సాక్షి, హైదరాబాద్: దౌత్యవేత్తలకు లభించే మినహాయింపులను వినియోగించుకొని లగ్జరీ కార్లను దిగుమతి చేసుకుంటూ పన్నులు ఎగవేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ లగ్జరీ కార్ల దిగుమతి వ్యవహారమంతా ఓ ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొదట రాయబారుల పేరుతో కార్లు దిగుమతిని ముంబై మాఫియా చేస్తోంది. అనంతరం దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లకు మణిపూర్ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. అన్ని తతంగాలు పూర్తయ్యాక ఈ లగ్జరీ కార్లను ముంబై మాఫియా నుంచి కొందరు బడాబాబులు కొంటున్నారు. ప్రస్తుతం విదేశీ కార్లు కొనుగోలు చేసిన వారి వివరాలను డీఆర్‌ఐ సేకరిస్తోంది. పన్ను ఎగవేత కార్లు వాడుతున్న వారిలో రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment