అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోన్న ప్రభుత్వ సిబ్బంది
సాక్షి, హైదరాబాద్ : శేరిలింగపల్లి మండలం గోపంపల్లి కేశవనగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తాము ఉంటున్న నివాసాలను కూల్చుతున్నారంటూ ఆందోళనకారులు పోలీసులపై కారం, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్‌ఐలతో పాటు పలువురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రెవిన్యూ అధికారులు, పోలీసులతో కలిసి కేశవ నగర్‌కు వచ్చారు.
కూల్చివేతలకు నిరసనగా ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అరెస్ట్ చేసేందుకు పోలీసులు రావడంతో కోపంతో రాళ్లదాడికి దిగారు. దీంతో ప్రతిగా పోలీసులు కూడా ఎదురుదాడికి దిగడంతో ఆ ప్రాంతమంతా కశ్మీర్‌ను తలపించింది. కేశవనగర్‌లోని సర్వేనంబర్ 37/2 రెండు ఎకరాల భూమిని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగా అందులో ఉన్న నిర్మాణాలను అధికారుల సహాయంతో కూల్చివేసింది.
Comments
Please login to add a commentAdd a comment