందే.. వారి జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. రోడ్డు ప్రమాదం రూపంలో విధి వారిని వెక్కిరించింది. వివాహమైన 24 గంటలకే కారు యాక్సిడెంట్లో పెళ్లి కుమారుడు చనిపోగా.. తీవ్ర గాయాలపాలైన నవవధువు కోమాలోకి వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. (చదవండి: మాజీ మిస్ కేరళ, రన్నరప్ మృతి: ఆడి కారులో వెంటాడి మరీ) మృతుడు శ్రీనివాస్ వివాహం మంగళవారం తిరుపతిలో జరిగింది. అనంతరం నూతన దంపతులు చెన్నైలోని అత్తగారింటికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరు సమీపంలో నవ దంపతులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంతో శ్రీనివాస్ మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన పెళ్లి కుమార్తె కోమాలోకి వెళ్లిపోయింది. నూరేళ్లు పచ్చగా సాగాల్సిన వైవాహిక జీవితం.. 24 గంటల వ్యవధిలో ఇలా విషాదంతం కావాడాన్ని ఇరు కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: రాజేంద్రనగర్‌లో దారుణం.. స్నేహితుడిని వదిలి వస్తుండగా -
ఆ భూమి ప్రైవేటు వ్యక్తులదే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట పరిధిలోని సర్వే నెంబర్ 78లో 8.07 ఎకరాలను ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని హైకోర్టు తప్పు బట్టింది. ఈ భూమి ప్రైవేట్‌దే అని 2014లో అప్పటి తహసీల్దార్ నిర్ధారించిన నేపథ్యంలో భూమిని రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. క్రాఫ్ట్ అల్లాయ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ భూమిని మరో సంస్థ వేసిన వేలంలో కొనుగోలు చేసిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని చెప్పింది. పట్టాదార్ పాస్ బుక్స్‌ను అడగకుండా సదరు ఫైనాన్స్ సంస్థ జారీచేసిన సేల్ సర్టిఫికెట్‌ను రిజిస్ట్రేషన్ చేయాలని, వారం రోజుల్లో మ్యుటేషన్ ప్రక్రియనూ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో పెట్టడంతోపాటు గత ఏడాదిగా రిజిస్ట్రేషన్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు తహసీల్దార్ కమ్ సబ్ రిజిస్ట్రార్.. పిటిషనర్‌కు రూ.50 వేలు 4 వారాల్లో చెల్లించాలని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఆశి రియల్టర్స్, నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హఫీజ్‌పేట్‌లోని 78 సర్వే నెంబర్ లోని 8.07 ఎకరాల భూమిని కుదవపెట్టి ఓ ప్రైవేటు సంస్థ నుంచి రూ.110 కోట్లు రుణం తీసుకుంది. అయితే రుణం చెల్లించకపోవడంతో సదరు సంస్థ ఈ భూమిని చట్టబద్ధంగా కోర్టు అనుమతి తీసుకొని వేలం వేసింది. ఈ వేలంలో ఎక్కువ మొత్తం కోట్ చేసి క్రాఫ్ట్ అల్లాయ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసింది. అయితే ఏడాదిగా ఆ సేల్‌ను రిజిస్ట్రేషన్ చేయాలని సంబంధిత తహసిల్దార్ కమ్ సబ్‌రిజిస్ట్రార్‌ను కోరినా స్పందన లేదు. ఈ నేపథ్యంలో అల్లాయ్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. చదవండి: 3 నెలల నిరీక్షణ: నేడు హైకోర్టులో విచారణ చదవండి: పిటిషనర్లకు షాకిచ్చిన హైకోర్టు.. రూ.10 వేల జరిమానా -
కరోనా: వలస కూలీలకు చేయూత..
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఆర్ఎంపీ, పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు డా. వెంకట్‌రెడ్డి అండగా నిలిచారు. వలస వచ్చిన కూలీలకు శేరిలింగంపల్లి నల్లగండ్ల దగ్గర పులిహోర, పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్డౌన్ సందర్భంగా ఆకలి బాధలు పడుతున్న పేదవారికి తమ ముకేశ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తోటి వైద్య మిత్రులను కలుపుకొని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. (ఏపీలో మరో 15 కరోనా కేసులు ) కరోనా: భారత్‌లో 5351కి చేరిన కేసులు 14 లక్షలు దాటిన కరోనా కేసులు -
ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకమే ఫోర్జరీ
-
సీఎం సంతకం ఫోర్జరీ
హైదరాబాద్: ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకమే ఫోర్జరీ చేసి ముగ్గురు వ్యక్తులు చిక్కుల్లో పడ్డారు. కేసీఆర్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ధృవపత్రాలు సృష్టించిన ముగ్గురిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్డీఓ ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నెంబర్ 44/పీలో 2 ఎకరాల భూమికి రెగ్యులరైజేషన్ చేయాలని ముఖ్యమంత్రి లెటర్ హెడ్‌తో ఉన్న కాపీని రెవెన్యూ డిపార్ట్మెంట్కు నిందితులు పంపించారని తెలిపారు. లెటర్ హెడ్లను యాకుత్‌పురాకు చెందిన టీఆర్ఎస్ లీడర్ నుంచి రూ.45 వేలకు నిందితుల్లో ఒకడైన మహమ్మద్ ఉస్మాన్ ఖురేషి కొనుగోలు చేశాడని వెల్లడించారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని వ్యాఖ్యానించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకమే ఫోర్జరీ -
ప్రభాస్ పిటిషన్‌పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: భూవివాదానికి సంబంధించి ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీల్ లైఫ్‌లో విలన్లను ఎదుర్కొన్న బాహుబలి.. రియల్ లైఫ్‌లో విలన్లతో తలపడి ఉండరంటూ న్యాయస్థానం పేర్కొంది. సామాన్యుడి విషయంలో అయితే గతంలోనే తాము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవాళ్ళమని, కానీ, ప్రభాస్ విషయంలో ఆచితూచి వ్యవహరించామని హైకోర్టు పేర్కొంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభాస్ భూకబ్జాదారుడని ఆరోపించగా.. ఆ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. భూకబ్జాదారుడైనప్పటికీ అతనికి సెక్షన్ 17 కింద నోటీసులు ఇవ్వాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభాస్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే.. ఆ భూమిని కబ్జా చేసిన మిగతావాళ్ళు కూడా.. ఇందుకు అర్హులవుతారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే, ప్రభాస్ తరఫు వాదనలు వినిపిస్తూ.. తాను కొనుగోలు చేసిన భూమిలోనే ప్రభాస్ గెస్ట్ హౌజ్ కట్టుకున్నారని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కేసు పూర్వాపరాలు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్ 5/3లో ప్రభాస్‌కు చెందిన 2,083 చదరపు అడగుల స్థలాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందో తమ కౌంటర్లో రెవెన్యూ అధికారులు ఇప్పటికే హైకోర్టు వివరించారు. తన స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరుతూ ప్రభాస్ గత బుధవారం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవీరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్‌రెడ్డిల నుంచి తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నానని తెలిపారు. ఈ భూమిలో తాత్కాలిక నిర్మాణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని రూ. 1.05 కోట్ల ఫీజు కూడా చెల్లించామని, క్రమబద్ధీకరణ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. అకస్మాత్తుగా రెవెన్యూ అధికారులు వచ్చి తన భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూ, ఆ భూమి నుంచి తను ఖాళీ చేయాలని కోరారని పేర్కొన్నారు. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చూపారని ఆయన తెలిపారు. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పులో తాను పార్టీ కాదని వివరించారు. అసలు ఆ సుప్రీంకోర్టు తీర్పు గురించి తమకు ఏమీ తెలియదన్నారు. ఈ తీర్పును బూచిగా చూపుతూ తనను తన స్థలం నుంచి బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాక పిటిషనర్ తన వాదనలు వినడం గానీ, నోటీసు ఇవ్వడం గానీ చేయలేదన్నారు. అధికారులు సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని తెలిపారు. అధికారుల చర్యలు తన హక్కులను హరించే విధంగా ఉన్నాయని, అందువల్ల వారిని నియంత్రించాలని ఆయన కోర్టును కోరారు. -
దరఖాస్తును తిరస్కరించినప్పుడు ఆయనకెందుకు చెప్పలేదు?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని రాయ్‌దుర్గ్ పన్మక్త గ్రామంలో కొనుగోలు చేసిన భూమి క్రమబద్ధీకరణ దరఖాస్తును తిరస్కరించినప్పుడు, ఆ లిఖితపూర్వక సమాచారాన్ని దరఖాస్తుదారుడైన సినీనటుడు ప్రభాస్‌కు ఎందుకు తెలియచేయలేదని హైకోర్టు బుధవారం సంబంధిత అధికారులను ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాయ్‌దుర్గ్ పన్మక్త గ్రామంలో తనకున్న భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ అధికారులు ఆ స్థలం ప్రహరీ గేటుకు తాళాలు వేయడాన్ని సవాలు చేస్తూ ప్రభాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. తిరస్కరణ విషయం ప్రభాస్‌కు తెలియచేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. -
కేశవనగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు
-
కూల్చివేతలు.. పోలీసులపై రాళ్లదాడి
సాక్షి, హైదరాబాద్ : శేరిలింగపల్లి మండలం గోపంపల్లి కేశవనగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తాము ఉంటున్న నివాసాలను కూల్చుతున్నారంటూ ఆందోళనకారులు పోలీసులపై కారం, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్ఐలతో పాటు పలువురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రెవిన్యూ అధికారులు, పోలీసులతో కలిసి కేశవ నగర్‌కు వచ్చారు. కూల్చివేతలకు నిరసనగా ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అరెస్ట్ చేసేందుకు పోలీసులు రావడంతో కోపంతో రాళ్లదాడికి దిగారు. దీంతో ప్రతిగా పోలీసులు కూడా ఎదురుదాడికి దిగడంతో ఆ ప్రాంతమంతా కశ్మీర్‌ను తలపించింది. కేశవనగర్‌లోని సర్వేనంబర్ 37/2 రెండు ఎకరాల భూమిని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగా అందులో ఉన్న నిర్మాణాలను అధికారుల సహాయంతో కూల్చివేసింది. -
తగ్గని స్వైన్‌ఫ్లూ తీవ్రత
హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి మండల పరిధిలో శనివారం ఒకే కుటుంబంలో ముగ్గురికి స్వైన్‌ప్లూ సోకింది. కొండాపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి స్వైన్‌ప్లూ రావడంతో అదే కుటుంబంలోని ఇద్దరు వయోవృద్ధులకు కూడా లక్షణాలు ఉండటంతో ఆసుపత్రిలో చేరారని, స్వైన్‌ప్లూ అని తేలాల్సి ఉందని శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గంగాభవాని తెలిపారు. అదేవిధంగా మాదాపూర్‌లో 2, గచ్చిబౌలిలో ఒక కేసు నమోదైందని వెల్లడించారు. అదే విధంగా నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు 20స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసుల్లో 10 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో ముగ్గురు మృత్యువాత పడగా.. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రాజు అనే వ్యక్తితోపాటు అతని కుమారుడు నాలుగేళ్ల బాలుడు, లక్ష్మి అనే యువతి, గాంధీ ఆసుపత్రిలో పర్వీన్ అనే యువతి చికిత్స పొందుతున్నారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం చిన్నాయిగూడేనికి చెందిన బాలుడికి స్వైన్‌ఫ్లూ సోకింది. ఇద్దరు మాత్రం గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మృతుల్లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన వెంకటగురుప్రసాద్, నల్లగొండ పట్టణానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన రమేష్, శోభారాణి ఉన్నారు.