కరోనాపై పోరాటంలో మీరు చేయి కలపండి | Fund Rising Sites For Fight Against Corona Virus | Sakshi
Sakshi News home page

కరోనాపై కలిసి పోరాడుదాం

Published Thu, Apr 16 2020 3:28 PM | Last Updated on Thu, Apr 16 2020 5:34 PM

Fund Rising Sites For Fight Against Corona Virus - Sakshi

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఎంతో మంది వలసకూలీలు, రోజువారి కూలీలు, అనాధాశ్రమాల్లో ఉంటున్న చిన్నారులు, వికలాంగులు, వృద్దాశ్రమల్లో ఉంటున్న వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది. తినేందుకు తిండి దొరకక ఆకలితో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే వీరిని ఆదుకునేందుకు కేంద్రం పీఎం కేర్‌ను ఏర్పాటుచేయగా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు సీఎం కేర్‌ను ఏర్పాటు చేశాయి. వీటితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, సామాన్యులు సైతం ముందుకు వస్తున్నారు. మీరు కూడా సాయం అందించి ఈ సేవ కార్యక్రమాల్లో భాగం పంచుకోవాలంటే ఈ కింది తెలిపిన వివరాలు ఒకసారి పరిశీలించండి. 

పీఎం కేర్: దీని ద్వారా సేకరించిన విరాళాలను కేంద్రప్రభుత్వం కోవిడ్‌-19 పై పోరాటానికి ఉపయోగిస్తుందిం.

 https://www.pmindia.gov.in/en/about-pm-cares-fund/

ఆంధ్రప్రదేశ్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి విరాళాలు ఇవ్వాలనుకునే వారు ఈ లింక్‌ క్లిక్‌ చేయండి. 

https://apcmrf.ap.gov.in/

తెలంగాణ ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా సాయం చేయాలనుకునే వారు ఈ కింది లింక్‌ ద్వారా మీ విరాళాలు అందజేయవచ్చు.

 https://telangana.gov.in/cm-relief-fund

చిత్రిక: ఈ సంస్ధ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలో ఉన్న రైతులకు, నేతన్నలకు, తెగల వారికి సాయాన్ని అందిస్తుంది.

https://www.ketto.org/fundraiser/ChitrikaforCorona?payment=form

కోవా నెట్‌వర్క్‌: హైదరాబాద్‌లో ఉన్న 10,000 పైగా వలస కార్మికులకు సహాయాన్ని అందిస్తుంది. 

http://www.covanetwork.org/collaborate/donate/

రాపిడ్‌ రెస్పాన్స్‌ : ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో ఉంటున్న రోజువారి కూలీలకు, గ్రామాల్లో ఉంటున్న వారికి అండగానిలిచి అందుకుంటుంది. వారికి ఆహారాన్ని అందిస్తుంది. https://www.rapidresponse.org.in/coronavirusrelief.html

Account Name: Rapid Response
Account Number: 50200002115108
IFSC Code: HDFC0001038
Account Type: Current
Bank: HDFC Bank, Branch: Avadi

యాక్షన్‌ ఎయిడ్‌: ఇండియాలో లక్షమందికి నిత్యసరుకులు, లేక ఆహారాన్ని అందిస్తుంది. భారతదేశంలో మొత్తం 18 స్టేట్స్‌, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో తన సేవలను అందిస్తూ ఎంతో మందిని ఆదుకుంటుంది.
https://www.actionaidindia.org/SupportCOVID-hitFamilies/

ఉమెన్‌, ట్రాన్స్‌జెండర్‌ ఆర్గనైజేషన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటి: హైదరాబాద్‌కు చెందిన ఈ కమిటి 200 పైగా ట్రాన్స్‌జెండర్‌ కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొకుండా లాక్‌డౌన్‌లో వారికి కొంత డబ్బులు ఇచ్చి సాయ పడుతుంది. 

https://www.ketto.org/fundraiser/help-the-hyderabad-transgender-community-during-covid-19-crisis?payment=form

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement