పలాసలో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్
గడచిన ఐదేళ్లలో శ్రీకాకుళం జిల్లాలో ఊహించని అభివృద్ధి
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక ప్రాజెక్టులు మంజూరు
వ్యవసాయం, పారిశ్రామిక, మత్స్యకార రంగాల్లో ప్రగతి పరుగులు
ప్రతి గ్రామంలోనూ కళ్లెదుటే కనిపిస్తున్న భవనాలు
పెరిగిన పంటల దిగుబడి... ప్రభుత్వ మద్దతుతో రైతుకు రాబడి
వేలాది మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు
కొత్త ప్రాజెక్టుల పుణ్యమాని మారుతున్న జిల్లా రూపురేఖలు
మరికొన్ని అభివృద్ధి పనులు రూ.43 కోట్లతో శ్రీకాకుళం– ఆమదాలవలస నాలుగులైన్ల రోడ్డు
రూ.28 కోట్లతో పొందూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణం
రూ.48 కోట్లతో అలికాం ఆమదాలవలస మధ్య రైల్వే బ్రిడ్జి నిర్మాణం
ప్రసాదం స్కీమ్ కింద శ్రీముఖలింగం టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధి
1,10,825 మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు, అందులో 83,456 ఇళ్ల నిర్మాణాలు
శ్రీకాకుళం, పలాస, పాలకొండలో ఆక్వా హబ్‌లు
నిరుద్యోగులకు ఉపాధి కలి్పంచేందుకు 27 ఫిష్ ఆంధ్ర డెలిషియస్ యూనిట్లు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. కిడ్నీ వ్యాధులు అధికంగా ప్రబలుతున్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు అండగా నిలిచారు. పలాసలో రూ.50 కోట్లకుపైగా ఖర్చు చేసి 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ వ్యాధులపై రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్ నిర్మించారు.
ఇక్కడి కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరే అని తేలడంతో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 807 గ్రామాలకు ఉపరితల రక్షిత మంచినీరు అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించారు. సుమారు 5,57,633 మందికి తాగునీరు అందించారు. మూలపేట పోర్టు నిర్మాణంతో మత్స్యకారులకు ఆసరా దొరికింది.
► రూ.141.70 కోట్లతో 650 రైతు భరోసా కేంద్ర భవనాలు మంజూరు కాగా రూ.67.67 కోట్లతో 270 భవనాలు పూర్తి
► రూ.262 కోట్లతో 654 గ్రామ సచివాలయ భవనాలు మంజూరు కాగా రూ.146.74 కోట్లతో 360 భవనాలు పూర్తి
► రూ.31.20 కోట్లతో 195 డిజిటల్ లైబ్రరీ భవనాలు మంజూరుకాగా 22 భవనాల నిర్మాణం.
► రూ.93.62 కోట్లతో 535 విలేజ్ క్లినిక్ భవనాలు మంజూరు కాగా రూ.48.42 కోట్లతో 122 భవనాలు పూర్తి.. ఐదు రూరల్ పీహెచ్‌సీలు, 11 అర్బన్ హెచ్‌సీలు
సాగుకు సాయం
► జిల్లాలో రైతుల కోసం 642 రైతుభరోసా కేంద్రాలు, 7 ఇంటిగ్రేటె డ్ ల్యాబ్‌లు నిర్మించారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 3.21 లక్షల మందికి రూ.1,919.46 కోట్లు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 87,158 మందికి రూ.85.14 కోట్లు అందజేశారు.
► రూ.424.74 కోట్లతో 2,89,197 క్వింటాళ్ల విత్తనాలు సబ్సిడీపై అందించారు.
► 82,745 మెట్రిక్ టన్నుల ఎరువులు, 5592 లీటర్ల నానో యూరియా వంటివి అందించారు.
► చిన్న, సన్నకారు రైతుల కోసం 505 ట్రాక్టర్లు, మల్టిపుల్ క్రాప్ ట్రెసర్స్, పాడిరేపర్స్, రోటావెటర్స్, 57 క్లస్టర్లలో వరి కంబైన్డ్ హార్వెస్టర్స్ వంటివి అందించారు.
► 10వేల భూసార పరీక్షలు చేశారు. 27,049 కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చారు.
ఉద్యోగాల కల్పన
► సచివాలయాల ఏర్పాటు ద్వారా 7880 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కలి్పంచారు. – ప్రతి పీహెచ్‌సీకి అదనంగా ఒక్కో డాక్టర్ వంతున 66 మంది నియామకం
► పీహెచ్‌సీల్లో 108, 104 వాహనాల్లో కొత్తగా 2199 మంది నియామకం
► ఎంప్లాయిమెంట్ కార్యాలయం, స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 9018 ఉద్యోగాలు
జలయజ్ఞానికి ఊతం
► జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు వంశధార ఫేజ్ 2లోని స్టేజ్ 2 పనులు పూర్తి చేయడమే కాకుండా నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను అధిగమించేలా రూ.176.35 కోట్లు వెచి్చంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మిస్తున్నారు. మహేంద్ర తనయపై నిర్మిస్తున్న ఆఫ్ షోర్ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.852 కోట్లు మంజూరు చేశారు. మడ్డువలస రెండో దశ పనులకు రూ.26.65 కోట్లు మంజూరు చేశారు.
► మత్స్యకారుల సంక్షేమం, వివిధ ఎగుమతులు, దిగుమతులకు అనుకూలంగా మూలపేటలో రూ.2,949.70 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. మత్స్యకారుల కోసం రూ.365.81 కోట్లతో బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్, వజ్రపుకొత్తూరు మండలంలోని నీళ్లపేటలో రూ.11.95 కోట్లతో జెట్టీ నిర్మిస్తున్నారు.
మెరుగుపడిన మార్గాలు
► గడచిన ఐదేళ్లలో ఆర్‌అండ్‌బీ పరిధిలో రూ.526.69 కోట్లతో 633.4 కిలోమీటర్లకు సంబంధించి 432 రోడ్లు మంజూరు చేయగా చాలా వరకూ పూర్తయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఏఐఐబీ కింద రూ.352.78 కోట్లతో 484.43 కిలోమీటర్ల మేర 312 రోడ్లు మంజూరు కాగా 266 రోడ్ల పనులు జరుగుతున్నాయి.
► ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూ కింద రూ.70.96 కోట్లతో 94.30 కిలోమీటర్ల పొడవున 23 రోడ్లు మంజూరు చేయగా వాటిలో రూ.55.55 కోట్లతో 21రహదారుల నిర్మాణం పూర్తయింది.
► పీఎంజీఎస్‌వై బ్యాచ్ 1 కింద రూ.51.27 కోట్లతో 11 పనులు మంజూరు కాగా 10 పనులు, బ్యాచ్ 2లో రూ.38.23 కోట్లతో 8 పనులు మంజూరు కాగా 6 పూర్తయ్యాయి.
► ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు వర్క్స్ కింద రూ.350 కోట్లతో 480 కిలోమీటర్ల పొడవు గల 312 పనులు చేపడుతున్నారు. రెన్యువల్ వర్క్స్ కింద రూ.50 కోట్లతో 200 కిలోమీటర్ల పొడవున 83 పనులు చేపడుతున్నారు.
► గిరిజన ప్రాంతాల్లో రూ.56.35 కోట్లతో 102 గ్రామాలకు ఉపయోగపడేలా 42 సీసీ, బీటీ రోడ్లు వేశారు. నగరపాలక, పురపాలక సంఘాల్లో రూ.16.60 కోట్లతో 115 రహదారులను అభివృద్ధి చేశారు. మరో రూ.300 కోట్లతో జిల్లాలో 12 భారీ వంతెనలు నిర్మించారు. బలసలరేవు బ్రిడ్జి నిర్మాణానికి రూ.87 కోట్లు మంజూరు చేశారు.
► పాతపట్నం 50 పడకల సామాజిక ఆస్పత్రిని రూ.4.2 కోట్లతో, జొన్నవలస ఆస్పత్రిని రూ.2.45 కోట్లతో, లావేరులో రూ.1.2 కోట్లతో, సోంపేట సామాజిక ఆస్పత్రిని రూ.4.60 కోట్లతో, బారువ సామాజిక ఆస్పత్రిని రూ.5.60 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. నాడు నేడు కింద 83 ఆస్పత్రులను రూ.47 కోట్లతో అభివృద్ధి చేశారు. నరసన్నపేట ఆస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు.
► ఇంటింటికి తాగునీరు సరఫరాకు రూ.1552.36 కోట్లతో 4822 పనులు ప్రారంభించగా, ఇప్పటికే కొన్ని పనులు పూర్తయ్యాయి. జగనన్న హౌసింగ్ కాలనీలో తాగునీరు అందించేందుకు 791 పనులను రూ.38.4 కోట్లతో చేపడుతున్నారు.
సుపరిపాలన సుసాధ్యమయ్యేలా...
► జాతిపిత కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా జిల్లాలో 835 గ్రామ సచివాలయాలు, 95 వార్డు సచివాలయాల ద్వారా విస్తృత సేవలు అందిస్తున్నారు.
వీటి ద్వారా మొత్తం 512 రకాల సేవలు అందిస్తుండగా, ఇప్పటివరకూ 47,27,732 మందికి సేవలందాయి.
► విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా సామాన్య, పేద వర్గాలకు గ్రామాల్లోనే వైద్య సేవలు అందుతున్నాయి. జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. కొత్తగా రూరల్ ప్రాంతాల్లో 5 పీహెచ్‌సీలు, శ్రీకాకుళం, ఆమదాలవలస తదితర అర్బన్ ప్రాంతాల్లో 11 పీహెచ్‌సీలు నిర్మించారు.
శ్రీకూర్మం ఆస్పత్రిలో చాలా మార్పులొచ్చాయి
గతంలో శ్రీకూర్మం ఆస్పత్రి వద్దకు వచ్చేవాడిని. కూర్చోడానికి కూడా అవకాశం ఉండేది కాదు. పాడుబడిన భవనం ఉండేది. ఇరుకైన గదులు, ఎవ్వరూ కూడా సరిగ్గా ఉండేవారు కాదు. ఇప్పుడు ఎక్కడికో వెళ్లినట్టుంది. ఈ ప్రభుత్వం వచ్చాక గదులు అందంగా తయారు చేశారు. అన్ని పరీక్షలు రూపాయి ఖర్చు లేకుండా చేస్తున్నారు. అన్ని సలహాలు చెబుతూనే మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. అలాగే మా గ్రామంలోకి డాక్టరమ్మలు వచ్చి ఆరోగ్యం కోసం అడుగుతున్నారు. అవసరమైన మందులు కూడా ఇంటి వద్దనే ఇస్తున్నారు. –గేదెల తవుడు, దువ్వుపేట, గార మండలం
Comments
Please login to add a commentAdd a comment