
తిరిగి ఏం ఆశించకుండా, సరైన సమయంలో అవసరం ఉన్న వారికి చేసే సాయం దైవత్వంతో సమానం. ప్రస్తుతం ఉన్న కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వారికి చేతనైనంత సాయం అందించాల్సిన సమయం ఇది. ఎంతో మంది నిరుపేదలు, రోజు పనిచేస్తే కానీ పూట గడవని ఎంతో మంది దినసరి కూలీలు కరోనా మహమ్మారి కారణంగా పూట గడవక ఇబ్బందులు పడుతురన్నారు. అయితే అటువంటి వారి ఆకలి తీర్చడానికి చాలా స్వచ్ఛంధ సంస్థలతో పాటు సామాన్యలు సైతం ముందుకు వస్తున్నారు. (సాయం అందిస్తున్న హెల్పింగ్ హాండ్స్)
నారీ గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు దువ్వూరి చాందినీ ఈ విపత్కర పరిస్థితుల్లో ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో పేదలకు సాయాన్ని అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక హాస్పిటల్‌ని దత్తత తీసుకొని అందులో ఎందరికో ఉచితంగా కనుపులు, అత్యవసర ఆపరేషన్లు ఫ్రీగా చేయించడంతో పాటు రోగులకు, వారికి సాయంగా వచ్చిన వారికి కూడా ఆహారాన్ని అందిస్తున్నారు. మెడికల్ సిబ్బందికి పీపీఈ కిట్లను అందిస్తున్నారు. ప్రతి రోజు మెడికల్ సిబ్బందితో పాటు 700 మందికి భోజనాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పొయిన 4000ల మంది వలస కూలీలకు తమ సంస్థ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. (వాళ్లు కూడా మనవాళ్లే)
దీంతో పాటు రూ.1500 విలువ గల నిత్యవసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 2000 మందికి పైగా ఈ కిట్లను అందజేశారు. చేనేత కార్మికలను ఆదుకునేందుకు తెలంగాణ సర్కారుతో కలిసి కొయ్యగూడెం, బోగారం, సిరిపురం, కరీంనగర్, జోగిపేట, చిన్నూరు తదితర ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికుల కుటుంబాలకు రూ. 1000 చొప్పున సాయం అందించారు. అందరూ సాయం చేస్తే ఇంకా ఎన్నో కుటుంబాలకు, ఆసుపత్రుల్లో ఉంటున్నవారికి సేవ చేయడానికి అవకాశం ఉంటుందని చాందిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment