Agitators
-
భూదాన్ భూముల్లో ఉద్రిక్తత
ఖమ్మం అర్బన్: భూదాన్ భూముల్లో పేదలు ఇళ్ల స్థలాల కోసం రాత్రికి రాత్రే గుడిసెలు, రేకుల షెడ్లు వేయడం, ఉదయమే పోలీసులు వీటిని తొలగించడం.. వరస ఘటనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఖమ్మం నగరం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 147, 148, 149లోని భూదాన్ భూముల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు సూ ర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది ఆక్రమించి శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో గుడిసెలు వేశారు. శనివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన రెవెన్యూ, పోలీసులు తొలగించేందుకు చేరుకోగా వేలాది మంది ఆందోళనకారులు అడ్డుకున్నారు. భూదాన్ భూముల కింద ప్రభుత్వం తమకు కేటాయించినందున ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. కర్రలతో అధికారులను అడ్డుకుని.. గుడిసెల తొలగింపునకు యత్నించిన యంత్రాంగాన్ని కర్రలతో అడ్డుకున్నారు. దీంతో అదనపు కలెక్టర్ మధుసూదన్ ఆందోళనకారుల ప్రతినిధులతో రెండు గంటలకుపైగా చర్చించారు. పత్రాలు ఉంటే చూపించి నివాసాలు ఏర్పరుచుకోవాలని, లేకపోతే శాంతియుతంగా ఇక్కడ నుంచి వెళ్లాలని సూచించారు. సాయంత్రంలోగా ఖాళీ చేయకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా వారు కదలకపోవడంతో సీపీ విష్ణు ఎస్.వారియర్ సహా పోలీసు బలగాలు భారీగా చేరుకుని జేసీబీలతో గుడిసెలను తొలగించారు. గూడు ఆశ చూపారంటూ.. విలపించిన బాధితులు భూదాన్ భూముల్లో ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇప్పిస్తా మని నమ్మించిన కొందరు డబ్బులు వసూలు చేశారని ఆందోళనకారులు కొందరు విలపించారు. గుడిసెలు వేసుకునేందుకు నాలుగేళ్ల క్రితం రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరిగింది. అధికారులు వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఆక్రమిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ భూదాన్ భూములను ఆక్రమిస్తే సహించేది లేదని, ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు. ఆక్రమణదారులపై, వారిని ప్రోత్సహించిన వారిపై భూఆక్రమణ, క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. -
అగ్నిపథ్ ఆందోళనకారులకు 14 రోజుల రిమాండ్ విధించిన రైల్వే జడ్జి
-
జడ్జి ముందు సికింద్రాబాద్ ఆందోళనకారులు
-
మంత్రి విశ్వరూప్ క్యాంపు కార్యాలయంపై ఆందోళనకారుల దాడి
-
పోలీసులు రాకపోతే నా కుటుంబం సజీవ దహనమయ్యేది
అమలాపురం టౌన్: ‘మా ఇంటి పైఅంతస్తులో నేను, నా కుటుంబ సభ్యులు ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఆందోళనకారులు నిప్పు పెట్టారు. బయటకు వచ్చేసరికి ఇల్లంతా మంటల్లో ఉంది. పోలీసులు ముఖ్యంగా డీఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. తక్షణమే నన్ను, నా భార్య, కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చి రక్షించారు. లేకపోతే నా కుంటుంబ ఆ మంటల్లో సజీవ దహనం అయ్యేది’ అని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై మంగళవారం జరిగిన విధ్వంసంలో భాగంగా ఆందోళనకారులు ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టి బీభత్సం సృష్టించారు. ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఎమ్మెల్యే పొన్నాడ మంగళవారం రాత్రి ‘సాక్షి’తో మాట్లాడారు. ఇది కచ్చితంగా ప్రతిపక్షాల కుట్ర అన్నారు. ప్రతిపక్ష నేతలు వెనక ఉండి వారి కార్యకర్తలను ఉసిగొల్పి పక్కా పథకంతో విధ్వంసానికి పాల్పడ్డారని చెప్పారు. పెట్రోల్ డబ్బాలతో వచ్చి ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేసి నిప్పు పెట్టారంటే ఎంతటి పక్కా ప్రణాళికతో వచ్చారో అర్థం అవుతోందన్నారు. బస్సులను కూడా అలాగే ధ్వంసం, దహనం చేశారన్నారు. పోలీసులపై కూడా కర్కశంగా రాళ్లు రువ్వారని, ఇవన్నీ చూస్తుంటే ముందస్తు వ్యూహంతోనే దాడులు, ధ్వంసాలకు దిగినట్టు స్పష్టమవుతోందని ఎమ్మెల్యే అన్నారు. -
‘అమరావతి’ ఆందోళనకారుల ర్యాలీ
సాక్షి, గుంటూరు/తాడికొండ: ముందస్తు అనుమతులు లేకుండా రాజధాని అమరావతి ఆందోళనకారులు ర్యాలీ చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. గుంటూరు జిల్లాలోని అమరావతి రాజధాని ప్రాంతంలో 144వ సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఇక్కడ నిరసనలు, ర్యాలీలు, ఆందోళనలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి. అయితే ఈ నిబంధనలన్నింటినీ పక్కనపెట్టి ఆందోళనకారులు సోమవారం విజయవాడలోని దుర్గమ్మ గుడి దర్శనానికంటూ ర్యాలీగా బయల్దేరారు. ఓవైపు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పాదయాత్రగా ఆందోళనకారులు విజయవాడకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం బ్యారేజీ, మందడం, రాజధాని గ్రామాల్లో ఎక్కడికక్కడ అనుమతులు లేవని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆందోళనకారులు విజయవాడకు బయల్దేరతామని పట్టుబట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తమను అడ్డుకున్నారని తుళ్లూరు మండలం వెలగపూడిలోని సచివాలయం ముట్టడికి యత్నించారు. మల్కాపురం జంక్షన్ వద్ద పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయి. పలువురు పోలీస్ సిబ్బందిని పిడిగుద్దులు గుద్దడం, గోళ్లతో రక్కడం చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగ్బంధానికి యత్నం దుర్గ గుడి దర్శనం పేరిట ఆందోళనకారులందరూ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుని బ్యారేజీని దిగ్బంధించాలని ప్రణాళిక రచించుకున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని నిఘా వర్గాలు ఆదివారమే గుర్తించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామునే ఎక్కడికక్కడ బారికేడ్లు, పికెట్లు ఏర్పాటు చేశారు. ఆందోళనకారుల ముసుగులో టీడీపీ నేతలే ఈ కుట్రలకు తెరలేపినట్టు విమర్శలొస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ప్రతిపక్ష నేత చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ముందస్తు అనుమతులు లేకుండా ఆందోళనకారులు ర్యాలీలకు దిగడం చూస్తుంటే బుధవారం జరిగే ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించేలా కుట్రలు పన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. -
నిరసనల శబరిమల
పంబా: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వస్తున మహిళా భక్తుల అడ్డగింపుల పర్వం ఐదో రోజూ కొనసాగింది. ఆదివారం ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఆరుగురు తెలుగు మహిళా భక్తులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలమ్మ(47) అనే మహిళ కుటుంబంతో కలసి శబరిమల కొండ ఎక్కుతుండగా సన్నిధానం వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ నినాదాలు చేస్తూ ఆమెను అడ్డుకున్నారు. అప్పటికే 4 కిలోమీటర్ల మేర కొండ ఎక్కి వచ్చిన ఆమెను చుట్టుముట్టి వయసు ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డు చూపాల్సిందిగా కోరారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన బాలమ్మ స్పృహ కోల్పోయారు. దీంతో వెంటనే ఆమెను అంబులెన్స్‌లో పంబాలోని ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు బంధువులతో వచ్చిన 40 ఏళ్ల వయసు ఉన్న మరో ఇద్దరు మహిళా భక్తులను కూడా కొండపైకి రానివ్వకుండా ఆందోళనకారులు నిలువరించారు. దీంతో పోలీసులు వారిరువురిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అనంతరం నిలక్కల్ బేస్ క్యాంప్‌నకు వచ్చిన ఆ ఇద్దరు ఆలయ సాంప్రదాయాన్ని అతిక్రమించటానికి తాము ఇక్కడికి రాలేదని రాతపూర్వకంగా తెలిపారు. వారిరువురిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాసంతి (41), ఆదిశేషి (42)గా గుర్తించారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన రెహానా ఫాతిమాను ఇస్లాం నుంచి బహిష్కరించినట్లు కేరళ ముస్లిం జమాత్ మండలి వెల్లడించింది. -
కేశవనగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు
-
కూల్చివేతలు.. పోలీసులపై రాళ్లదాడి
సాక్షి, హైదరాబాద్ : శేరిలింగపల్లి మండలం గోపంపల్లి కేశవనగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తాము ఉంటున్న నివాసాలను కూల్చుతున్నారంటూ ఆందోళనకారులు పోలీసులపై కారం, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్ఐలతో పాటు పలువురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రెవిన్యూ అధికారులు, పోలీసులతో కలిసి కేశవ నగర్‌కు వచ్చారు. కూల్చివేతలకు నిరసనగా ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అరెస్ట్ చేసేందుకు పోలీసులు రావడంతో కోపంతో రాళ్లదాడికి దిగారు. దీంతో ప్రతిగా పోలీసులు కూడా ఎదురుదాడికి దిగడంతో ఆ ప్రాంతమంతా కశ్మీర్‌ను తలపించింది. కేశవనగర్‌లోని సర్వేనంబర్ 37/2 రెండు ఎకరాల భూమిని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగా అందులో ఉన్న నిర్మాణాలను అధికారుల సహాయంతో కూల్చివేసింది. -
కశ్మీర్లో ఆర్మీ వాహనంపై రాళ్లవర్షం
పుల్వామా/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. గస్తీకి వెళ్లివస్తున్న ఆర్మీ వాహనంపై రాళ్లవర్షం కురిపించారు. దీంతో తొలుత హెచ్చరించిన అనంతరం ఆర్మీ అధికారులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయమై ఆర్మీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ..నౌపొరా ప్రాంతంలో రాంగ్ పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఆ వాహనాలను పక్కకు తీయాలని కోరేందుకు ఆర్మీ అధికారులు వాహనం దిగారని,ఆందోళనకారులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని ఆర్మీ వాహనంపై రాళ్లదాడికి పాల్పడ్డారని వెల్లడించారు. మరోవైపు కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. శ్రీనగర్‌లోని కక్ సరాయ్ ప్రాంతంలో శుక్రవారం వాహనాల తనిఖీలు చేపడుతున్న భద్రతాబలగాలు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులతో పాటు ముగ్గురు పౌరులు గాయపడినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
తుందుర్రులో మళ్లీ పోలీసు రాజ్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి మెగా ఫుడ్‌పార్కు వ్యతిరేక పోరాటంపై పోలీసులు మళ్లీ ఉక్కుపాదం మోపుతున్నారు. అర్ధరాత్రి ఇళ్లలో తనిఖీల పేరుతో ఆ ప్రాంతంలో ఒక భయానక వాతావరణం నెలకొల్పుతున్నారు. గత నాలుగేళ్లుగా కాలుష్యాన్ని పెంచే ఈ ఫుడ్‌పార్కు వద్దని పరిసర గ్రామ ప్రజలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పంచాయతీ అనుమతులు లేకుండా బలవంతంగా పైపులైన్, 33 కేవీ విద్యుత్‌లైన్‌ను పొలాల మధ్యగా వేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఒక విద్యుత్ స్తంభాన్ని ధ్వంసం చేశారంటూ పోరాట కమిటీ నేతలపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి వారి కోసం గాలిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యమే విద్యుత్ స్తంభాన్ని ధ్వంసం చేసి తమపై తప్పుడు కేసులు పెట్టడం ద్వారా పనులు వేగం చేసేందుకు కుట్ర పన్నిందని పోరాట కమిటీ నేతలు ఆరోపిస్తున్నారు. కాలుష్యం కారణంగా తమ జీవితాలు రోడ్డున పడతాయని ఫుడ్‌పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామస్తులు గత నాలుగేళ్లుగా అలుపెరుగని ఉద్యమం చేస్తున్నారు. వీరిలో పలువురిపై కేసులు పెట్టి జైలుకు పంపినా వెనుకడుగు వేయకుండా ఉద్యమం కొనసాగిస్తున్నారు. మొదట్లో అసలు కాలుష్యమే లేదని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మురుగునీరు పోయేం దుకు అంటూ రూ.11 కోట్లతో పైపులైన్ వేయాలని నిర్ణయించారు. అది కూడా కేవలం ఎనిమిది అంగుళాల పైపులైన్ వేయడం, దాన్ని కూడా పంచాయతీ అనుమతి లేకుండా తుందుర్రు గ్రామం మధ్య నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దీన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పైపులైన్‌ను పెదగరువు మీదుగా తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఇదే సమయంలో రైతుల పొలాల్లో నుంచి 33 కేవీ విద్యుత్‌లైన్ వేసే ప్రయత్నం చేశారు. దీన్ని కూడా గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. తమ పొలాల్లో నుంచి అనుమతి లేకుండా 33 కేవీ లైన్ ఎలా వేస్తారని నిలదీశారు. విద్యుత్ అధికారులను కూడా నిలదీయడంతో వారు పనులు నిలిపివేశారు. మూడు రోజుల క్రితం 33 కేవీ లైన్ కోసం వేసిన విద్యుత్ స్తంభాలను గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. దీనిపై విద్యుత్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నర్సాపురం పోలీసులు పోరాట కమిటీ నాయకుల కోసం గత మూడు రోజులుగా గాలిస్తున్నారు. అర్ధరాత్రి సమయాల్లో వాళ్ల ఇళ్లలోకి వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. ఇంట్లో మహిళలు మాత్రమే ఒంటరిగా ఉన్న సమయంలో పోలీసులు ఇళ్లంతా తని ఖీలు చేయడంతో పాటు అసభ్యంగా మాట్లాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఐ ప్రవర్తిస్తున్న తీరును వారు తప్పు పడుతున్నారు. దీంతో సదరు ఎస్ఐపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు పోరాటకమిటీ నేతలు సన్నద్ధం అవుతున్నారు. పోలీసుల గాలింపుతో పోరాట కమిటీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికే తుందుర్రుకు చెందిన శేషగిరిరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రెండు రోజులుగా నర్సాపురం పోలీసు స్టేషన్లోనే ఉంచారు. మిగిలిన వారు కూడా దొరికిన తర్వాత వీరిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలన్నది పోలీసు వ్యూహంగా కనపడుతోంది. ముఖ్యమైన నాయకులను జైలుకు పంపిన తర్వాత ఫ్యాక్టరీకి సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయడంలో భాగంగానే విద్యుత్ స్తంభాలను ఫ్యాక్టరీ యాజమాన్యమే పగులగొట్టించి తమపై కేసులు పెట్టిందని పోరాట కమిటీ నేతలు విమర్శిస్తున్నారు. ఉద్యమకారుడి అరెస్టు తుందుర్రు ఆక్వామెగా ఫుడ్ ఫ్యాక్టరీకి సంబంధించి గతంలో నమోదు చేసిన కేసులో సోమవారం ఒక వ్యక్తిని అరెస్టు చేనట్లు నరసాపురం రూరల్ ఎస్సై సీహెచ్ ఆంజనేయులు తెలిపారు. భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన ఆరేటి శేషగిరిరావు అనే వ్యక్తిపై గతంలో పోలీసులు, ఉద్యోగులపై దౌర్జన్యం, ఘర్షణలకు పాల్పడటం వంటి కేసులకు సంబంధించి కేసు నమోదు చేశామన్నారు. సోమవారం రాత్రి అతనిని అరెస్టు చేసి సెక్షన్ 341, 353, రెడ్‌విత్ 34 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. అర్ధరాత్రులు సోదాలా కరెంట్ స్తంభాలు ఎవరో పగలగొట్టారంట. దీంతో రాత్రులు 20 మందికి పైగా పోలీసులు ఇళ్లలోకి వచ్చి మహిళలు అన్న గౌరవం లేకుండా ఇష్టాను సారంగా వ్యవహరించారు. మాకు భయమేసింది. మాకు అండగా ఉండాల్సిన పోలీసులు ఫ్యాక్టరీ వాళ్లకు అండగా నిలబడుతున్నారు. – జవ్వాది వెంకటరమణ, ఎంపీటీసీ, తుందుర్రు బెంబేలెత్తిపోయాం మహిళా పోలీసులు లేకుండా కేవలం మగ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి 20కి మందికిపైగా వచ్చి సోదాలు చేశారు. మాకు భయమేసింది. గతంలో లాగానే మావోళ్లను కొట్టుతున్నారేమోనని అనుకున్నాం. కరెంట్ స్తంభాలు ఎవరో పగలగొడితే మాపై కేసులు పెడుతున్నారు. మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారు. – ఆరేటి సత్యవతి, మహిళా పోరాటకమిటీ నాయకురాలు, తుందుర్రు పోలీసుల హైరానాతో ఇబ్బందులు పోలీసోళ్ళే దగ్గరుండి ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్టున్నారు. మాపై వీడియోలు తీసి ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే ఉక్కుపాదం మోపుతున్నారు. ఫ్యాక్టరీవోళ్లు స్పందించడం లేదు. మా ఊళ్లో ఎప్పడూ పోలీసోళ్లను చూసిండం. గత నాలుగు సంవత్సరాలుగా ఖాకీలతో, సైరన్ హారన్లతో కంటిమీద కునుకుపట్టడం లేదు. – సముద్రాల సత్యవాణి, గృహిణి, కంసాలి బేతపూడి ప్రజలకు వ్యతిరేకంగా నిర్మించడం దారుణం గత నాలుగు సంవత్సరాలుగా ఫ్యాక్టరీ వద్దని ప్రజలు పోరాడుతున్నా బలవంతంగా నిర్మిస్తున్నారు. 15 కిలోమీటర్ల పైపులైన్‌ను రూ.11 కోట్లా. అది 8 అంగుళాల పైపా. మళ్లీ రోజుకు ఆ పంపు ద్వారా లక్షా 50 వేల లీటర్ల వ్యర్థ నీరు వెళ్లాలా ఇది దారుణం. దీనిపై కేంద్ర బృందం విచారణ చేపట్టాలి. – డి. కళ్యాణి, ఐద్వా జిల్లా కార్యదర్శి, భీమవరం -
‘గ్యాస్’ మంటలు
తంజావూరు జిల్లా కదిరిమంగళం గ్రామ పంట పొలాల్లో ఏడుచోట్ల ఓఎన్జీసీ బావులను ఏర్పాటుచేసి క్రూడాయిల్ తోడే పనులు జరుగుతున్నాయి. ఈ దశలో శుక్రవారం సాయంత్రం బావికి అడుగుభాగంలో అమర్చిన పైప్‌లైన్‌కు పగుళ్లు ఏర్పడగా క్రూడాయిల్ లీకై పంట పొలాల్లో ప్రవహించింది. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు క్రూడాయిల్ వెలికతీత పనులు నిలిపివేయాలని రాస్తారోకో చేపట్టారు. ఓఎన్జీసీ ఉద్యోగులను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో క్రూడాయిల్ లీకవుతున్నచోట కొందరు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పెద్దఎత్తున మంటలు రేగడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. ఈ దుశ్చర్యకు కారకులైన కొందరు ఆందోళనకారులను అరెస్ట్‌చేసి జైళ్లలో పెట్టారు. అరెస్టులకు నిరసనగా శనివారం గ్రామంలో దుకాణాలను మూసివేశారు. ఐదు వందల మందికి పైగా పోలీసులు గ్రామంలో పహారా కాస్తున్నారు. గ్రామాల్లో శాంతి సామరస్యాన్ని కాపాడాల్సిన అధికారులు సాయుధ పోలీసులతో లాఠీచార్జ్ జరిపించడమా అని విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా, తంజావూరు జిల్లా కలెక్టర్ అన్నాదురై శనివారం ఉదయం 10 గంటలకు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఓఎన్జీసీ సమస్యపై ప్రజలతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రజల కోర్కెను తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఓన్ఎజీసీ బావుల వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం కలుగకుండా చూస్తామని చెప్పారు. క్రూడాయిల్ ప్రవహించిన ప్రాంతంలో వందురోజుల ఉపాధి పథకాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసుల వలయంలో మెరీనా తంజావూరు గ్రామంలో పోలీసుల జరిపిన లాఠీ చార్జ్‌కి, అరెస్టులకు నిరసనగా ఆందోళనకారులకు సంఘీభావం తెలుపుతూ చెన్నై మెరీనా బీచ్‌లో దీక్షలు చేపట్టాలని కొన్ని యువజన సంఘాలు నిర్ణయించుకున్నాయి. పోలీసులకు శుక్రవారం రాత్రి ఈ సమాచారం అందింది. జల్లికట్టు తరహాలో ఉద్యమాన్ని చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలని యువకులు సిద్ధం కావడంతో ఆందోళన చెందిన పోలీసు శాఖ రాత్రికి రాత్రే మెరీనా బీచ్‌ను తన అదుపులోకి తీసుకుంది. సుమారు 200 మంది పోలీసులు మెరీనా బీచ్ రోడ్డులోని లైట్‌హౌస్ నుంచి నెప్పియార్ బ్రిడ్జి వరకు బందోబస్తు చేపట్టారు. షిప్టు పద్ధతిలో 24 గంటలపాటూ బందోబస్తు కొనసాగనుంది. నగర పౌరులు ప్రతిరోజూ ఉదయాన్నే మెరీనాబీచ్ సర్వీసు రోడ్డులో వాహనాలను పార్కింగ్ చేసి జాగింగ్ చేయడం పరిపాటి. అయితే ఓఎన్జీసీ ఆందోళన నేపధ్యంలో వాహనాలను అనుమతించలేదు. దీంతో లైట్‌హౌస్ సమీపంలోని వాలాజా రోడ్డులో వాహనాలను నిలిపి జాగింగ్ చేశారు. -
మంత్రి కంట్లో నల్లసిరా
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ధన్‌గర్‌ల ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతోంది. ధన్గర్లు శుక్రవారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్ర సహకారశాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ కంట్లో ఓ ఆందోళనకారుడు నల్లసిరా పోయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పుణే జిల్లా, ఇంద్రాపూర్‌లోని భిగవణ్లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకెళ్తే... తమను షెడ్యూల్డ్ ట్రైబల్స్(ఎస్టీ) జాబితాలో చేర్చాలంటూ కొన్నిరోజులుగా ధన్గర్లు రకరకాల రూపాల్లో తమ డిమాండ్‌ను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా పుణేలోని ఇంద్రాపూర్ తాలూకా, భిగవణ్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి హర్షవర్ధన్ పాటిల్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ధన్గర్ సామాజికవర్గానికి చెందిన కొందరు అక్కడకు చేరుకున్నారు. కార్యక్రమం ముగిసేంతవరకు వేచి చూసి, తిరిగి వస్తుండగా ఆయన కారును చుట్టుముట్టారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చొరవ చూపాలంటూ నినాదాలు చేశారు. వారితో మంత్రి మాట్లాడుతుండగానే ఓ వ్యక్తి మంత్రి ముఖంపై నల్లసిరా పోశాడు. ఒక్కసారిగా సిరా గుమ్మరించడంతో అది మంత్రి కంట్లో పడింది. దీంతో మంత్రి కంటికి గాయమైంది. సిరాలో యాసిడ్ ఉంటుందని, ఫలితంగానే ఇబ్బంది కలిగి ఉండవచ్చని స్థానిక వైద్యుడొకరు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రిని అక్కడ నుంచి పంపేశారు. ఇరువర్గాల వాగ్వాదం.. తమ పార్టీకి చెందిన మంత్రిపై సిరా పోయడంతో ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులైన కాంగ్రెస్ కార్యకర్తలు, మంత్రి అనుచరులు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. ఓ సందర్భంలో ఇరువర్గాలు కొట్టుకున్నారు కూడా. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. ఆ తర్వాత కూడా ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు కొనసాగాయి. భిగవణ్ బంద్‌కు కాంగ్రెస్ పిలుపు... మంత్రి కంట్లో సిరా పోయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఇంద్రాపూర్, భిగ్వణ్ బంద్‌కు పిలుపునిచ్చారు. అనంతరం పుణే-ఇంద్రాపూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపైనే భైటాయించి నినాదాలు చేశారు. దీంతో ఈ ర హదారిపై దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరకు పోలీసులు కలుగజేసుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
సమైక్య ఉద్యమకారులపై 108 కేసులు
ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సుమారు మూడు నెలలుగా గుంటూరు రేంజ్ పరిధి ఆందోళనలు నిర్వహిస్తున్న ఉద్యమకారులపై ఇప్పటి వరకు మొత్తం 108 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో మొత్తం 1067 మందిని అరెస్టు చేసి వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. రేంజ్‌లోని గుంటూరు అర్బన్, రూరల్, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ప్రసుతం ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ శాంతిభద్రతలు అదుపులో ఉండటంతో కేంద్ర బలగాలను సగానికి తగ్గించి వెనక్కు పంపారు. మిగిలిన వారిని సమస్యాత్మక ప్రా ంతాల్లో వినియోగిస్తున్నారు. రేంజ్ పరిధిలో అధికంగా ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 40కిపైగా కేసులు నమోదు చేసి 380 మందిని అరెస్టు చేశారు. తర్వాతి స్థానాల్లో పొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు అర్బన్ జిల్లాలు నిలిచాయి. గుంటూరు రూరల్ జిల్లాలో కేసులు నామమాత్రంగా ఉన్నాయి. శాంతిభద్రతల పరిస్థితి, అధికారుల పనితీరు తదితరాలను స్వయంగా పరిశీలించేందుకు బుధవారం ఐజీ సునీల్‌కుమార్ ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వెళ్లారు. -
అడుగడుగునా అడ్డగింత
సాక్షి నెట్వర్క్ : సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సమైక్యాంధ్ర సెగ తగిలింది. సంఘీభావం పేరుతో దీక్షా శిబిరాల వద్దకు వచ్చిన నేతలను ఉద్యమకారులు అడుగడుగునా అడ్డుకున్నారు. రాజకీయాలు చేయొద్దు..రాజీనామాలు చేసి రండి అంటూ ఘెరావ్ చేశారు. కొద్దిమంది నాయకులు చేసేది లేక అక్కడి నుంచి వెనుదిరగగా.. మరికొందరు మాత్రం ఉద్యోగులను మీరూ రాజీనామా చేయండి మేం చేస్తామంటూ ప్రగల్బాలు పలికారు. దీంతో మరింత కోపోద్రిక్తులైన ఆందోళనకారులు వారిని అక్కడి నుంచి తరిమికొట్టేంత పనిచేశారు. లగడపాటితో లడాయి.. సమైక్యాంధ్ర పేరుతో చీటికిమాటికీ మీడియా సమావేశాలు పెడుతూ తానే మొదటి సమైక్య చాంపియన్ అని గొప్పలు చెప్పుకునే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు ఉద్యమకారుల నుంచి లడాయి తప్పలేదు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలిపేందుకు శనివారం యూనివర్సిటీకి వచ్చిన ఆయన్ను సమైక్యాంధ్ర విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నాయకులు యూనివర్సిటీ గేట్ వద్దే అడ్డుకున్నారు. లగడపాటి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన విద్యార్థులకు ఎంతగా నచ్చజెప్పాలని చూసినా వారు విన్పించుకోలేదు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మీకు ముందే తెలుసుకదా.. ప్రజలకు ఎందుకు తెలియజేయలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిరాహారదీక్షా శిబిరం వద్దా అదే పరిస్థితి ఎదురైంది. లగడపాటి వెళ్లిపోవాలని కొందరు విద్యార్థులు దీక్షా శిబిరం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇక చేసేది లేక ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు దిగారు. తాము మనసు చంపుకుని ఆ పార్టీలో ఉంటున్నామంటూ చెప్పుకొచ్చారు. ఉద్యమకారుల ‘విశ్వరూప’ం తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లిలో రిలేదీక్ష శిబిరానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన రాష్ర్టమంత్రి పినిపే విశ్వరూప్‌ను సమైక్యవాదులు ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనుయాయులకు, సమైక్యవాదులకు మధ్య తోపులాట జరిగింది. పి.గన్నవరం ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవిని మామిడికుదురు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఉద్యోగులు ఘెరావ్ చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటారు’ అంటూ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ చేసి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎమ్మెల్యేను రెండుసార్లు అడ్డుకున్న జేఏసీ ప్రతినిధులు ‘ఎమ్మెల్యే గో బ్యాక్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే రాజీనామా’ చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దానిని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై జేఏసీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో జీవీఎంసీ నుంచి సౌత్జైలు రోడ్డు వద్దకు చేరుకున్న ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సమైక్య ర్యాలీకి అదే మార్గంలో వెళుతున్న రాజ్యసభ సభ్యుడు మద్దతు తెలిపేందుకు కారు దిగారు. దీంతో కొంతమంది యువకులు ఆయనను అడ్డుకున్నారు. రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలోకి రావాలని నినాదాలు చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, డోన్ ఎమ్మెల్యే కేఈ కష్ణమూర్తిని జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. సమైక్యవాదులతో జే‘ఢీ’ గుంటూరు జిల్లా తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో శనివారం నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు హాజరైన కేంద్రమంత్రి జేడీ శీలంను సమైక్యవాదులు అడ్డుకున్నారు. పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఆయన మంత్రుల రాజీనామా కోరే అధికారులెందుకు రాజీనామా చేయడం లేదని ఎదురు ప్రశ్నించడంతో వాదులాట జరిగింది. కేబినెట్లో ఉండి సమైక్యవాదుల ప్రతినిధిగా ఆందోళనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని చెప్పినా సంతప్తి చెందని సమైక్యవాదులు ఆయనను ఘెరావ్ చేశారు.