హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి మండల పరిధిలో శనివారం ఒకే కుటుంబంలో ముగ్గురికి స్వైన్‌ప్లూ సోకింది. కొండాపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి స్వైన్‌ప్లూ రావడంతో అదే కుటుంబంలోని ఇద్దరు వయోవృద్ధులకు కూడా లక్షణాలు ఉండటంతో ఆసుపత్రిలో చేరారని, స్వైన్‌ప్లూ అని తేలాల్సి ఉందని శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గంగాభవాని తెలిపారు. అదేవిధంగా మాదాపూర్‌లో 2, గచ్చిబౌలిలో ఒక కేసు నమోదైందని వెల్లడించారు. అదే విధంగా నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు 20స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసుల్లో 10 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో ముగ్గురు మృత్యువాత పడగా.. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రాజు అనే వ్యక్తితోపాటు అతని కుమారుడు నాలుగేళ్ల బాలుడు, లక్ష్మి అనే యువతి, గాంధీ ఆసుపత్రిలో పర్వీన్ అనే యువతి చికిత్స పొందుతున్నారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం చిన్నాయిగూడేనికి చెందిన బాలుడికి స్వైన్‌ఫ్లూ సోకింది. ఇద్దరు మాత్రం గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మృతుల్లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన వెంకటగురుప్రసాద్, నల్లగొండ పట్టణానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన రమేష్, శోభారాణి ఉన్నారు.
తగ్గని స్వైన్‌ఫ్లూ తీవ్రత
Published Sun, Feb 8 2015 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM
Advertisement