సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. నరసన్నపేట పర్యటనలో భాగంగా కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో కాన్వాయ్ నుంచి బాధితులను గమనించిన సీఎం వైఎస్ జగన్ వాహనం నిలిపివేసి వారిని పరామర్శించారు.
ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి తమ కుమార్తె ఇంద్రజకు(7) అవసరమైన వైద్య సాయం అందించాలని సీఎం వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇంద్రజ అనారోగ్య సమస్యను సీఎం జగన్‌కు వారు వివరించారు. దీంతో, తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. ఇంద్రజకు అవసరమైన పూర్తి వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, చిన్నారి పేరెంట్స్ జగనన్నకు ధన్యవాదాలు తెలిపారు.
ఇక సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో చిన్నారి ఇంద్రజ తల్లిదండ్రులు మీసాల కృష్ణవేణి, మీసాల అప్పలనాయుడుని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లఠ్కర్ పిలిపించుకుని మాట్లాడారు. అంతేకాదు.. చిన్నారి ఇంద్రజ ప్రస్తుత ఆరోగ్య పరిస్ధితిని పరిశీలించేందుకు డీఎంహెచ్‌వో పర్యవేక్షణలో శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు ఇంద్రజకు అవసరమైన శస్త్రచికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment