
సాక్షి, తాడేపల్లి : కరోనా నేపథ్యంలో సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడికి గ్రామ సచివాలయాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. గ్రామాల్లో పారిశుద్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఇక నుంచి కూడా సీఎం సహాయ నిధికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వాలని పెద్దిరెడ్డి కోరారు.
సీఎం సహాయనిధికి అందిన విరాళాలు..
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖల విరాళం : రూ. 200.11 కోట్లు
ఏపీఎండీసీ విరాళం : రూ. 10.62 కోట్లు
మైన్స్ అండ్ జియాలజీ శాఖ విరాళం : రూ. 56 లక్షలు
ఉపాధి హామీ, వాటర్‌షెడ్ శాఖ విరాళం : రూ. 1.50 కోట్లు
సెర్ఫ్‌ఉద్యోగుల విరాళం : రూ. 50 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment