మహమ్మారి కరోనా సృష్టిస్తున్న కల్లోలం కారణంగా ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. లాక్‌డౌన్ అమలవుతున్న తరుణంలో అనాథలు, పేదలే కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది కొంతమంది భోజన వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న విశ్రాంత ఉద్యోగి మేకల బాలయ్య పెద్ద మనసు చాటుకున్నారు. మియాపూర్‌లోని అల్విన్ కాలనీకి చెందిన ఆయన తన పెన్షన్ డబ్బుతో దాదాపు 100 మందికి భోజన సదుపాయం కల్పించారు. ఈ క్రమంలో లేబర్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 70 ఏళ్ల వయస్సులోనూ చురుగ్గా ఉంటూ సమాజ సేవ చేస్తున్న బాలయ్యను ఆదర్శంగా తీసుకోవాలంటూ పలువురు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment