
సాక్షి, వైజాగ్: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలాడిపోతుంది. ఈ మహమ్మారి కట్టడికి చాలా దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. భారత్‌లో కూడా మొదట ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించగా దానిని మే 3 వరకు పొడిగించారు. దీంతో మన తోటి మనుషులు ఎంతో మంది రోజుకు ఒక్క పూట కూడా ఆహారం దొరకక పస్తులు ఉంటున్నారు. లాక్‌డౌన్‌కి ముందు కష్టం చేసుకొని స్వశక్తితో బతికిన ఎంతో మంది వలసకూలీలు, దినసరి కూలీలు, నిరుపేదలు ఆకలితో నీళ్లు తాగి పడుకునే దుస్థితి దాపురించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను, వలస కూలీలను ఆదుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. దీనికి తోడు అనేక స్వచ్ఛంధ సంస్థలు, సామాన్యులు సైతం ఈ సమయంలో ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. పేదలకు నిత్యవసర సరుకులు, ఆహారాన్ని అందిస్తున్నారు. అలా సాయం చేస్తున్న వారు సాక్షి.కామ్ ద్వారా వాళ్ల సేవ కార్యక్రమాన్ని తెలిపి మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. (విజయవాడలో పేదలకు అండగా రేడియో గ్రూప్)
విశాఖపట్నానికి చెందిన జీవీఎంసీ స్వచ్చంధ సంస్థ నగరంలో, పరిసర ప్రాంతాల్లో ఉంటున్న పేదలకు, నిరాశ్రయులకు పండ్లు, నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తూ వారికి అండగా నిలుస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో అభాగ్యులకు బాసటగా నిలిచి మానవత్వాన్ని నిరూపించుకుంటున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు కూడా మీ సేవ కార్యక్రమాలు సాక్షి.కామ్ ద్వారా తెలియజేయాలి అనుకుంటే webeditor@sakshi.com కి మీ వివరాలు పంపించండి. (వలస కార్మికులకు వీహెచ్పీ చేయూత)
ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 22,40,191 మంది కరోనా బారిన పడగా 1,53,822 మంది మరణించారు. ఇక భారతదేశం విషయానికి వస్తే 13,835 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,767 మంది రికవరీ అయ్యారు, 452 మంది మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 766కుపైగా కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 534 కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి (కరోనాపై పోరాటంలో మీరు చేయి కలపండి)
Comments
Please login to add a commentAdd a comment