భోజనం ప్యాకెట్లను రెడీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్స్
సాక్షి కడప : కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆకలితో అ లమటిస్తున్న పేదలకు కడపకు చెందిన ట్రాన్స్‌జెండర్స్(హిజ్రాలు) అండగా నిలుస్తున్నారు. పెద్ద మనసు చాటుకుంటున్నారు. రాయలసీమ ట్రాన్స్‌జెండర్స్ అ సోసియేషన్ అధ్యక్షురాలు హాసిని ఆధ్వర్యంలో వీరంతా రోజూ ఆహార వితరణ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. కడపతోపాటు కమలాపురం, ఇతర ప్రాంతాల్లో యాచకులు, నిరుపేదలకు ట్రాన్స్‌జెండర్స్‌కు వీరు ఆహార పదార్థాలను అందజేస్తున్నారు.
ఒక రోజు బిర్యానీ ప్యాకెట్లు, మరొకరోజు ఎగ్ రైస్, ఇంకో రోజు వెజిటబుల్ రైస్, ఉడకబెట్టిన గుడ్లతో కూడిన పౌ ష్ఠికాహారాన్ని అందిస్తున్నారు. కడపలోని అల్లూరి సీతా రామరాజునగర్‌లో సుమారు 30 మంది ట్రాన్స్‌జెండ ర్స్ స్వయంగా వండుతున్నారు. రెండు ఆటోల ద్వారా మరియాపురం, ఐటీఐ, ఆరోగ్యమాత చర్చి, ఎర్రముక్కపల్లె, ఆర్టీసీ బస్టాండు, కోటిరెడ్డిసర్కిల్, పాతబస్టాండు, పాత కలెక్టరేట్, పాత రిమ్స్, వినాయకనగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న పేదలు, యాచకులు, అనాథలకు అందజేస్తూ వస్తున్నారు. ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం రెండు రోజులకు ఒకసారి 250 నుంచి 300 ప్యాకెట్లు తయారు చేసి అందిస్తూ వస్తున్నారు.
ఆకలి బాధ తెలుసు
ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుసు. అందుకే కష్టసమయమైనా ముందుకు వచ్చాం. మావంతు సహాయంగా ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరికీ అందిస్తూ ఆకలిని తీరుస్తున్నాం. – హాసిని, రాయలసీమ ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, కడప
అన్నదానం గొప్పది
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అంటారు. అందుకే మా వద్ద దాచుకున్న సొమ్మును పేదల కోసం వినియోగిస్తున్నాం. విపత్కర పరిస్థితుల్లో వారిందరి ఆకలి తీర్చడమే మా బాధ్యత. అందుకోసం మరింత కష్టపడుతాం. – అన్యన్య, కడప హాసిని అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు, కడప
Comments
Please login to add a commentAdd a comment