Tax Avoidance
-
పన్ను లేకుండా ‘దోసె’స్తున్నారు!
నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తున్నా ఎలాంటి పన్ను చెల్లించడం లేదు. ‘అదేంటి నెలకు రూ.6 లక్షల చొప్పున వార్షిక ఆదాయం రూ.72 లక్షలు అవుతుంది కదా. 30 శాతం ట్యాక్స్ స్లాబ్‌లోకి వస్తున్నా పన్ను చెల్లించకపోవడం ఏంటి’ అనుకుంటున్నారా? నెలకు అంతలా సంపాదిస్తుంది ప్రముఖ కంపెనీ మేనేజర్ స్థాయి ఉద్యోగో లేదా ఎగ్జిక్యూటివ్ స్థాయి ఆఫీసరో అనుకుంటే పొరపడినట్లే. ఈ సంపాదన ఓ దోసె బండి నిర్వాహకుడిది. అవునండి. వీధి వ్యాపారులు, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్నవారు తాము సంపాదిస్తున్న డబ్బుపై ట్యాక్స్ చెల్లించడం లేదు. ఈమేరకు ఇటీవల నవీన్ కొప్పరం అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అదికాస్తా విభిన్న సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.‘మా ఇంటి పక్కన దోసె బండి నిర్వాహకుడు రోజు రూ.20,000 సంపాదిస్తాడు. నెలకు రూ.6 లక్షలు ఆదాయం ఉంటుంది. అందులో సగం వరకు ఖర్చులు తీసేసినా రూ.3 లక్షలు-రూ.3.5 లక్షలు సంపాదన. దానిపై తాను ఎలాంటి ట్యాక్స్ చెల్లించడు. అదే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి నెలకు రూ.60,000 సంపాదిస్తే అందులో 10 శాతం ట్యాక్స్ చెల్లించాలి’ అని నవీన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. దేశంలో ఆదాయ వ్యత్యాసాలు, పన్ను హేతబద్ధీకరణ వంటి అంశాలపై కామెంట్లు వస్తున్నాయి.A street food dosa vendor near my home makes 20k on an average daily, totalling up to 6 lakhs a month.exclude all the expenses, he earns 3-3.5 lakhs a month.doesn’t pay single rupee in income tax.but a salaried employee earning 60k a month ends up paying 10% of his earning.— Naveen Kopparam (@naveenkopparam) November 26, 2024ఇదీ చదవండి: తగ్గుతున్న వేతనాలు.. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి!భారత ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న అనధికారిక రంగాన్ని మరింత క్రమబద్ధీకరించి అందుకు అనుగుణంగా పన్నుల పరిధిని పెంచాలని కొందరు నెటిజన్లు తెలియజేస్తున్నారు. దీనికోసం అనుసరించాల్సిన మార్గాలపై చర్చసాగాలని చెబుతున్నారు. కొందరు వైద్యులు, న్యాయవాదులు, చిన్న వ్యాపార యజమానులు.. వంటి ఇతర స్వయం ఉపాధి పొందేవారి సంపాదన పన్ను రహితంగా ఉండడంపట్ల ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ‘డాక్టర్లు, లాయర్లు, టీ దుకాణాదారులు, గ్యారేజీ నిర్వహకులు, వాణిజ్య ప్రాంతాల్లోని ఇతర వ్యాపారుల సంగతేంటి? చాలామంది ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా విదేశీ సెలవులకు వెళుతున్నారు. ఇళ్లు కొంటున్నారు. ఏటా కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది?’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. -
పన్ను ఎగవేత.. పలు రకాలు..
పన్ను ఎగవేత చట్టరీత్యా నేరం. అనైతికం. ఆర్థికంగా సంక్షోభం తయారవుతుంది. అయితే, మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. సినిమాలో ‘విలన్’ మనకు ఆది నుంచి చివరి వరకు కనిపిస్తాడు. నిజజీవితంలో ‘విలన్’ విలన్‌లాగా కనిపించడు. ఓ పరోపకారి పాపయ్యలాగా, ఓ మర్యాద రామన్నలాగా అనిపిస్తాడు. వినిపిస్తాడు. కనిపిస్తాడు. ఎంతో మోసం చేస్తాడు. మనం తెలుసుకునే లోపల తెరమరుగవుతాడు.‘‘మీరు ఇప్పుడే మోసపోయారు’’ పుస్తకంలో రచయిత.. మనం ప్రతి రోజూ వైట్‌కాలర్ క్రైమ్ ద్వారా ఎలా మోసపోతున్నామో కళ్ళకి కట్టినట్లు తెలియజేశారు. ‘‘డబ్బుని ఎలా సంపాదించాలి’’ అనే పుస్తకంలో రచయిత ’అంకుర్ వారికూ’ ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఆస్తిని ఎలా ఏర్పాటు చేసుకోవాలని మొదలైన విషయాల మీద ఆచరణాత్మకమైన సలహాలు ఇస్తారు. అలాగే తెలుగు రచయతలు వీరేంద్రనాథ్‌గారు, బీవీ పట్టాభిరాం గారు తమ పుస్తకాల ద్వారా ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఇంత మంది చెప్పినా, ఇన్ని విషయాలు తెలిసినా, షరా మామూలే!ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!ఒకరిని చూసి ఒకరు. ఆశతో, ప్రేరేపణతో. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు మోసం చేస్తున్నారు. పన్ను ఎగవేస్తున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి మార్గాలున్నట్లు..అకౌంట్స్ బుక్స్ నిర్వహించపోవడం, నిర్వహణలో అవకతవకలు, ఆదాయాన్ని తక్కువగా చూపించడం, ఖర్చులను పెంచేయడందురాలోచనలతో బంగారాన్ని .. అంటే ఆభరణాలు, రత్నాలు, డైమండ్లు, వెండి విషయాల్లో సెంటిమెంటు పేరు మీద, పసుపు–కుంకాల పేరు మీద, పెళ్లిళ్ల పేరు మీద కొంటున్నారు. అమ్ముతున్నారు. మళ్లీ కొంటున్నారు. పెట్టుబడికి సోర్స్ చెప్పరు. లాభాన్ని లెక్కించరు. ఆస్తిగా చూపించరు. ‘‘భర్తకే చెప్పం’’ అంటారు కొందరు మహిళలు. మీకు గుర్తుండే ఉంటుంది. రైళ్లలో బోగీ ఎక్కే ముందు ఇదివరకు ప్రయాణికుల జాబితా ఉండేది. పేరు, వయస్సు, లింగం, పాన్ నంబరు, మొదలైనవి అందులో ఉంటాయి. బంగారం షాపులవాళ్లు వారి సిబ్బందిని పంపించి ఆ వివరాలను సంగ్రహించేవారు. ఆ జాబితాను తీసుకుని, షాపునకు వచ్చి, అందులోని పేర్ల మీద ఇతరులకు అమ్మేవారు.వ్యవసాయ భూమి అంటే ఏమిటో ఆదాయపు పన్ను నిర్వచించినా, గ్రామాల పేరు మార్చి, సరిహద్దులు మార్చి అమ్మకాల్లో మోసం. అలాగే ఆదాయం విషయంలో ఎన్నో మతలబులు.. ఎందుకంటే వ్యవసాయ ఆదాయం, భూమి అమ్మకాల మీద పన్ను లేదు.ఇక రియల్ ఎస్టేట్ రంగంలో చెప్పనక్కర్లేదు. నేతి బీరకాయలో నేయి లేదు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ‘‘రియల్’’ గానే పన్ను ఎగవేత ఉంది.అన్‌లిస్టెడ్ కంపెనీల షేర్లు, స్టాక్స్, క్రయవిక్రయాల్లో ఎన్నో అక్రమమార్గాలు అవలంబిస్తున్నారు.పబ్లిక్ కంపెనీల్లో షేరు ప్రీమియం పేరుతో మోసాలు.. అలాగే షేర్స్ అలాట్మెంట్కి ముందుగా అప్లికేషన్‌తో పాటు వసూలు చేసే మనీతో మోసాలు.వ్యాపారంలో సర్దుబాటు హుండీలు సహజం... వీటి మార్పిడి... ఇదొక సరిహద్దుల్లేని వ్యాపారం అయిపోయింది.డమ్మీ సంస్థలు.. ఉనికిలో లేనివి.. ఉలుకు లేని..పలుకు లేని.. కాగితం సంస్థలు. కేవలం ఎగవేతకే ఎగబాకే సంస్థలు. దొంగ కంపెనీలు. డొల్ల కంపెనీలు. బోగస్ వ్యవహారాలు. బోగస్ కంపెనీలు.క్రిప్టోకరెన్సీల్లో గోల్మాల్..ఇలా ఎన్నో.. ముఖ్యంగా సోర్స్ చెప్పకపోవడం, పెట్టుబడికి కానీ.. రాబడికి కానీ వివరణ ఇవ్వకపోవడం, పన్ను ఎగవేతకు పన్నాగం చేయడం. వీటి జోలికి పోకండి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
పన్నుల ప్రణాళిక.. ఎగవేత మధ్య తేడా!
పన్నుల ఎగవేతకు, ప్రణాళికబద్ధంగా పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి గల తేడాలకు సంబంధించి నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇంగ్లీషులో Tax Evasion అంటే ఎగవేత.. ఇంగ్లీషులో Tax Planning అంటే ప్లాన్ చేయడం. ప్లాన్ చేయడం వల్ల Tax Avoidance చేయవచ్చు. ఎగవేత నేరపూరితం. ప్లానింగ్ చట్టబద్ధమైనది. వివరాల్లోకి వెళితే..పన్నుల ప్రణాళిక లక్ష్యాలుచట్టంలో ఉన్న అంశాలకు లోబడి ప్లాన్ చేయడం.అన్ని వ్యవహారాలు, బాధ్యతలు చట్టప్రకారం ఉంటాయి.చట్టప్రకారం అవకాశం ఉన్నంతవరకు పన్ను భారాన్ని తగ్గించుకోవడం.ఇదొక హక్కులాంటిది .. శాస్త్ర సమ్మతమైనది.పన్ను ఎగవేత: ఉద్దేశాలుచట్టంలో అంశాలను ఉల్లంఘించడం.జరిగే వ్యవహారాలు చట్టానికి వ్యతిరేకంగా ఉంటాయి.ఉద్దేశపూర్వకంగా పన్ను తప్పించుకునే మార్గాల అమలు.ఇది నేరం. చట్టవిరుద్ధం.పన్నుల ఎగవేతలో కావాలని పన్నులు కట్టకుండా ఎగవేయడం ఉంటుంది. అది చట్టవిరుద్ధం. అనైతికం. అబద్ధాలు చెప్పి, తప్పులు చేసి, ఎన్నో కుతంత్రాల ద్వారా ఆదాయాన్ని దాచి, దోచి.. పన్నులను కట్టకపోవడం కిందకు వస్తుంది. ఎన్నో మార్గాలను వెతుక్కుని, అమలుపర్చి తద్వారా పన్నులు ఎగవేస్తారు. మోసపూరితమైన వ్యవహారాలు, మోసపూరితమైన సమాచారం, లెక్కలు.. ఇవన్నీ అభ్యంతరకరం. చట్టరీత్యా నేరం. ఎండమావుల్లాగా ప్రయోజనం అనిపిస్తుంది. కానీ ప్రయోజనం ఉండదు. ఎన్నెన్నో ఉదాహరణలు. ఎన్నో మార్గాలు. అడ్డదార్లు. ఎందరో మనకు తారసపడతారు. మెరిసిపోతుంటారు. మురిసిపోతుంటారు. వెలిగిపోతుంటారు. కానీ ఇవన్నీ తాత్కాలికం. ఇలాంటి వారిపై చట్టపరంగా శిక్షలు తీవ్రంగానే ఉంటాయి. వడ్డీలు వడ్డిస్తారు. పెనాల్టీలు వేస్తారు. కటకటాల పాలు కావచ్చు. ఎన్నో చట్టాలు వారిని పట్టుకుంటాయి.ఇదీ చదవండి: అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?పన్నుల ప్లానింగ్ఇక పన్నుల ప్లానింగ్‌లో ఓ పద్ధతి ఉంటుంది. ఇది చట్టానికి లోబడి ఉంది. నైతికంగా ఉంటుంది. అబద్ధం ఉండదు. తప్పు ఉండదు. కుతంత్రం ఉండదు. ఆదాయాన్ని దోచడం ఉండదు. దాచడం ఉండదు. పన్నులు పడకుండా జాగ్రత్త పడటం.. పన్నుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం మోసపూరితం కాదు. లెక్కలు గానీ, సమాచారం గానీ మోసపూరితమైనదిగా ఉండదు. అతిక్రమణ ఉండదు. ప్రయోజనం ఉంటుంది. పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్నెన్నో సక్రమమైన మార్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరం 10 కోట్ల 41 లక్షల మంది రిటర్నులు వేశారు. లక్ష మంది వారి ఆదాయం కోటి రూపాయలు ఉన్నట్లు చెబుతున్నారు. వీరే మనకు ఆదర్శవంతులు. మనకు కట్టాల్సిన పన్నుల వివరాలు వెల్లడించడం ద్వారా చట్టప్రకారం అన్ని ప్రయోజనాలు దొరుకుతాయి. ఎటువంటి శిక్షలు ఉండదు. మనం ఈ మార్గాన్నే అనుసరిద్దాం.-కె.సీ.హెచ్ ఏ.వీ.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
పేరుకి కోటీశ్వరులు.. మరి అందులో కక్కుర్తి ఎందుకో
అంతా కోటీశ్వరులే. కారు రేసింగ్ వాళ్ల అభిరుచి. అందుకోసం ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తారు. మెర్సిడస్ బెంజ్, మాసరట్టి, పెరారీ, రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ, లాంబోర్గిని వంటి ఒక్కొక్కటి రూ.2 కోట్లకు పైగా విలువైన కార్లు. అర్ధరాత్రి హైదరాబాద్ రహదారులపై ఈ కార్లను వాయువేగంతో పరుగెత్తించడం వాళ్లకు సరదా. కానీ ఈ వాహనాల పన్ను చెల్లింపులపైన మాత్రం తమ సంకుచిత బుద్ధినిప్రదర్శిస్తున్నారు. రవాణా శాఖకు చెల్లించాల్సిన పన్ను చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. తాజాగా పట్టుబడిన 11 వాహనాల నుంచే రూ.5 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మరో వందకు పైగా వాహనాల నుంచి రూ.100 కోట్ల మేర ఆదాయం రావచ్చునని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వాహన యజమానులంతా పన్ను ఎగవేసేందుకే తమ వాహనాలను హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరిలలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అధికారులు జప్తు చేసిన పదకొండు వాహనాల్లో కొన్ని హర్యానాకు చెందినవి కాగా..మరికొన్ని ఢిల్లీ, పాండిచ్చేరిల్లో నమోదైనట్లు అంచనా. సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా ఏ చిన్న వాహనం కొనుగోలు చేసినా సదరు వాహన యజమాని మోటారు వాహన నిబంధనల మేరకు షోరూమ్‌లోనే జీవితకాల పన్ను చెల్లించి వాహనాన్ని సొంతం చేసుకుంటాడు. కానీ ఖరీదైన కార్లు కొనుగోలు చేసే బడాబాబులు మాత్రం ఆ పన్ను తప్పించుకొనేందుకు పక్కదారి పడుతున్నారు. నగరంలో ఇప్పుడిప్పుడే ఇలాంటి వారి బోగోతాలు వెల్లడవుతున్నాయి. అక్కడ పన్ను తక్కువ.. వాహనాలపైన విధించే జీవితకాల పన్ను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. జీవిత కాల పన్ను ఏ మేరకు విధించాలనే అంశం రాష్ట్రాల పరిధికి చెందినది కావడంతో ఇలా వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులు విధించారు. ఈ మేరకు కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల్లో ఇది 5 శాతం నుంచి 7 శాతం వరకు ఉన్నట్లు అంచనా. మహారాష్ట్రలో వాహనాల ఖరీదు మేరకు రకరకాల స్లాబుల్లో జీవితకాల పన్ను విధించారు.తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడులలో ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో ఖరీదైన వాహనాల పైన 14 శాతం వరకు జీవితకాల పన్ను విధించారు. అంటే రూ.2 కోట్ల ఖరీదైన వాహనంపైన సుమారు రూ.70 లక్షల వరకు పన్ను కట్టాల్సివుంటుంది. ఈ పన్నును ఎగ్గొట్టేందుకే వాహనదారులు ఇతర రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరి, తదితర చోట్ల కేవలం రూ.30లక్షలలోపు జీవిత కాలపన్నుతో వాహనాలు నమోదు కావడంతో నగరవాసులను ఆ రాష్ట్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. -
పన్ను ఎగవేసి విదేశాల నుంచి లగ్జరీ కార్ల దిగుమతి
సాక్షి, హైదరాబాద్: దౌత్యవేత్తలకు లభించే మినహాయింపులను వినియోగించుకొని లగ్జరీ కార్లను దిగుమతి చేసుకుంటూ పన్నులు ఎగవేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ లగ్జరీ కార్ల దిగుమతి వ్యవహారమంతా ఓ ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొదట రాయబారుల పేరుతో కార్లు దిగుమతిని ముంబై మాఫియా చేస్తోంది. అనంతరం దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లకు మణిపూర్ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. అన్ని తతంగాలు పూర్తయ్యాక ఈ లగ్జరీ కార్లను ముంబై మాఫియా నుంచి కొందరు బడాబాబులు కొంటున్నారు. ప్రస్తుతం విదేశీ కార్లు కొనుగోలు చేసిన వారి వివరాలను డీఆర్ఐ సేకరిస్తోంది. పన్ను ఎగవేత కార్లు వాడుతున్న వారిలో రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. -
వెలుగులోకి రూ. 400 కోట్ల జీఎస్టీ స్కామ్
అహ్మదాబాద్: జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం రూ.400 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించింది. దేశ రాజధాని ప్రాంతానికి చెందిన ఎగుమతిదారులు గుజరాత్‌లోని కాండ్లా ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్)లోని యూనిట్ల సాయంతో రూ.400 కోట్ల వరకు జీఎస్టీ రిఫండ్‌ను పొందినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు గుర్తించారు. తక్కువ నాణ్యతతో కూడిన పొగాకు ఉత్పత్తులు సెంటెడ్ జర్దా, ఫిల్టర్ ఖైనీ కేంద్రంగా ఈ స్కామ్ జరిగినట్టు డీజీజీఐ తెలిపింది. వీటిని కిలో రూ.50–350కు కొనుగోలు చేసి, కాంట్లా ఎస్ఈజెడ్ యూనిట్లకు కిలో రూ.5,000–9,000కు ఎగుమతి చేసినట్టుగా చూపించారని పేర్కొంది. మార్కెట్ విలువ కంటే 3,000 శాతం అధికంగా చూపించడం ద్వారా అక్రమంగా రూ.400 కోట్లను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద పొందారని తెలిపింది. -
మాజీ ఐఏఎస్ 225 కోట్ల ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ: పన్ను ఎగవేత, మనీ ల్యాండరింగ్ కేసుల్లో ఉత్తరప్రదేశ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేత్రామ్, ఆయన సన్నిహితులకు చెందిన రూ.225 కోట్ల విలువైన ఆస్తుల్ని ఆదాయ పన్ను శాఖ అటాచ్ చేసింది. ఇందులో ఢిల్లీ, ముంబై, నోయిడా, కోల్‌కతాలోని స్థిరాస్తులు ఉన్నాయి. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న బూటకపు కంపెనీల్లో నేత్రామ్, ఆయన సన్నిహితులు కొందరు రూ.98.82 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ విభాగానికి సమాచారం అందడంతో గతంలో ఢిల్లీ, లక్నో, ముంబై, కోల్‌కతా, బరేలిలోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై సోదాలు చేసింది. 1979 బ్యాచ్‌కు చెందిన నేత్రామ్ మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు ఉన్నత స్థానాల్లో పనిచేశారు. -
కన్నడ హీరోలకు ఐటీ షాక్
సాక్షి, బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇళ్లలో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ గురువారం భారీ ఎత్తున దాడులు నిర్వహించింది. నలుగురు పెద్ద హీరోలు, ముగ్గురు బడా నిర్మాతల ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి. ఇటీవల కాలంలో కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందాయి. అందులో కొన్ని సక్సెస్ సాధించి బడా నిర్మాతలకు, హీరోలకు కోట్ల రాబడి తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేత ఆరోపణలు పెరగడంతో ఐటీ శాఖ సోదాలు ప్రారం భించింది. కర్ణాటకలోని సుమారు 23 ప్రాంతా ల్లో 200 మంది ఐటీ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. ప్రముఖ శాండల్‌వుడ్ హీరోలు శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, సుదీప్, యశ్, ప్రముఖ నిర్మాతలు రాక్‌లైన్ వెంకటేశ్, సీఆర్ మనోహర్, విజయ్ కిరంగదూరు ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఐటీ అధికారులు నగదు, కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏకకాలంలో వేర్వేరుగా సోదాలు ఉదయం 7 గంటల నుంచే ఏకకాలంలో ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు చేపట్టారు. సదాశివనగరలోని పునీత్ రాజ్‌కుమార్ ఇల్లు, మాన్యత టెక్‌పార్కు దగ్గర్లో పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ ఇల్లు, కేజీఎఫ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యశ్ ఇల్లు, తెలుగులో ‘ఈగ’సినిమా విలన్ కిచ్చ సుదీప్ ఇంట్లో సోదాలు చేశారు. కేజీఎఫ్ చిత్ర నిర్మాతలు విజయ్ కిరంగదూరు, రాక్‌లైన్ వెంకటేశ్, నిర్మాత, జేడీఎస్ ఎమ్మెల్సీ సీఆర్ మనోహర్ నివాసాల్లో కొన్ని డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ ప్రముఖులు నటించిన, నిర్మించిన సినిమాలు, వాటి బడ్జెట్, కలెక్షన్స్ వివరాలను అధికారులు సేకరించారు. కర్ణాటక సీఎం కుమారస్వామి రెండో భార్య, నటి రాధిక ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారని వార్తలు వినిపించాయి. ఐటీ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. తమిళనాట ప్రముఖ హోటళ్లపైనా... సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున వ్యాపారాలు చేస్తున్న హోటల్ శరవణ భవన్, అంజప్పర్ హోటల్స్, గ్రాండ్ స్వీట్స్, హాట్ బ్రెడ్ తదితర వ్యాపార సంస్థలకు చెందిన 32 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హోటళ్లపై కేంద్రం జీఎస్టీని తగ్గించినా వినియోగదారుల నుంచి పాత జీఎస్టీనే వసూలు చేస్తున్నారని, కొత్త ఏడాది సందర్భంగా పెద్ద ఎత్తున తినుబండారాల అమ్మకాలు జరిగినా తక్కువ అయినట్లుగా లెక్కలు రాసినట్లు ఐటీశాఖకు సమాచారం అందింది. దీంతో ఐటీ సిబ్బంది సోదాలు చేపట్టింది. -
చంద్రబాబు కంపెనీలపై ఆర్వోసీకి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల విషయంలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు బుధవారం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, ఆయన కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణిలు హెరిటేజ్‌తో పాటు మరో 20 కంపెనీలకు సంబంధించి పెద్ద మొత్తంలో పన్నులు ఎగవేశారని, దీంతో తెలంగాణ రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, హెరిటేజ్ ఆగ్రో మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్, హెరిటేజ్ న్యూట్రివెట్ లిమిటెడ్, నిర్వాణ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, నిర్వాణ ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్వాణ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, నిర్వాణ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్వాణ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెరిటేజ్ కాన్‌ప్రో లిమిటెడ్, నిర్వాణ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, రెడ్‌హిల్స్ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మెగాబిడ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్వాణ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెరిటేజ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ల గురించి ఆయన తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఇవన్నీ షెల్ కంపెనీలేనని పేర్కొన్నారు. కంపెనీల చట్టం కింద నిపుణుల బృందం రంగంలోకి దిగి తే తప్ప మనీ ల్యాండరింగ్ కింద జరిగిన నేరాలు బహిర్గతం కావన్నారు. కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, నేరస్తులు కంటికి కనిపించని నేరాలు చేస్తూ తప్పించుకుంటున్నారన్నారు. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) అధికారులు ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. పై కంపెనీల యాజమాన్యాలు, ఆస్తి, అప్పుల పట్టీ లు, వార్షిక నివేదికలు తదితర వాటిని లోతుగా పరిశీలించడంతో పాటుగా ఈ కంపెనీల వ్యవహారంపై ఎస్ఎఫ్ఐఓతో ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. -
ఏపీ, తమిళనాడుల్లో వందచోట్ల ఐటీ దాడులు
చెన్నై/విశాఖ దక్షిణం/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఏపీ, తమిళనాడుల్లోని 100 చోట్ల ఆదాయ పన్ను(ఐటీ) శాఖ అధికారులు దాడు లు జరిపారు. వీవీ మినరల్స్ సహా నాలుగు ప్రముఖ సంస్థలు గనులు, ఖని జాల ఎగుమతుల సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయనే ఆరోపణలతో సోదాలు జరిపినట్లు ఐటీ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం ఆరు గంటలకు ఐటీ బృందాలు విశాఖలోని లాజిస్టిక్ కంపెనీలు, ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెంట్ మురళీకృష్ణ కార్యాలయాలు, అక్కయ్య పాలెంలో ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ ఆఫీసు, అక్కయ్యపాలెంలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దాడులు చేపట్టాయి. నక్కపల్లి మండలం బం గారమ్మపేట గ్రామంలో బీఎంపీ కంపెనీ ఆఫీ సులో సోదాలు చేశాయి. ఈ కంపెనీ చెన్నై ప్రధాన కేంద్రంగా విశాఖ జిల్లా నక్కపల్లి, శ్రీకాకుళంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దువ్వాడలో గల టీజీఐ లాజిస్టిక్స్ లోనూ ఐటీ తనిఖీలు జరిగాయి. ఈ కంపెనీ తెలంగాణ టీడీపీ నేత దేవేందర్ గౌడ్ బంధువులదని సమాచారం. శ్రీకాకుళం జిల్లా గార మండలం సతివాడ వద్దనున్న ట్రాన్స్‌వరల్డ్ గార్నెట్ ఇండస్ట్రీ (టీజీఐ) ఆఫీసుతోపాటు రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ నడికుదిటిపాలెంలోని టీడీపీ నేత, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ డైరెక్టర్ నడికుదిటి ఈశ్వరరావు ఇంట్లో సోదాలు జరిపారు. తమిళనాడుకు చెందిన వీవీ మినరల్స్ యాజమాన్యంలో టీజీఐ నడుస్తోంది. చెన్నై, కోయంబత్తూరు, తిరునల్వేలి, ట్యుటికోరన్, కరైకల్‌లలోని వివిధ ఆఫీసులపై జరిపిన సోదాల్లో 130 మంది పాల్గొన్నారు. -
మౌనమెందుకు రాహుల్?: బీజేపీ
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతకు సంబంధించి బావ రాబర్ట్ వాద్రాకు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం నోటీసులు పంపడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఎందుకు మాట్లాడటం లేదని బీజేపీ బుధవారం ప్రశ్నించింది. ఈ అంశంపై రాహుల్ మాట్లాడాలని డిమాండ్ చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ‘బావకు నోటీసులు రావడంపై రాహుల్ ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అని ప్రశ్నించారు. ‘యూపీఏ ప్రభుత్వ హయాంలో మాల్యా, వాద్రాలు చట్టాలను ఉల్లంఘించి కోట్లు గడించారు. అప్పుడు సకల సౌకర్యాలతో బతికిన వారు ఇప్పుడు కష్టాలను ఎదుర్కొంటున్నారు. అక్రమార్కులను మేం ఎలా చూస్తామో, యూపీఏ ఎలా చూసిందో మీరే చెప్పాలి’ అని విలేకరులతో సంబిత్ పాత్ర అన్నారు. -
‘ పన్ను ఎగవేతదారుల్లో తెలుగువారే అధికం’
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ప్రచురించిన 96 మంది పన్ను ఎగవేతదారుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 30 మంది ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి శుక్రవారం అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.