న్యూఢిల్లీ: మామిడి రైతులకు శుభవార్త. భారత మామిడి పండ్ల దిగుమతిపై ఉన్న నిషేధాన్ని యూరప్ సమాఖ్య ఎత్తివేసింది. దీంతో భారత్ నుంచి మామిడి పండ్లను పెద్ద ఎత్తున యూరప్ దేశాలకు ఎగుమతి చేసే అవకాశముంది. తద్వారా మామిడి పండ్లకు ధరలు పెరిగి రైతులు భారీ లాభాలు ఆర్జించే అవకాశం ఉంది.