
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచలోని అనేక దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. అదే బాటలో భారతప్రభుత్వం కూడా మార్చి 24 తేదీ నుంచి మొదట మూడు వారాల పాటు లాక్‌డౌన్‌ను విధించారు. అయినప్పటికీ కరోనా కేసుల సంఖ్యలో దేశంలో విపరీతంగా పెరిగిపోవడంతో లాక్‌డౌన్‌ను మే3 వరకు పొడిగిస్తున్నట్లు మోదీ మరోసారి ప్రకటించారు. దీంతో రోజువారి కూలీ చేస్తే గాని పూట గడవని బడుగు వర్గాల వారి బతుకులు భారంగా మారాయి. నిత్యవసర సరుకుల ధరలు పెరగడం, కొనడానికి డబ్బులు లేకపోవడంతో సహా పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. అయితే వారిని ఆదుకునేందుకు, వారి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు అనేక విధాలుగా కృషి చేస్తున్న అవి కొంత మంది వరకు మాత్రమే చేరుతున్నాయి. ఇంకా చాలా మంది ఖాళీ కడుపులతో ఆహారం ఎవరు పెడతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అటువంటి వారిని ఆదుకునేందుకు చాలా స్వచ్ఛంధ సంస్థలతో పాటు అనేక మంది సామాన్యులు సైతం ముందుకు వచ్చి చేయూతనందిస్తున్నారు. (వాళ్లు కూడా మనవాళ్లే)
చిత్తూరు జిల్లా బాధలవాళ్ళం గ్రామానికి చెందిన రమణ తమ గ్రామంలో నిరుపేదలకు, రోజు వారీ కూలీ చేసుకునే వారికి, వలస కూలీలకు కూరగాయలు, నిత్యవసర సరుకులు అందించి మానవత్వాన్ని చాటుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
లాక్‌డౌన్‌ను కేంద్రం మే 3 వరకు ప్రకటిస్తే తెలంగాణ సర్కార్ మాత్రం మే7 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిలో డాక్టర్లు, పోలీసులు ముందు వరుసలో ఉంటారు. ఈ నేపథ్యంలోనే అనురాగ సంస్థ ప్రతినిధి రామ్ రాచకొండ డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీసు రక్షిత మూర్తికి 100 శానిటైజర్ బాటిళ్లు, 250 మాస్క్‌లను అందించారు. వీటితో పాటు అనురాగ్ సంస్థ కాప్రా, రాచకొండ ప్రాంతాల్లోని పేదలకు నిత్యవసర సరుకులు, అహారాన్ని అందిస్తోన్నారు. (సాయం అందిస్తున్న హెల్పింగ్ హాండ్స్)
బెంగుళూరు వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్ టీం వారు కడప జిల్లా రైల్వే కోడూర్ నియోజక వర్గంలో లాక్‌డౌన్ కారణంగా పూట గడవక ఇబ్బంది పడుతున్న దాదాపు 3000 కుటుంబాలకి నిత్యవసర సరుకులు,పప్పులు,కూరగాయలు సాయం చేసి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్‌రెడ్డి, చంద్ర పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కొవ్వూరులో లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు శ్రీహరి సాయాన్ని అందించారు. 250 మంది పేదలకు ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చారు. విజ్ఞేశ్వర పురంలోని ఎస్సీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
మీరు కూడా లాక్‌డౌన్ కాలంలో పనులు లేక పూటగడవక ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేస్తుంటే ఆ వివరాలు మాకు తెలియజేయండి. మీరు చేసే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో మందిలో స్ఫూర్తి నింపవచ్చు. webeditor@sakshi.com కి మీ వివరాలు పంపించండి.
Comments
Please login to add a commentAdd a comment