
సాక్షి, అనంతపురం: కరోనా మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. అయితే ఈ లాక్‌డౌన్ కారణంగా ఎక్కడికక్కడ అన్ని కార్యకలాపాలు, రవాణా వ్యవస్థలు స్థంభించిపోయాయి. దీంతో వలసకార్మికులు, దినసరి కూలీల పరిస్థితి దుర్భరంగా మారింది. అయితే వారికి చేయూతనందించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంధ సంస్థలతో పాటు సామాన్యులు సైతం ముందుకు వచ్చి ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. (టెంపాబే లో నాట్స్ సాయం)
లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అనంతపురంలో ‘ లియోన్ హ్యూమన్ ఫౌండేషన్’ ఆస్టిన్, టెక్సాస్, యూఎస్‌ఏ వారిచే రూ. 20, 000 విలువ గల మెడికల్ కిట్లను అనంతపురం జిల్లా యూనియన్ ట్రేడ్ ఫెడరేషన్ అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ‘లియోన్ హ్యూమన్ ఫౌండేషన్’ డైరెక్టర్స్ పుల్లారెడ్డి యెదురు, నంగి పరమేశ్వర రెడ్డి, పులిమి రవి కుమార్ రెడ్డి తదితరులకు క్యాంపు నిర్వాహకులు ధన్యవాదములు తెలిపారు. (మానవత్వమే మన మతం)
Comments
Please login to add a commentAdd a comment