
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అమీల
సీతంపేట: ఎచ్చెర్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న అమీల అనే గిరిజన విద్యార్థిని కొద్ది నెలలుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. సీతంపేట మండలంలోని ఎతైన కొండలపై ఉన్న గడికారెం గ్రామానికి చెందిన ఈ విద్యార్థిని వింత వ్యాధితో బాధపడుతోంది. ఒల్లంతా కురుపులతో నరకయాతన అనుభవిస్తోంది. ఇప్పటికే ఈమె వైద్యానికి రూ.2 లక్షల వరకు ఖర్చు అయింది. అయినా ఎటువంటి ప్రయోజనం కలగలేదు. తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో అప్పులు చేసి ఈమెకు వైద్యం చేయించారు. ఇంకా నయం కావడానికి మరో రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ కుటుంబం ఆందోళన చెందుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని తమ కుటుంబానికి వింత వ్యాధి దాపురించిందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment