
హైదరాబాద్: ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకమే ఫోర్జరీ చేసి ముగ్గురు వ్యక్తులు చిక్కుల్లో పడ్డారు. కేసీఆర్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ధృవపత్రాలు సృష్టించిన ముగ్గురిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్డీఓ ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నెంబర్ 44/పీలో 2 ఎకరాల భూమికి రెగ్యులరైజేషన్ చేయాలని ముఖ్యమంత్రి లెటర్ హెడ్‌తో ఉన్న కాపీని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు నిందితులు పంపించారని తెలిపారు.
లెటర్ హెడ్‌లను యాకుత్‌పురాకు చెందిన టీఆర్‌ఎస్ లీడర్ నుంచి రూ.45 వేలకు నిందితుల్లో ఒకడైన మహమ్మద్ ఉస్మాన్ ఖురేషి కొనుగోలు చేశాడని వెల్లడించారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని వ్యాఖ్యానించారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకమే ఫోర్జరీ
Comments
Please login to add a commentAdd a comment