సాక్షి,నల్గొండ: కరోనా మహమ్మారి చిన్న వారి నుంచి పెద్దవారి వరకు కష్టాన్ని కలిగిస్తోంది. ఈ వైరస్ విజృంభించడంతో కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కదీంతో రోజు వారీ కూలీలు, వలస కూలీలు, పేదలకు ఆహారం లభించక, నిత్యవసరాలు అందుబాటులో లేక పూటగడవని పరిస్థితి ఏర్పడింది. అయితే వారికి సాయంగా అనేక మంది వారిని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు వారికి తోచిన సాయం అందిస్తున్నారు. (జగనన్న సైనికులు పేరిట ఐటీ ఉద్యోగులు సేవ)
ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో అత్యంత నిరుపేద, రోజువారి వ్యవసాయ కూలీ, వృద్ధులు, దివ్యాoగులలో 200 కుటుంబాలను ఎంపిక చేసి వారికి నెలకు సరిపోను సుమారు రూ.500ల విలువగల లక్ష రూపాయల నిత్యవసర వస్తువులు డొనేట్ కార్ట్ పౌండేషన్ వారి సహకారంతో తొగర్రాయి శ్రీ వివేకానంద యువజన సంఘం సభ్యులు వారి ఇంటికే వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు నందుల లక్ష్మీనరసింహశాస్త్రి, ప్రస్తుత అధ్యక్షుడు సంతోష్, డోనేట్ కార్ట్ సీఈఓ సందీప్ శ్రీవాత్సవ్, యూత్ సభ్యులతో పాటు గ్రామ సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ ఇతర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
చదవండి: (ఆపన్నహస్తం అందిస్తున్న అభయం పౌండేషన్)
Comments
Please login to add a commentAdd a comment