సాక్షి, హైదరాబాద్: బాటసింగారం పండ్ల మార్కెట్‌కు మామిడి పోటెత్తింది. ఈ సంవత్సరం పూత నెల రోజులు ఆలస్యంగా రావడంతో మామిడి పండ్లు మార్కెట్‌కు ఆలస్యంగా వస్తున్నాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్‌కు మామిడి పండ్ల దిగుమతి ఒకేసారి పెరిగింది. సోమవారం ఈ సీజన్‌లోనే అత్యధికంగా 1800 నుంచి 2 వేల టన్నుల వరకు మామిడి దిగుమతి అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. దిగుమతులు పెరగడంతో పండ్ల ధరలు కూడా తగ్గాయి. మొదటి రకం పండ్ల టన్ను ధర రూ. 60 వేలు ఉండగా సాధారణ రకం టన్ను రూ.30 నుంచి రూ.40 వేల మధ్యలో ధర పలుకుతోంది.
దీంతో రిటైల్ మార్కెట్‌లోనూ పండ్ల ధరలు భారీగా తగ్గాయి. గత వారం కిలో రూ. 90 నుంచి 80 ఉన్న మామిడి ధరలు సోమవారం రిటైల్ మార్కెట్‌లో రూ. 60 లోపే ఉన్నాయి. పెరగనున్న దిగుమతులు ఈ ఏడాది మామిడి సీజన్ కాస్తా ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ త్వరలో దిగుమతులు పెరుగుతాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మామిడి సీజన్ జూన్ చివరి వరకు కొనసాగుతుందని మార్కెట్ వర్గాల అంచనా. రోజు 2 వేల టన్నుల కంటే ఎక్కువగా మామిడి దిగుమతి కావచ్చని తెలిపారు. ఈ ఏడాది తెలంగాణ జిల్లాలనుంచే కాకుండా ఏపీ నుంచి కూడా మామిడి దిగుమతి ఎక్కువ దిగుమతి ఎక్కువగానే ఉంటుందన్నారు.
దిగుమతులకు తగినట్లుగా ఏర్పాట్లు ఈ ఏడాది సీజన్ ఆలస్యంగా ప్రారంభమైనా దిగుమతులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. మార్కెట్‌కు వివిధ జిల్లాల నుంచి వచ్చే లారీలు మార్కెట్ నుంచి కాస్తా ఆలస్యంగా వెళ్లినా ట్రాఫిక్ సమస్యలు లేకుండా తగిన ఏర్పాట్లు చేశాం.. మార్కెట్‌లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడానికి చర్యలు తీసుకున్నాం. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా మార్కెట్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. – చిలుకా నర్సింహా రెడ్డి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి (ఎఫ్‌ఏసీ).
(చదవండి: రైతన్న ఆశలు ఆవిరి)
Comments
Please login to add a commentAdd a comment