కరోనా వైరస్‌ని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ను విధించడంతో చాలా మంది ఆహారం అందక పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. అది వరకు పనులు చేసుకొని స్వశక్తితో బతికిన వారు ఇప్పుడు సాయం అందించే వారికి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రోజులో కనీసం ఒకపూట కూడా తిండిలేక కన్నీళ్లతో కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి నిర్భాగ్యులను ఆదుకోవడానికి చాలా స్వచ్ఛంధ సంస్థలు ముందుకొచ్చి అండగా నిలబడుతున్నాయి.
చదవండి: సామాన్యుల సాయం
ఇందులో భాగంగానే కిషోర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సవరం చారిట్రబుల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్న వారికి అన్నదానం చేస్తున్నారు. దీంతోపాటు నిత్యవసర సరుకులు, కూరగాయాలు కూడా పంపిణీ చేస్తున్నారు. కొన్ని చోట్ల రోగనిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడేందుకు నారింజ, అరటి పండ్లను కూడా పంపిణీ చేస్తూ తమ ఉదారభావాన్ని చాటుకుంటూ కరోనా కష్టకాలంలో ఎందరికో అండగా నిలుస్తున్నారు. (కష్టంలో ఆదుకుంటున్న కామన్‌మ్యాన్)
Comments
Please login to add a commentAdd a comment