వెల్లివిరుస్తున్న మానవత్వం | Common People Helping Poor During Lock down | Sakshi
Sakshi News home page

సామాన్యుల సాయం

Published Thu, Apr 9 2020 12:55 PM | Last Updated on Thu, Apr 9 2020 2:36 PM

Common People Helping Poor During Lock down - Sakshi

కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని ప్రపంచం విలవిలలాడుతున్న నేపథ్యంలో వైరస్‌ విస్తరణను అరికట్టేందుకు భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో చాలా మంది పేదవారు ఆహారం దొరకక అవస్థులు పడుతున్నారు. అయితే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు చాలా పథకాలు అమలు చేస్తూ అండగా నిలుస్తున్నాయి. వీటికి తోడు మేము సైతం అంటూ సామాన్యులు కూడా వారిని ఆదుకునేందుకు కదం తొక్కుతున్నారు. వారికి చేతనైనంత సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అలా సాయం చేస్తున్న కొందరు సామాన్యలు ఎందరికి స్ఫూర్తిగా నిలవడం కోసం వారు చేస్తున్న సేవకార్యక్రమాలను సాక్షి.కామ్‌తో పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం...

తూర్పుగోదావరి జిల్లా మలికిపురానికి చెందిన చెల్లుబోయిన మనోజ్‌ వలస కూలీలకు, దినసరి కూలీలకు,నిరుపేదలకు కూరగాయలు, నిత్యవసర సరుకులు అందించి అండగా నిలిచారు. తను చేసే సాయంతో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

లాక్ డౌన్ తో రోడ్లపై తిరిగే మూగజీవాలకూ ఆహారం కరువైంది.సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద వుండే ఆవులకు నిత్యం గుడికి వచ్చే భక్తులు అరటి పళ్ళు,కూరగాయలను ఆహారంగా పెట్టే వారు అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఆలయానికి భక్తులు రాకపోడంతో వాటికి ఆహారం పెట్టే నాధుడు లేక రోడ్లపై కి వచ్చేస్తున్నాయి. చుట్టూ గడ్డి వున్నా వాటికి గడ్డి అలవాటు లేకపోవడంతో ఆహారం లేక అలమటిస్తున్నాయి.దీన్ని గమనించిన సఖినేటిపల్లి ఎస్సై సురేష్ ఆ ఆవులకు అరటిపండ్లు, ఆకుకూరలు తీసుకొచ్చి వాటికి ఆహారం అందించి తన మానవత్వాన్ని చాటుకుని నలుగురికి ఆదర్శం అయ్యారు.ఒక ప్రక్క ఇరవై నాలుగు గంటలు పోలీసు విధులు నిర్వహిస్తూనే ఈ మూగజీవాల పట్ల తనకున్న ప్రేమను చూపిస్తున్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో అనేక మంది ఇబ్బంది పడటం చూస్తున్న చాలా మంది వారికి చేతనైనంత సాయం చేస్తున్నారు. పుట్టిన రోజులాంటి వేడుకల్లో పేదలకు సాయం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ విధంగానే తాళ్లపూడి శ్రీ విజేత హై స్కూల్ కరస్పాండెంట్ మోపిదేవి విజయ లక్ష్మి బుధవారం తన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చెయ్యడం,విందు ఇవ్వడం వంటివి రద్దు చేసుకొని వాటి స్థానంలో శాని టైజేషన్ బాటిల్స్ ,లస్సీ పేకెట్స్  పంపిణీ చేశారు.  విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందికి ,పాత్రి కేయులకు వీటిని పంపిణీ చేసి తన ఆదర్శాన్ని చాటుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ విధించడంతో పనులు లేక ఇబ్బందిపడుతున్న 150 కుటుంబాలకు అన్న దేవరపేట గ్రామానికి చెందిన కొత్త చందు కూరగాయలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా కొడమంచిలి జానుబాబు, బొచ్చు కుమార్, విజయ్, మన్యం ప్రసాద్, రసూల్, కొడమంచిలి విజయ రత్నం, బంగారు బాబు, మంచెల్లి సోమరాజు, బొచ్చు శ్రీను, కొల్లూరు సురేష్, దొండపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌లో సుందర్‌ ఊట తన  స్నేహితులతో కలసి సొంత ఖర్చులతో  తమ  ఊరిలో  800 డెట్టాల్  సోప్ లు ఇచ్చి హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తూ ఎవ్వరు బయట తిరగొద్దు అని కొన్ని జాగ్రత్తలు చెబుతూ తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. 


విజయవాడ మొగల్రాజపురం లో నివాసం  ఉంటున్న దోమకొండ శ్యామ్ కుమార్ తల్లి దోమకొండ మేరీ, స్నేహితులతో కలిసి ఆకలితో బాధపడుతున్న వారికి అన్నపానీయాలు అందించి పెద్ద మనసు చాటుకున్నారు. 

విస్సన్నపేటకు చెందిన తేజ ఇంటర్‌నెట్‌ నిర్వహకులు, పాత్రికేయులు ఎల్‌. బాబ్జీ వారి తండ్రి సుబ్బారావు జ్ఞాపకార్థం మదర్‌దెరిస్సా అనాధాశ్రమ నిర్వాహకులకు 25 కేజీల బియ్యాన్ని అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement