concessions
-
బీజేపీ ఖాతాలోకే మద్యం ముడుపులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం తాలూకు ముడుపులు ఎన్నికల బాండ్ల రూపంలో మద్యం వ్యాపారుల నుంచి నేరుగా బీజేపీకే అందాయని ఆప్ నేతలు, ఢిల్లీ మంత్రులు ఆతిషి, సౌరభ్ భరద్వాజ్ శనివారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఉదంతంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఈడీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్నా ఆప్ నేతల నుంచి గానీ, మంత్రుల నుంచి గానీ రూపాయి కూడా రికవరీ కాలేదు. మద్యం దుకాణాలు దక్కించుకున్న శరత్చంద్ర రెడ్డి వాగ్మూలం ఆధారంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. కేజ్రీవాల్‌ను తానెన్నడూ కలవలేదని, మాట్లాడలేదని, ఆప్‌తో ఏ సంబంధమూ లేదని విచారణలో చెప్పిన మర్నాడే శరత్‌ను ఈడీ అరెస్టు చేసింది. కేజ్రీవాల్‌ను కలిసి మద్యం కుంభకోణంపై మాట్లాడానంటూ మాట మార్చగానే బెయిల్ పొందారు!’’ అని ఆరోపించారు. ‘‘శరత్ కంపెనీల ద్వారా బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.4.5 కోట్లు అందాయి. అరెస్టు అనంతరం బీజేపీకి ఆయన ఏకంగా మరో రూ.55 కోట్ల ఎన్నికల బాండ్లు ఇచ్చారు’’ అంటూ సంబంధిత వివరాలను మీడియాకు చూపించారు. -
అలాంటివేం లేవు.. టెస్లాకు షాకిచ్చిన భారత ప్రభుత్వం
అమెరికా విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ కార్ల దిగుమతిపై సుంకం రాయితీలు, స్థానిక విలువ జోడింపు మినహాయింపుల ప్రతిపాదనలేవీ పరిగణగించడం లేదని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం నుంచి టెస్లా పలు రాయితీలు, మినహాయింపులు ఆశిస్తున్న విషయం తెలిసిందే. భారీ బ్యాటరీలు, సెమీకండక్టర్లు, అయస్కాంత భాగాలపై స్థానిక విలువ జోడింపు నుంచి టెస్లా, ఇతర బహుళజాతి కార్ కంపెనీలను మినహాయించే ప్రతిపాదన ఏదైనా ఉందా అంటూ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిపై విధించే సుంకంపై రాయితీ కూడా ఏమీ ఉండదని తెలిపారు.. ఇది కూడా చదవండి: AI warning: బ్యాంకులకూ ముప్పు తప్పదా? హెచ్చరిస్తున్న జెరోధా సీఈవో నితిన్ కామత్ భారత ప్రభుత్వం రూ.25,938 కోట్ల బడ్జెట్ వ్యయంతో ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ పరిశ్రమలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించిందని పేర్కొన్న ఆయన ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి విడి భాగాలతో సహా రేపటితరం ఆటోమోటివ్ టెక్నాలజీస్ ఉత్పత్తుల్లో దేశీయ తయారీని పెంచడమే లక్ష్యంగా ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు వివరించారు. -
యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు
భారీ పరిశ్రమలను ఆకర్షించేలా యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం 2023 – 27 విధివిధానాలను తాజాగా విడుదల చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 30 వరకు నూతన పాలసీ అమల్లో ఉంటుంది. ఈ కాలపరిమితిలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయి. యాంకర్ యూనిట్లతో పాటు లార్జ్, మెగా, అల్ట్రా మెగా, ఎంఎస్ఎంఈలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టమైన విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా ప్రభుత్వం నూతన పాలసీ విధివిధానాలను రూపొందించింది. యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు అందించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. యాంకర్ యూనిట్ రూ.500 కోట్లకు పైబడి పెట్టుబడితో ఏర్పాటవ్వాలి. కనీసం 1,000 మందికి ఉపాధి కల్పించాలి. ఈ యూనిట్ ఆధారంగా కనీసం మరో ఐదు యూనిట్లు ఏర్పాటవ్వాలి. ఇటువంటి యూనిట్లకు పారిశ్రామిక పాలసీ 2023 – 27లో పేర్కొన్న ప్రోత్సాహకాలతో పాటు అదనపు రాయితీలు కూడా లభిస్తాయి. యూనిట్ ఏర్పాటు వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కలిగే ప్రయోజనం, ఉపాధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ యూనిట్ ప్రతిపాదనలను బట్టి టైలర్ మేడ్ రాయితీలను ఇవ్వనున్నారు. తొలుత యాంకర్ యూనిట్ పూర్తి నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌కు సమర్పించాలి. వారు కోరుకొనే రాయితీలను ప్రజంటేషన్ రూపంలో చూపించాలి. ఆ రాయితీలు ఇవ్వడానికి సహేతుక కారణాలను వివరించాలి. ఈ ప్రతిపాదనలను ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీ ముందుకు తేవాలి. వాటిని ఎస్ఐపీబీ పరిశీలించి భూమి ధరలు, ప్రత్యేక రాయితీలపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లు విస్తరణ చేపట్టినా, లేక వేరే రంగంలో పెట్టుబడులు పెట్టినా వాటికి కూడా నిబంధనలకు అనుగుణంగా రాయితీలు అందుతాయి. రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన ప్రతి పరిశ్రమకు ఆధార్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఉద్యోగుల్లో 75 శాతం స్థానికులకే అవకాశం కల్పించాలని, అటువంటి సంస్థలకే ఈ రాయితీలు, ప్రోత్సాహకాలు లభిస్తాయని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామికవేత్తలు స్థాపించే పరిశ్రమలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం కింద ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ఇందులోనూ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందుకు విధివిధానాలను నూతన పాలసీలో పొందుపరిచింది. ఈ పరిశ్రమల్లో 100 శాతం పెట్టుబడి ఎస్సీలు, ఎస్టీల పేరు మీద ఉండాలి. 100 శాతం పెట్టుబడి ఎస్సీ, ఎస్టీ మహిళల పేరు మీద ఉంటే వాటిని ఎస్సీ, ఎస్టీ మహిళా యూనిట్లుగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ మహిళలను తొలి తరం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలు మాత్రమే కాకుండా వారిని చేయిపట్టుకొని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నూతన పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. జగనన్న కాలనీల్లో వాక్ టు వర్క్ విధానంలో పనిచేసుకునే విధంగా ఉమ్మడి వసతులతో కూడిన సూక్ష్మ యూనిట్లు ఏర్పాటు చేయడానికి క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది. ఈ క్లస్టర్లలో ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కాలనీల్లో యూనిట్లు ఏర్పాటు చేసేలా ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
కరెంటు బండి.. కొందాం పదండి
సాక్షి, అమరావతి: దేశమంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) ట్రెండ్ నడుస్తోంది. తక్కువ ఖర్చులో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఈ వాహనాల పట్ల అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ఈవీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఇవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. సహజంగానే ఏ రాష్ట్రంలో వాహనం తక్కువ రేటుకి వస్తుందో అక్కడ వాహనం కొని, అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుని సొంత రాష్ట్రానికి తెచ్చుకుని వాడుకోవడం చాలా మందికి అలవాటు. పలువురు వాహన వ్యాపారులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంటారు. విద్యుత్ వాహనాలను కూడా ఇదే విధంగా తక్కువ రేటుకు లభించే రాష్ట్రంలో కొని తెచ్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కొత్త సెక్షన్ తెచ్చిన కేంద్రం దేశవ్యాప్తంగా ఈవీలకు కేంద్రం కొన్ని రాయితీలు ఇస్తోంది. దేశంలో ఆదాయ పన్ను చట్టాల ప్రకారం.. కార్లు లగ్జరీ ఉత్పత్తుల కిందకు వస్తాయి. అందువల్ల పౌరులు వీటి కోసం తీసుకునే రుణాలపై పన్ను ప్రయోజనాలను పొందలేరు. కానీ విద్యుత్ వాహనాల (ఈవీ) యజమానులను పన్నుల నుంచి మినహాయించేందుకు ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్ యాక్ట్‌లో 80 అనే కొత్త సెక్షన్‌ని కేంద్రం తీసుకువచి్చంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ జారీకి, పునరుద్ధరించడానికి చెల్లించాల్సిన రుసుము నుంచి ఈవీలకు మినహాయింపు ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2019లో తీసుకువచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్–2) పథకంలో ద్విచక్ర వాహనాలకు (రూ.1.5 లక్షల ధర వరకు) కిలోవాట్అవర్ (కేడబ్ల్యూహెచ్) బ్యాటరీ కెపాసిటీకి రూ.15 వేలు అందిస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లకు ప్రతి కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేలు ప్రత్యక్ష ప్రోత్సాహకాన్ని ఇస్తోంది. అలాగే ఈవీలపై 5%జీఎస్టీని మాత్రమే వసూలు చేస్తోంది. అయితే ఇవి ఒక వ్యక్తికి ఒక వాహనం కొనుగోలుకే వర్తిస్తాయి. ఈ విషయంలో రాష్ట్రాలు తమ వెసులుబాటునిబట్టి వేర్వేరుగా రాయితీలు, ప్రోత్సాహకాలను సమకూరుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఈవీలకు ఇస్తున్న రాయితీలు ► ఏపీలో ఈవీలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి పూర్తి మినహాయింపు లభిస్తోంది. ద్విచక్ర వాహనాలకు రూ.15 వేలు, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు కిలోవాట్‌కు రూ.10 వేలు, బస్సులకు రూ.20 వేలు రాయితీలిస్తోంది. నగరాలు, జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు వేల ప్రాంతాలను గుర్తించింది. చార్జింగ్ స్టేషన్ల యజమానులకు రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. ► ఢిల్లీ ప్రభుత్వం మొదటి వెయ్యి ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ రిజిస్ట్రేషన్లను మాత్రమే ప్రోత్సహిస్తోంది. ద్విచక్ర వాహనాలకు బ్యాటరీ సామర్థ్యం కేడబ్ల్యూహెచ్‌కు రూ.5 వేలు చొప్పున రూ.30 వేల వరకు అందిస్తోంది. ఇది రిజి్రస్టేషన్, రహదారి పన్ను మినహాయింపునకు అదనం. ► తెలంగాణ ప్రభుత్వం రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ ఖర్చులపై 100 శాతం మినహాయింపు ఇస్తోంది. మొదటి 2 లక్షల ద్విచక్ర వాహనాలు, 5 వేల నాలుగు చక్రాల వాహనాలు, 20 వేల త్రీవీలర్ ఆటోరిక్షాలకు రాయితీలను అందిస్తోంది. రాష్ట్రంలో బ్యాటరీ ఛార్జింగ్ సౌకర్యాలు ఉన్నాయి. మొదటి 500 బ్యాటరీ చార్జింగ్ పరికరాలపై 25 శాతం మూలధన రాయితీ ఇస్తోంది. పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్ విద్యుత్ టారిఫ్‌పై పదేళ్లపాటు డ్యూటీ మినహాయింపు ఉంటుంది. ► మహారాష్ట్రలోని అన్ని ఈవీలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులను ప్రభుత్వం మాఫీ చేసింది. మొదటి లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ప్రతి కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కెపాసిటీకి రూ.5 వేలు ప్రోత్సాహం అందిస్తోంది. ► గుజరాత్ మొదటి 1.1 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన వినియోగదారులకు ప్రతి కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంకు రూ.10 వేల వరకూ సబ్సిడీ ఇస్తోంది. మొదటి 10 వేల మందికి కేంద్రం ఇచ్చే రాయితీలను సమకూరుస్తోంది. ► మేఘాలయలో మొదటి 3,500 ద్విచక్ర వాహనాలకు ప్రతి కిలోవాట్‌కు రూ.10 వేల సబ్సిడీని అక్కడి ప్రభుత్వం అందిస్తోంది. మొదటి 2,500 నాలుగు చక్రాల వాహనాలకు కేడబ్ల్యూహెచ్‌కు రూ.4 వేలు ప్రోత్సాహకం ఇస్తోంది. ► అసోం ప్రభుత్వం మొదటి లక్ష ద్విచక్ర వాహనాలు, 75 వేల త్రిచక్ర, 25 వేల నాలుగు చక్రాల వాహనాలకు వచ్చే ఐదేళ్లలో వాణిజ్య, వ్యక్తిగత వినియోగానికి వాడుకునే వెసులుబాటు కలి్పస్తోంది. ఈ ఐదేళ్లూ రోడ్డు పన్ను రిజిస్ట్రేషన్ మినహాయింపు వర్తిస్తుంది. ► ఒడిశా 2025 వరకు పన్ను, రిజిస్ట్రేషన్ రుసుముల్లో 100% మినహాయింపును ప్రకటించింది. ► రాజస్థాన్‌లో 2 కేడబ్ల్యూహెచ్ వరకు బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈవీలకు రూ.5 వేలు సబ్సిడీ ఇస్తోంది. 2 నుంచి 4 కేడబ్ల్యూహెచ్ వరకు ఉంటే రూ.7 వేలు అందిస్తోంది. ఇక్కడ ఫోర్ వీలర్లకు ఎలాంటి రాయితీలు లేవు. ► పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈవీలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులను మాఫీ చేసింది. ► గోవా ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదని ప్రకటించింది. -
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గూడ్ న్యూస్.. భారీ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ముందుస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే టికెట్లో 5 శాతం రాయితీ కల్పించింది. 46 రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఆ మేరకు ఆన్లైన్ ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టం(ఓపీఆర్ఎస్) సాప్ట్‌వేర్‌ను అప్డేట్ చేసింది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీస్‌లకు ఈ రాయితీ వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తు రిజర్వేషన్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు సంస్థ పెంచింది. ఈ ఏడాది జూన్ వరకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ సదుపాయానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆన్ లైన్లో సులువుగా తమ టికెట్లను రిజర్వేషన్ చేసుకున్నారు. ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు ఈ ప్రత్యేక రాయితీలను టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. చదవండి: తెలంగాణకు అమిత్‌షా.. టూర్ ఖరారు "రాబోయే రోజుల్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. టీఎస్ఆర్టీసీ అందిస్తున్న రాయితీలను ప్రయాణీకులు సద్వినియోగం చేసుకుని సంస్థను ఆదరించాలి. సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లోనే సాధ్యం. ముందస్తు రిజర్వేషన్ విధానానికి మంచి స్పందన లభిస్తోంది. ప్రయాణీకులకు రవాణా సేవలను మరింత మెరుగుపరచడానికి తగిన కృషి జరుగుతోంది" అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని వారు కోరారు. -
రైళ్లలో వృద్ధులకు రాయితీలు ఇప్పుడే కాదు: కేంద్రం
న్యూఢిల్లీ: రైల్వేలపై ఖర్చుల భారం విపరీతంగా పెరిగిపోతోందని ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతేడాది ప్యాసింజర్ సేవలకు రూ.59,000 కోట్ల రాయితీలు ఇచ్చామని, పెన్షన్లు, జీతాల బిల్లు భారీగానే ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైళ్లలో వృద్ధులకు రాయితీలను ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశం లేదని పరోక్షంగా చెప్పారు. వాటిని కరోనా సమయంలో రద్దు చేయడం తెలిసిందే. ‘‘ప్రయాణికుల సేవలకు ఏటా రూ.59,000 కోట్ల రాయితీలివ్వడం మామూలు విషయం కాదు. పైగా రూ.60,000 కోట్ల పెన్షన్ బిల్లు, రూ.97,000 కోట్ల జీతాల బిల్లు, రూ.40,000 కోట్ల ఇంధన ఖర్చు భరించాల్సి వస్తోంది. కొత్త నిర్ణయాలు తీసుకొనే ముందు రైల్వేల ఆర్థిక పరిస్థితినీ పరిగణనలోకి తీసుకోవాలి’’ అని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: AP: 8.22లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ -
సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ భారీ షాక్!
సీనియర్ సిటిజన్లకు కేంద్ర రైల్వే శాఖ భారీ షాకిచ్చింది. గతేడాది రైల్వే శాఖ ప్రయాణికుల కోసం సుమారు రూ.59 వేల కోట్లు రాయితీ ఇచ్చింది. కానీ ఈ ఏడాది మాత్రం రాయితీని పునరుద్ధరించే అవకాశం లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్‌కు తెలిపారు. సీనియర్ సిటిజన్లకు రాయితీలను ఎప్పుడు పునరుద్ధరిస్తున్నారంటూ మహరాష్ట్ర ఎంపీ నవనీత్ (రాణా) కౌర్ అశ్వినీ వైష్ణవ్‌ను ప్రశ్నించారు. నవనీత్ ప్రశ్నకు సమాధానంగా మాట్లాడిన కేంద్ర మంత్రి.. రైల్వేలో పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు అధికంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో సీనియర్లకు రాయతీని పునరుద్ధరించడం ఇప్పట్లో వీలుకాదని పేర్కొన్నారు. అదే సమయంలో ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలు తీసుకొస్తున్నామని తెలిపారు. ఒకవేళ ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే..రాయితీని అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ప్రస్తుతానికైతే సీనియర్ల రాయితీని తీసుకొచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రతి ఒక్కరూ రైల్వే పరిస్థితిని కూడా చూడాలని కోరారు. -
సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్?
న్యూఢిల్లీ: కోవిడ్-19 సంకక్షోభ సమయంలో రద్దు చేసిన సీనియర్ సిటిజన్ల రైల్వే రాయితీ పొందే తరుణం రానుంది. ఈ మేరకు వారికి రాయితీ ఛార్జీలను పునరుద్ధరించాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. రైల్వేలు సాధారణ స్థితికి చేరుకుంటున్నందున, వివిధవర్గాలకు చెందిన ప్రయాణికులకు గతంలో అందించిన రాయితీలను తిరిగి అందించేలా చర్యలు చేపట్టాలని కమిటీ కోరింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు రైల్వే రాయితీ ఛార్జీల రాయితీ పునరుద్ధరణపై ఆలోచించాలని రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖను కోరింది. వారికి స్లీపర్ క్లాస్, ఏసీ-3 కేటగిరీల్లో మొత్తం ఛార్జీలో 40 శాతం నుండి 50 శాతం వరకు రాయితీని అందించాలని సిఫార్సు చేసింది. గతవారం ఆగస్టు 4న పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కమిటీ ఈ మేరకు పేర్కొంది. అయితే రాయితీ పునరుద్ధరణపై రైల్వే శాఖ అధికారిక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సీనియర్ సిటిజన్లు,జర్నలిస్టులకు అందించే రైల్వే ఛార్జీల రాయితీలు 2020 మార్చి 20నుంచి రద్దైన సంగతి తెలిసిందే. బీజేపీ లోక్‌సభ ఎంపీ రాధామోహన్ సింగ్ రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. -
అలాంటిదేమీ లేదు...దంచుడు దంచుడే!
సాక్షి,ముంబై: సీనియర్ సిటిజన్స్‌కు రైల్వే శాఖ అందించే రాయితీలను తిరిగి ప్రారంభించనున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జూలై 1 నుండి సీనియర్ సిటిజన్స్ రాయితీలు తిరిగి పొందవచ్చు అనేవార్త వైరల్ అయింది. అయితే దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇది ఫేక్ న్యూస్ అంటూ ఈ వార్తలను కొట్టిపారేసింది. ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ దివ్యాంగులు, రోగులతోపాటు, కొంతమంది విద్యార్థులకు మాత్రమే రాయితీలు ఇస్తోందని పునరుద్ఘాటించింది. అలాగే రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు పీఐబీ“ఫ్యాక్ట్ చెక్” హ్యాండిల్ ట్వీట్ చేసింది. దీంతో ఇక నైనా తమకు చార్జీల భారంనుంచి ఉపశమనం లభిస్తుందని ఆశించిన వయో వృద్ధులకు తీరని నిరాశే మిగిలింది. త్వరలోనే రాయితీ తిరిగి లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా కోవిడ్-19 సంక్షోభ సమయంలో రైళ్లలో సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉన్న ఛార్జీల రాయితీని భారతీయ రైల్వే తాత్కాలికంగా నిలిపివేసింది. కరోనాకి ముందు రైల్వేలో ప్రత్యేక రాయితీల ద్వారా 58 ఏళ్లు పైబడిన స్త్రీలకు టిక్కెట్టు ధరలో 50 శాతం, 60 ఏళ్లు పైబడిన పురుషులు, థర్డ్ జెండర్ ప్యాసెంజర్లకు 40 శాతం రాయితీ అమలయ్యేది. అయితే తొలి విడత లాక్డౌన్ నుంచి ఈ రాయితీలు ఏవీ అమలు కావడం లేదు. గడిచిన రెండేళ్లలో సీనియర్ సిటిజన్లకు కనుక రాయితీని అమలు చేసి ఉంటే రైల్వేశాఖ ఖజానాలో రూ.3464 కోట్ల రూపాయలు, ఇందులో కనీసం రూ. 1500 కోట్ల రాయితీగా వృద్ధులకు అక్కరకు వచ్చేదని ఇటీవలి ఆర్టీఐ సమాచారం ద్వారా వెల్లడైంది. అలాగే కరోనా కారణంగా 2020 మార్చిలో వయోవృద్ధుల రాయితీలను తొలగించిన మంత్రిత్వ శాఖకు వాటిని పునరుద్ధరించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఏడాది మార్చిలో పార్లమెంటుకు తెలియజేశారు. A #Fake media report is claiming that the Indian Railways will resume concessions for senior citizens from July 1, 2022 ▶️ No such announcement has been made by @RailMinIndia ▶️ Indian Railways is currently providing concessions to divyangjans, patients & students only pic.twitter.com/ePoctCRu3A — PIB Fact Check (@PIBFactCheck) June 16, 2022 -
సీనియర్ సిటిజన్ల ముక్కుపిండి రూ.1500 కోట్లు వసూలు
కరోనా సంక్షోభం మొదలు రైల్వేశాఖ బాదుడు మొదలైంది. సాధారణ రైళ్లకే ప్రత్యేకం పేరు పెట్టి అదనపు ఛార్జీలు వసూలు చేసింది. తక్కువ ధరకు సామాన్యులకు అందుబాటులో ఉండే ప్యాసింజర్ రైళ్లను ఎడాపెడా రద్దు చేసి పారేసింది. ఆఖరికి సామాజిక బాధ్యతగా వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీలను ఏకపక్షంగా ఎత్తేసింది. ఆఖరికి సీనియర్ సిటిజన్లపై కూడా కనికరం చూపలేదు. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చారు. గడిచిన రెండేళ్లుగా సీనియర్ సిటిజన్లకు రైల్వే ప్రయాణాల్లో రాయితీలు ఎత్తి వేయడం ద్వారా రైల్వేశాఖ వృద్ధ ప్రయాణికుల నుంచి అదనంగా రూ. 1500 కోట్లను తన ఖాతాలో జమ చేసుకుంది. రాయితీలు బంద్ కరోనా కారణంగా 2020 మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దీంతో జనజీవనం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత క్రమంగా రైళ్లను పట్టాలెక్కించింది, అయితే అవన్ని ప్రత్యేక రైళ్లుగా పేర్కొంటూ.. అప్పటి వరకు అందిస్తూ వచ్చిన అన్ని రకాల రాయితీలను రైల్వేశాఖ ఎత్తేసింది. ఇందులో సీనియర్ సిటిజన్లు ఇచ్చే ప్రయాణ రాయితీ కూడా ఉంది. సీనియర్ సిటిజన్స్ రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రాయితీలు ఉన్నాయి. 58 ఏళ్లు పైబడిన స్త్రీలకు టిక్కెట్టు ధరలో 50 శాతం, 60 ఏళ్లు పైబడిన పురుషులు, థర్డ్ జెండర్ వాళ్లకు టిక్కెట్టు ధరలో 40 శాతం రాయితీ ఉంది. అయితే తొలి విడత లాక్డౌన్ నుంచి ఈ రాయితీలు ఏవీ అమలు కావడం లేదు. దీనికి సంబంధించిన సమాచారం ఆర్టీఐ ద్వారా సేకరించారు. 7.31 కోట్ల మంది ప్రయాణం 2020 మార్చి 20 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా వివిధ రైళ్లలో 7.31 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ప్రయాణం చేశారు. ఇందులో 4.46 కోట్ల మంది పురుషులు, 2.84 కోట్ల మంది స్త్రీలు, 8,310 మంది థర్డ్ జెండర్ వాళ్లు ఉన్నారు. వీళ్లకు ఈ రెండేళ్ల కాలంలో ఎటువంటి రాయితీ కల్పించలేదు. దీంతో వీళ్ల ప్రయాణాల ద్వారా రైల్వేకు రూ.3464 కోట్ల ఆదాయం సమకూరింది. రూ. 1500 కోట్లు గడిచిన రెండేళ్లలో సీనియర్ సిటిజన్లకు కనుక రాయితీని అమలు చేసి ఉంటే రైల్వేశాఖ ఖజానాలో చేరిన రూ.3464 కోట్ల రూపాయల్లో కనీసం రూ. 1500 కోట్ల రాయితీగా వృద్ధులకు అక్కరకు వచ్చేది. ఈ డబ్బు వారి కనీస అవసరాలు, మందులు మాకులకు పనికి వచ్చేవి. కానీ కరోనా కష్ట సమయంలోనూ వృద్ధులపై దయ చూపేందుకు రైల్వేశాఖ ససేమిరా అంది. ప్రతీ ప్రయాణంలోనూ వారి వద్ద నుంచి ఫుల్ ఛార్జీ వసూలు చేస్తూ తన బొక్కసం నింపుకుంది. బాధ్యత మరిచిన రైల్వే రైల్వేశాఖలో వృద్ధులు, సైనికులు, రోగులు, మాజీ ప్రజాప్రతినిధులు, దివ్యాంగులు ఇలా మొత్తం 53 రకాల రాయితీలను అందిస్తోంది, వీటి వల్ల రైల్వే ఆదాయానికి ఏటా సగటున రూ.2000 కోట్లు తూటు పడుతోంది. అయితే ఆ మేరకు సామాజిక భద్రత లభిస్తోంది. అయితే లాభాలే ముఖ్యం సామాజిక భద్రత మా బాధ్యత కాదన్నట్టుగా ఇటీవల రైల్వే వ్యవహరిస్తుండటంతో గత రెండేళ్లుగా ఈ రాయితీలేవీ అమలు కావడం లేదు. చదవండి: తల్లిబిడ్డల కోసం రైల్వేశాఖ వినూత్న నిర్ణయం! -
4 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు భారంగా రైల్వేశాఖ నిర్ణయం!
అవసాన దశలో ఇతరులపై ఆధారపడి జీవించే వారికి శాపంగా మారింది రైల్వేశాఖ నిర్ణయం. అరకొర ఆదాయంతోనే పొదుపు చేసుకున్న సొమ్ముతోనో ప్రయాణం చేసే సీనియర్ సిటిజన్స్‌కి రైల్వేశాఖ నిర్లక్ష్య వైఖరి భారంగా మారింది. కరోనా సంక్షోభం సమయంలో ఎత్తి వేసిన రాయితీలు నేటికి పునరుద్ధరించకపోవడంతో తమకు ఇబ్బందిగా మారిందంటున్నారు సీనియర్ సిటిజన్లు. రాయితీలకు కోత సామాజిక బాధ్యతగా రైల్వేశాఖ సమాజంలోని సీనియర్ సిటిజన్లు, ఉద్యోగార్థులు, రోగులు, జర్నలిస్టులు, ఆర్మీ తదితర వర్గాలకు రైలు ప్రయాణం సందర్భంగా రాయితీలు కల్పిస్తోంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు సంబంధించి 58 ఏళ్లు దాటిన స్త్రీలకు 50 శాతం 60 ఏళ్లు దాటిన పురుషులకు 40 శాతం రాయితీ ఉంది. అయితే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా రైళ్ల సర్వీసులను 2020 మార్చి 24 నుంచి రద్దు చేశారు. ఆ తర్వాత మూడు నెలల తర్వాత రైళ్లు క్రమంగా ప్రారంభం అయ్యాయి. అయితే రాయితీ మాత్రం పునరుద్ధరించలేదు. అధిక ఛార్జీలు రైలు సర్వీసులు ప్రారంభమైనా రాయితీల విషయంలో రైల్వేశాఖ మౌనముద్ర వహించింది. దీంతో గత ఏడాది కాలంగా అన్ని రైళ్లలో ప్రయాణిస్తున్న సీనియర్ సిటిజన్లు టిక్కెట్టు ఛార్జీలు పూర్తిగా చెల్లించాల్సి వస్తోంది. పైగా ప్రస్తుతం నడుస్తున్నవి ప్రత్యేక రైళ్లు కావడంతో అన్నింటా అధికంగానే సొమ్ములు చెల్లించాల్సి వస్తోంది. ఆదాయం తగ్గిపోయి, అనారోగ్యాలకు చేరువైన సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణాలు భారంగా మారాయి. ముఖ్యంగా హెల్త్ చెకప్‌ల కోసం క్రమం తప్పకుండా ప్రయాణాలు చేసే వారు మరీ ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు కోట్ల మంది లాక్డౌన్ తర్వాత స్పెషల్ ట్యాగ్‌తో రైల్వే సర్వీసులు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఎంత మంది సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించారనే వివరాలు కావాలంటూ మధ్యప్రదేశ్‌కి చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే ఆర్టీఐ కార్యకర్త దరఖాస్తు సమర్పించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. 2021 సెప్టెంబరు 31 నాటికే దేశవ్యాప్తంగా రిజర్వ్డ్ రైళ్లలోనే 3,78,50,668 మంది ప్రయాణం చేసినట్టు రైల్వే రికార్డులు వెల్లడించాయి. ఈ రోజు వరకయితే ఈ సంఖ్య నాలుగు కోట్లకు తక్కువగా ఉండదు. మంత్రి కేటీఆర్ ట్వీట్ ఆర్టీఐ ద్వారా సమాచారం వెల్లడి కావడంతో ఒక్కసారిగా రైల్వేశాఖపై విమర్శలు పెరిగాయి. కరోనా వంటి సంక్షోభం సమయంలో ఓ వైపు ఆదాయం తగ్గిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే రాయితీలకు కోత పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సమాజానికి సర్వం ధారపోసిన వృద్ధుల పట్ల నిర్థయగా వ్యవహరించడం సరికాదంటూ సుతిమొత్తగా హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సైతం రైల్వేశాఖ తీరును తప్పు పట్టారు. రాయితీలు పునరుద్ధరించాలంటూ రైల్వేమంత్రికి విజ్ఞప్తి చేశారు. VerY unfortunate situation Railway Minister @AshwiniVaishnaw Ji Please review the decision in the interest of crores of senior citizens who deserve our assistance and respect https://t.co/cNvbyHx0oH — KTR (@KTRTRS) November 23, 2021 చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. -
టిక్కెట్ల రాయితీలపై రైల్వే మంత్రి కీలక ప్రకటన
న్యూఢిల్లీ : ప్రయాణాల్లో వివిధ కేటగిరీలకు అందించే రాయితీలపై రైల్వే మంత్రి కీలక ప్రకటన చేశారు. రాయితీలను ఎప్పుడు పునరుద్ధరించాలనే అంశంపై ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైల్వే టిక్కెట్లపై రాయితీలు ఇవ్వబోమన్నారు. ప్రస్తుతం ఉన్నట్టుగానే ఫుల్ ఛార్జీ వసూలు చేస్తామన్నారు. గతేడాది రైల్వేశాఖ తాత్కాలికంగా రద్దు చేసిన ప్రయాణ రాయితీలను ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారంటూ శుక్రవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. రాయితీలు ఇప్పుడే పునరుద్ధరించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కరోనా సంక్షోభం కారణంగా 2020 మార్చిలో రైల్వేశాఖ దేశవ్యాప్తంగా రైళ్లను రద్దు చేసింది. ఆ తర్వాత క్రమంగా రైళ్లను ప్రారంభించింది. అయితే వాటిని సాధారణ రైళ్లుగా కాకుండా ప్రత్యేక రైళ్లుగా పరిగణిస్తోంది. దీంతో ఈ రైళ్లలో రాయితీలు వర్తించడం లేదు. రైల్వే శాఖ ఆర్మీ, సీనియర్ సిటిజన్లు, క్యాన్సర్ రోగులు, జర్నలిస్టులు ఇలా మొత్తం 51 కేటగిరీలలో రాయితీలు అందిస్తోంది. ప్రస్తుతం ఇందులో దివ్యాంగులు, స్టూడెంట్స్, రోగులకే రాయితీలు వర్తిస్తున్నాయి. మిగిలిన కేటగిరీలకు ఫుల్ ఛార్జీని వసూలు చేస్తోంది. -
కోవిడ్ సాయానికి పన్ను మినహాయింపు
హైదరాబాద్: కరోనా కష్టకాలంలో ఉద్యోగులకు అండగా నిలిచిన యాజమాన్యాలు, కష్టాల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం అందించి బాసటగా నిలిచిన వారిని ప్రోత్సహించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడ్డ ఉద్యోగులను ఆదుకునేందుకు యాజమాన్యాలు చెల్లించిన మొత్తానికి పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది. పన్ను మినహాయింపు ఆదాయపు పన్ను శాఖ తాజాగా జారీ చేసిన సూచనల ప్రకారం ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులకు సంస్థలు ఇచ్చిన పరిహారం మొత్తంపైనా ఎలాంటి పన్ను వసూలు ఉండదు. అదే విధంగా కరోనా చికిత్స కోసం పలువురికి వారి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆర్థిక సహాయం చేశారు. ఈ సాయం మొత్తం రూ. 10 లక్షల లోపు వరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఆగష్టు 31 వరకు పన్ను చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించే వివాద్ సే విశ్వాస్ పథకాన్ని ఆగస్టు 31 వరకు కేంద్రం పొడిగించింది. అదే విధంగా అక్టోబరు 31 వరకు పన్ను చెల్లించే అవకాశం కల్పించింది. చదవండి : మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొంటాం! -
రైలులో రాయితీల కూత
సాక్షి, ఏలూరు (టూటౌన్) : భారతీయ రైల్వేలో రాయితీల కూత కూస్తుంది. అన్ని వర్గాల ప్రజలకు రైల్వే శాఖ అనేక రాయితీలను ఇస్తుంది. తక్కువ ఛార్జీలతో ప్రయాణికులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ గమ్యస్థానాలకు చేరుస్తోంది. దీనిలో విద్యార్థులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, జర్నలిస్టులు, కళాకారులు, వృద్దులు, జాతీయ పురస్కార గ్రహీతలు, అమరవీరుల కుటుంబ సభ్యులు, క్రీడాకారులు, స్వాతంత్ర సమరయోధులు.. ఇలా ఎన్నో వర్గాలకు వివిధ రుపాల్లో రైల్వే రాయితీ కల్పిస్తుంది. ఇవి ఎలా పొందాలో అవగాహన లేకపోవడం వల్ల రైల్వేలో రాయితీ ప్రయాణాలను చాలా మంది పొందలేకపోతున్నారు. ఆయా వర్గాల వారు వారి శాఖలు అందించే అధికారిక గుర్తింపు కార్డులను రైల్వే అధికారులకు సమర్పిస్తే రాయితీలను పొందే అవకాశం ఉంటుంది. రైల్వేలో లభించే వివిధ రాయితీల వివరాలను మీకోసం ‘సాక్షి’ అందిస్తుంది. గుర్తింపుకార్డులు.. రైల్వే శాఖ ప్రకటించిన రాయితీలు పొందేందుకు జర్నలిస్టులు, కళాకారులు, క్రీడాకారులు ముందుగా రైల్వే అధికారుల నుంచి గుర్తింపు కార్డులు పొందాలి. మిగిలిన వర్గాల వారు వారికి సంబంధించిన అర్హత సర్టిఫికెట్లను రైల్వే బుకింగ్ కౌంటర్ వద్ద చూపించి రాయితీ పొందవచ్చును. అలాగే ధ్రువీకరణ పత్రాలను ప్రయాణ సమయంలో తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాలి. రైల్వే అధికారులు అడిగినప్పుడు వారికి చూపించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఉచిత పాస్‌లు.. పదో తరగతి వరకూ చదివే విద్యార్థులు, ఇంటర్ చదివే బాలికలకు మాత్రమే రైల్వేశాఖ ఉచిత ప్రయాణ పాసులను అందిస్తోంది. ఇందులో విద్యార్థి నివాస ప్రాంతం నుంచి స్కూల్, కాలేజీలకు వెళ్లి రావడానికి ఈ పాస్‌లను జారీ చేస్తారు. ఈ పాస్‌ల కోసం విద్యార్థులు రైల్వే కౌంటర్ నుంచి ప్రత్యేక దరఖాస్తులను తీసుకుని వాటిపై సంబంధిత ప్రధానోపాధ్యాయుల, కాలేజ్ ప్రిన్సిపాల్ చేత అటెస్టేషన్ చేయించాల్సి ఉంది. కాలేజీ విద్యార్థులకు సంబంధించి.. సగం చార్జీలకే కాలేజీ విద్యార్థులకు రైల్వే శాఖ సీజన్ టిక్కెట్లను జారీ చేస్తుంది. ఈ పాసులను మూడు నెలలకు ఒకేసారి తీసుకుంటే తగ్గింపు లభిస్తుంది. ఈ సీజన్ పాసులను రెండు ప్రాంతాల మధ్య 150 కిలోమీటర్లు లోపు ప్రయాణించే వారికి జారీ చేస్తారు. విద్యార్థి నివాసానికి, చదివే కాలేజీకి మధ్య ఈ దూరంను పరిగణలోనికి తీసుకుంటారు. జర్నలిస్టులకు 50 శాతం రాయితీ.. దేశవ్యాప్తంగా వివిధ పత్రికలు, ఛానెల్స్‌లో పనిచేసే అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ప్రయాణ ఛార్జీల్లో 50 శాతం రాయితీని రైల్వే శాఖ ఇస్తుంది. ఈ పాసు ద్వారా జర్నలిస్ట్ ఏడాది పొడవునా, భార్య, ఇద్దరు పిల్లలు ఏడాదిలో రెండు పర్యాయాలు సగం చార్జీలతో ప్రయాణం చేయవచ్చు. 15 రోజుల చార్జితో నెలంతా ప్రయాణం.. సీజన్ టిక్కెట్ ప్రయాణికులు తాము ప్రయాణించే రెండు ప్రాంతాల మధ్య ఉన్న చార్జీని 15 రోజులకు ఒకేసారి చెల్లించి దీన్ని పొందవచ్చును. ఈ సీజన్ టిక్కెట్ ద్వారా నెలంతా ప్రయాణం చేసే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. ప్రయాణ దూరం 150 కిలోమీటర్ల లోపు దీన్ని వర్తింప చేసేవారు. అయితే తాజాగా ఈ దూరాన్ని 180 కిలోమీటర్లకు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడానికి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు జనరల్ విభాగంలో ఉచిత ప్రయాణ సౌకర్య కల్పిస్తారు. స్లీపర్ క్లాసులో అయితే 50 శాతం రాయితీని అందిస్తారు. అవార్డు గ్రహీతలకు.. రాష్ట్రపతి నుంచి పోలీస్ మెడల్, ఇండియన్ పోలీస్ మెడల్ సాధించిన పురుషులకు అన్ని రైళ్లలో 50 శాతం రాయితీని, మహిళలకు 60 శాతం రాయితీని ఇస్తారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు 50 శాతం రాయితీతో సెకండ్ క్లాస్ స్లీపర్ క్లాసులో ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తున్నారు. అమరవీరుల కుటుంబాలకు.. విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులకు, ఉగ్ర దాడుల్లో మరణించిన మిలటరీ దళాలు, పోలీసు కుటుంబాల సభ్యులకు జనరల్, స్లీపర్ ఛార్జీల్లో రాయితీని కల్పిస్తున్నారు. క్రీడాకారులకు... జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనే వారికి జనరల్, స్లీపర్ క్లాసుల్లో 75 శాతం ఫస్ట్ క్లాసుల్లో రాయితీని పొందవచ్చును. పర్వతారోహణల్లో పాల్గొనే వారికి కూడా ఇదే తరహాలో రాయితీలు వర్తిస్తాయి. వైద్యులకు, సివిల్ సర్వీస్ ఉద్యోగులకు.. అంతర్జాతీయ స్థాయిలో సివిల్ సర్వీస్ సేవలు అందిస్తున్న వారికి, సామాజిక, సాంస్కృతిక, విద్యారంగాల్లో అఖిల భారత సదస్సులకు హాజరయ్యే వైద్యులకు జనరల్, స్లీపర్ క్లాస్‌లలో 25 శాతం రాయితీని రైల్వే అందిస్తుంది. వి«ధులకు వెళ్లే నర్సులకు కూడా ఈ రాయితీ వర్తింస్తుంది. దివ్యాంగులకు.. శారీరక వైకల్యం, మానసిక రుగ్మతలతో బాధపడే వారు, అంధులకు జనరల్, స్లీపర్, థర్డ్ ఏసీలతో పాటు ఏసీ చైర్ కార్లో 75 శాతం రాయితీతో ప్రయాణించవచ్చు. ఫస్ట్‌క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీల్లో 50 శాతం రాయితీ వస్తుంది. రాజధాని, శతాబ్ది రైళ్లల్లో 25 శాతం మినహాయింపు ఉంటుంది. వీరితో పాటు వెంట వెళ్లే సహాయకులకు కూడా టికెట్ ఛార్జీల్లో అంతే రాయితీ లభిస్తుంది. చెవిటి, మూగ (బధిరులకు) సెకంట్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాసు ఏసీల్లో 50 శాతం రాయితీ కల్పిస్తున్నారు. వృద్ధులకు.. సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ రాయితీలను అందిస్తోంది. 60 సంవత్సరాలు నిండిన పురుషులకు 40 శాతం, 58 ఏళ్లు నిండిన మహిళలకు 50 శాతం చొప్పున రాయితీని కల్పిస్తున్నారు. ఈ రాయితీ అన్ని తరగతుల ప్రయాణ ఛార్జీలకు వర్తిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో భాధపడే వారికి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు అనగా క్యాన్సర్ రోగులు తరచూ రైలులో ప్రయాణించాలంటే తరగతులను బట్టి 50 శాతం నుంచి 100 శాతం రాయితీని అమలు చేస్తున్నారు. వీరితో పాటు వీరికి సహాయకులుగా వెళ్లే వారికి ఇదే రాయితీ వర్తిస్తుంది. తలసేమియా, గుండె, కిడ్నీ, శస్త్ర చికిత్సలకు వెళ్లే వారికి 50 శాతం రాయితీని అందిస్తున్నారు. కుష్టు, హెచ్ఐవీ, అనీమియా, టీబీ రోగులకు 50 నుంచి 75 శాతం వరకూ రాయితీని ఇస్తున్నారు. కళాకారులు, కార్మికులకు.. కూరగాయలు అమ్ముకునే వారు, ఇళ్లల్లో పనిచేసేవారు, వ్యవసాయ కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులకు 100 కిలోమీటర్ల పరిధిలో అత తక్కువ ధరకే సీజన్ టిక్కెట్లు అందిస్తోంది. ఈ రాయితీలు పొందాలంటూ టిక్కెట్‌కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశారు. కళాకారులకు జనరల్, స్లీపర్ క్లాసుల్లో 75 శాతం, ఫస్ట్ క్లాస్ ఏసీ చైర్ కార్ 50 శాతం, సినీ సాంకేతిక నిపుణులకు విధుల్లో ప్రయాణించాలంటే స్లీపర్ క్లాసులో 75 శాతం, ఫ్లస్ట్ క్లాస్ ఏసీలో 50 శాతం రాయితీని రైల్వే శాఖ కల్పిస్తోంది. -
చెక్కులు... చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్ రాయితీ పథకాలకు వరుస అవరోధాలు ఎదురవుతున్నాయి. నాలుగేళ్లు బీసీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో రాయితీ పథకాలను నిలిపివేశారు. అయితే 2018–19 వార్షిక సంవత్సరంలో ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులిచ్చింది. దీంతో క్షేత్రస్థాయి నుంచి స్వయం ఉపాధిలో ఆసక్తి ఉన్న బీసీ నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు, తొలివిడతగా మొదటి కేటగిరీ లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా దాదాపు 41వేల మంది లబ్ధిదారులను గుర్తించిన బీసీ కార్పొరేషన్ ఒక్కో లబ్ధిదారుకు గరిష్టంగా రూ.50 వేల చొప్పున రాయితీని నేరుగా ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు దాదాపు 19 వేల మందికి అధికారులు చెక్కులను పంపిణీ చేశారు. మిగతా 22 వేలమంది లబ్ధిదారులకు రూ.106 కోట్లకు సంబంధించి చెక్కులు పంపిణీ చేస్తున్న సమయంలోనే అసెంబ్లీ రద్దు కావడం, ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో డిసెంబర్ వరకు చెక్కుల పంపిణీ అటకెక్కింది. తిరిగి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చెక్కుల పంపిణీకి ప్రభుత్వ అనుమతి తీసుకున్న బీసీ కార్పొరేషన్... లబ్ధిదారుల పేరిట కొత్తగా చెక్కులను తయారు చేసి జిల్లాలకు పంపింది. ఇంతలో జనవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫలితంగా మరోమారు చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి గడువు ముగిసిన తర్వాత లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసేందుకు బీసీ కార్పొరేషన్ సిద్ధమైంది. ఈ క్రమంలో చెక్కుల పంపిణీకి ప్రభుత్వ అనుమతి కోరింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంలో జాప్యం కావడంతో ఏకంగా పార్లమెంటు ఎన్నికల నగారా మోగింది. దీంతో స్వయం ఉపాధి పథకానికి పూర్తిగా బ్రేక్ పడినట్లైంది. మే నెలాఖరు వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అప్పటివరకూ చెక్కులు పంపిణీ చేసే అవకాశం లేకుండా పోయింది. మరో పది రోజుల్లో వార్షిక సంవత్సరం ముగియనుంది. దీంతో ఈ ఏడాది విడుదల చేసిన నిధులను గడువులోగా ఖర్చు చేయకుంటే అవి తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమకానున్నాయి. లక్ష్యసాధన పూర్తి చేయాలంటే తిరిగి ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. -
భారీ డిస్కౌంట్ ప్రకటించిన రైల్వే
ముంబై : భారతీయ రైల్వే సంస్థ కొన్ని ప్రయోజనాల దృష్ట్యా విద్యార్థులకు భారీ డిస్కౌంట్ని అందించనున్నట్లు తెలిసింది. వివిధ వర్గాల విద్యార్థులకు వేర్వేరు రాయితీలు ప్రకటించింది. వివిధ అవసరాల దృష్ట్యా ప్రతి రోజు రైల్వేలో ప్రయాణిస్తున్న విద్యార్థుల కోసం 25 శాతం నుంచి పూర్తి ఉచిత ప్రయాణ సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపింది. రాయితీల వివరాలు... 1. ప్రతి రోజు జనరల్ క్లాస్‌లో ఎమ్ఎస్టీ(మంత్లీ సీజన్ టికెట్/ నెల పాస్ లాంటిది) మీద ప్రయాణించే అమ్మాయిల కోసం ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. బాలికలు పాఠశాల విద్య నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయేంత వరకూ ప్రతి రోజు జనరల్ క్లాస్‌లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. అబ్బాయిలకయితే ఇంటర్ వరకూ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. ఈ ఆఫర్ మదర్సాలలో చదివే విద్యార్థులకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది. 2. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రయాణించే విద్యార్థులకు ట్రెయిన్ టికెట్ ధర మీద 75 శాతం డిస్కౌంట్ని ప్రకటించింది. అయితే ఇది జనరల్ టికెట్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. 3. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి పోటి పరీక్షలకు హాజరయ్యేందుకు వెళ్లే విద్యార్థులకు ట్రెయిన్ టికెట్ ధర మీద 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. 4. ఇళ్లకు దూరంగా ఉంటూ చదువుకునే విద్యార్థుల కోసం, ఎడ్యుకేషనల్ టూర్ల కోసం వెళ్లే విద్యార్థులకు కూడా రాయితీలు ప్రకటించింది. వీరికి స్లీపర్ క్లాస్ టికెట్స్ మీద 50 శాతం రాయితీ, ఎమ్ఎస్టీ లేదా క్యూఎస్‌టీ(మూడు నెలల పాస్‌లాంటిది)ల మీద 50 శాతం డిస్కౌంట్ని ప్రకటించింది. 5. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇదే స్లీపర్ క్లాస్, ఎమ్ఎస్టీ, క్యూఎస్‌టీల మీద 75 శాతం రాయితీలను ప్రకటించింది. 6. పరిశోధనల నిమిత్తం ప్రయాణించే 35 ఏళ్ల లోపు విద్యార్థులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఏదైనా రిసెర్చ్ పని మీద వేర్వేరు ప్రదేశాలకు ప్రయాణించే విద్యార్థులకు ట్రెయిన్ టికెట్ చార్జీ మీద 50 శాతం డిస్కౌంట్ని ఇస్తున్నట్లు తెలిపింది. 7. వర్క్ క్యాంప్, కల్చరల్ కాంపీటిషన్ ప్రొగ్రామ్లలో పాల్గొనేందకు వెళ్లే విద్యార్థులకు స్లీపర్ క్లాస్ ట్రెయిన్ టికెట్ చార్జీల మీద 25 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 8. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏడాది ఒకసారి తీసుకెళ్లే స్టడీ టూర్ల కోసం జనరల్ క్లాస్ టికెట్ చార్జీల మీద 75 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. 9. భారతదేశంలో చదివే విదేశీ విద్యార్థులకు కూడా రాయితీలు ప్రకటించింది. భారతదేశంలో చదివే ఫారిన్ స్టూడెంట్స్, భారత ప్రభుత్వం నిర్వహించే ఏదైనా సెమినార్లకు హాజరయ్యేందుకు వెళ్లేటప్పుడు స్లీపర్ క్లాస్ టికెట్ల మీద 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. చారిత్రక ప్రదేశాల పర్యటనకు వెళ్లే విదేశీ విద్యార్థులకు కూడా ఇదే ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. 10. భారతీయ రైల్వే సంస్థ క్యాడెట్, మెరైన్ ఇంజనీర్ అప్రెంటిస్‌కు కూడా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. నౌకాయాన లేదా ఇంజనీరింగ్ శిక్షణ కోసం వెళుతున్న విద్యార్థులకు ట్రెయిన్ టికెట్ చార్జీల మీద 50శాతం రాయితీ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ట్రైనింగ్ కార్యక్రమం పూర్తయ్యే వరకూ వర్తిస్తుందని వెల్లడించింది. అయితే ఈ రాయితీలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి.. విధి విధానాల గురించి పూర్తి సమాచారాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిసింది. -
వికలాంగులు కాదు.. దివ్యాంగులు
న్యూఢిల్లీ: వికలాంగులను దివ్యాంగులుగా సంబోధించాలని ప్రధానమంత్రి నరేంద్రమోది చేసిన సూచనను రెండేళ్ల తర్వాత రైల్వే శాఖ ఆచరణలో పెట్టింది. రైల్వే రాయితీ ఫారాలలో వికలాంగ్ అని ఉన్నచోట దివ్యాంగ్గా నామావళిని మార్పు చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి అందజేసే రాయితీ(కన్సెషన్) దరఖాస్తులో ‘బ్లైండ్’ అని ఉన్నచోట దృష్టి బలహీనులుగా, చెవిటి మూగ అని ఉన్నచోట వినలేని, మాట్లాడలేని బలహీనులుగా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని ఉన్నచోట దివ్యాంగ్జన్ అని మార్పు చేశారు. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 1నుంచి అమలులోకి వస్తాయి. ఈ రాయితీ ధ్రువపత్రాల ప్రొఫార్మలో ఈ విధంగా మార్పులు చేయాలని ఆయా విభాగాలకు రైల్వే శాఖ సూచించింది. కాగా, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, రక్షణ సిబ్బంది తదితరులకు భారతీయ రైల్వే శాఖ రూ.1,600 కోట్ల విలువ చేసే 53 రకాల రాయితీలు ఇస్తోంది. మాట్లాడలేని, వినలేని దివ్యాంగులకు సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్ క్లాస్‌ల్లో 50 శాతం, దృష్టి బలహీనులకు సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఏసి చైర్‌కార్, ఏసీ త్రీ ట్రైర్లో 75 శాతం, ఏసీ టూ టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్‌ల్లో 50 శాతం రాయితీ ఇస్తోంది. -
టెక్ దిగ్గజం ఆపిల్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ : టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. కొత్త పన్ను విధానం కింద ఐఫోన్ తయారీదారి ఆపిల్‌కు పన్ను, డ్యూటీల పరంగా ఎలాంటి రాయితీలు అందించేది లేదని అధికారిక వర్గాలు చెప్పాయి. మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తున్నామని, దిగుమతులను కాదని పేర్కొన్నాయి. స్మార్ట్‌ఫోన్, వాటి దిగుమతి పార్ట్‌లపై కస్టమ్ డ్యూటీని ఇప్పటికే పెంచినట్టు పేర్కొన్నాయి. మేకిన్ ఇండియాను ప్రోత్సహించకుండా దిగుమతులను ప్రోత్సహించేది లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో ఎవరికీ కూడా ప్రత్యేక రాయితీలను ఇచ్చేది లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. కూపర్టినోకు చెందిన ఐఫోన్, ఐప్యాడ్ తయారీదారి ఆపిల్ బారత్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకు పలు రాయితీలను ఎప్పటినుంచో కోరుతోంది. కస్టమ్ డ్యూటీలను తగ్గింపు మాత్రమే కాక, 30 శాతం స్థానిక వనరులనే నియమించుకోవాలనే నిబంధన నుంచి కూడా తమల్ని మినహాయించాలని టెక్నాలజీ దిగ్గజం అభ్యర్థిస్తోంది. ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్ పేరులోకి రావడంతో, ఆపిల్ దృష్టి ప్రస్తుతం భారత్‌పై పడింది. వ్యయాలను తగ్గించుకోవడానికి స్థానికంగా తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేయాలని కంపెనీ భావిస్తోంది. దీనికోసం పలు రాయితీలను ఆపిల్ ఎప్పటినుంచో కోరుతోంది. ఆపిల్‌కు భారత్‌లో పూర్తిగా తన సొంతమైన స్టోర్ లేదు. రెడింగ్టన్, ఇంగ్రామ్ మైక్రో వంటి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా తన ఉత్పత్తులను భారత్‌లో విక్రయిస్తోంది. -
పరిశ్రమలకు చోటేది?
⇒ రాయితీలకు కోత.. ⇒ ఇవ్వాల్సిన రాయితీలు రూ. 1600 కోట్లు ⇒ ఇచ్చింది రూ. 564 కోట్లే ⇒ చిన్న పరిశ్రమకు దక్కని చేయూత సాక్షి, అమరావతి: రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాం అని చెబుతున్న ప్రభుత్వం.. పరిశ్రమలకు రాయితీల విషయంలోగానీ, చిన్న పరిశ్రమలకు చేయూత విష యంలోగానీ ఏమాత్రం ఆశాజనకంగా స్పందిం చడంలేదు. వార్షిక బడ్జెట్ కేటాయింపులను చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. కొత్తగా వచ్చే పరి శ్రమలకు ఈ కేటాయింపుల్లో రాయితీలు వచ్చే అవకాశం లేదని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. అన్ని విభాగాలకు కలిపి పరిశ్రమలశాఖకు ప్రభుత్వం రూ. 1,300 కోట్లు కేటాయించింది. ఇందులో పారిశ్రామిక రాయితీలకు కేవలం రూ. 564 కోట్లు మాత్రమే. నిజానికి ఈ ఏడాది మార్చి నాటికి రూ. 1,600 కోట్ల పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని సంబంధిత శాఖ ప్రభుత్వానికి ప్రతిపా దించింది. అయితే ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది భారీగా పెట్టుబడులు వస్తాయని, కొత్త యూనిట్లు ఉత్పత్తి ప్రారంభిస్తాయని ప్రభుత్వమే చెబుతోంది. 2015–20 పారిశ్రామిక విధానం ప్రకారం కొత్త యూనిట్లు ఉత్పత్తిలోకి వస్తే కనీసం మరో రూ.వెయ్యి కోట్లు నిధులు అవసరమవుతాయని పరిశ్రమలశాఖ అధికారులు చెబుతున్నారు. ఏడాది క్రితం సబ్సిడీకే దిక్కులేనప్పుడు కొత్తవాటి పరిస్థితి ఏమిటనే సందేహాలు పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సర్కారు కేవలం రూ.125 కోట్లు కేటాయించింది. అయితే ఎంఎస్ఎంఈ పరిస్థితి గడచిన రెండేళ్లుగా దయనీయంగా తయారైంది. లక్ష యూనిట్లు రూ. 3 వేల కోట్లు అప్పుల్లో ఉన్నట్టు ఎస్ఎల్బీసీ ఇటీవల ఆర్బీఐకి తెలిపింది. నిరర్థక ఆస్తుల జాబితాలో చేరిన ఈ లక్ష యూనిట్లలో దాదాపు 2 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రూ. 125 కోట్లు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదని ఎంఎస్ఎంఈ నిపుణులు అంటున్నారు. అదీగాక ఈ సంవత్సరం ఏపీ డిస్కమ్‌లు పెద్ద ఎత్తున ఫిక్స్డ్ చార్జీల పెంపునకు ప్రతిపాదనలు పంపాయి. ఇప్పుడున్న విద్యుత్ చార్జీలు కనీసం 200 రెట్లు పెరిగే వీలుందంటున్నారు. ఎస్సీ పారిశ్రామికవేత్తలకు మద్దతేదీ..? ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు ఈ ఏడాది రూ. 365 కోట్ల నిధులు రాయితీల కింద కావాలని పరిశ్రమలశాఖ ప్రతిపాదిస్తే, సర్కారు మాత్రం రూ. 165 కోట్లు ఇచ్చింది. విశాఖ–చెన్నై కారిడార్‌కు గతంలో రూ. 50 కోట్లు కేటాయించిన సర్కారు.. ఈసారి రూ. 369 కోట్లు కేటాయించింది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) రూ. 1700 కోట్ల రుణం ఇస్తుందని భావించి కారిడార్‌కు కేటాయింపులు పెంచారు. అయితే ఇప్పటికే కారిడార్ పరిధిలో ప్రాజెక్టులకు డీపీఆర్‌లు కూడా పూర్తికాలేదని ఏడీబీ అంటోంది. దీన్నిబట్టి కేటాయించిన నిధులు ఏమేర ఉపయోగపడతాయనేది ప్రశ్నార్థకమే. -
రాయితీలు లాభమేనా?
సాక్షి, హైదరాబాద్: ఈ మధ్య కాలంలో నగరంలోని నిర్మాణ సంస్థలు రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. మరి, ఈ ఆఫర్లు నిజంగా స్థిరాస్తి కొనుగోలుదారులకు లాభసాటేనా? అసలు ప్రాజెక్ట్ కొనగానే సాఫ్ట్ లాంచ్లోనో.. ప్రీ లాంచ్లోనో కొంటే లాభముంటుందా? వంటి సందేహాలు సహజం. ♦ ప్రాజెక్ట్ ప్రారంభించగానే కొనుగోలు చేస్తే కొంత వరకు లాభముంటుందని నిపుణులంటున్నారు. ఎలాగంటే ఓ కంపెనీ ధర చ.అ.కు రూ. 3,000 చొప్పున అమ్మకాలు మొదలెట్టింది.. అదే సంస్థ సాఫ్ట్ లాంచ్, ప్రీ లాంచ్ పేరిట అమ్మకాలు చేపట్టినప్పుడు చ.అ.కు రూ. 2,800కే ఇవ్వొచ్చు. ఇంకా తక్కువకు విక్రయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఇప్పుడు ధైర్యంగా అడుగు ముందుకేస్తే ప్రాజెక్టు ప్రారంభమయ్యేనాటికి ఫ్లాట్ రేటు పెరగడానికి ఆస్కారముంటుందని నిపుణులు వివరిస్తున్నారు. ♦ ప్రాజెక్ట్ లేదా వెంచర్ ఏదైనా సరే మీరు మొదటి కస్టమరైతే కొత్త అల్లుడికి ఇచ్చినంత మర్యాద ఇస్తారు. ఫ్లాట్‌లోని ప్రత్యేకతలు, వసతులూ నచ్చకపోతే మార్పులు చేయమంటే కూడా చేసిస్తారు. అంటే మీకు విట్రిఫైడ్ టైల్స్ ఇష్టమనుకోండి.. మార్బుల్ వేస్తామన్న కంపెనీ మీ డిమాండ్‌కు దిగివస్తుంది. ఇంటీరియర్ డిజైనింగ్ విషయంలో మార్పులున్నా చేసి పెడతారు. నాణ్యత విషయంలో రాజీపడరు. ప్రాజెక్టు ఆరంభంలోనే ప్రతికూల ప్రచారాన్ని ఏ కంపెనీ కూడా కోరుకోదు కాబట్టి.. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాయి. ♦ అయితే ధర తక్కువగా ఉందని తొందరపడి మాత్రం స్థిరాస్తిని కొనుగోలు చేయరాదని నిపుణులు సూచిస్తున్నారు. మంచి రికార్డు, దీర్ఘకాలిక చరిత్ర, ఆర్థిక స్థోమత ఉన్న కంపెనీల ఆఫర్లనే ఎంచుకోవాలి. అలాగే కొనుగోలు చేయబోయే ప్రాజెక్ట్‌కు అనుమతి ఉందా? ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉందా? మళ్లీ అమ్మకానికి పెడితే రీసేల్ అవుతుందా? వంటి అంశాల్ని గమనించాలి. సంస్థలకూ లాభమే.. ముందస్తు కొనుగోళ్లు కస్టమర్లకే కాదు నిర్మాణ సంస్థలకూ లాభమే. అనుమతులు రాక ముందే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించవు. తప్పనిసరి పరిస్థితుల్లో బిల్డర్ బయటి వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఈ ఇబ్బందిని అధిగమించడానికి ముందస్తు అమ్మకాలు కలిసొస్తాయి. అయితే ఇది కేవలం నిర్మాణ సంస్థకు మార్కెట్లో ఉన్న పేరు ప్రఖ్యాతులపైనే ఆధారపడుతుంది సుమి. -
వృద్ధుల రాయితీకి ఆధార్ తప్పనిసరి
న్యూఢిల్లీ: వృద్ధులు ఎవరైతే తమ రైలు ప్రయాణాల్లో రాయితీ కావాలనుకుంటారో వారు తప్పనిసరిగా ఆధార్ నెంబర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. రైల్వే కౌంటర్లు, ఈ-టికెట్ బుకింగ్ సమయంలోనూ ఆధార్ కార్డు వివరాలను సమర్పించిన సీనియర్ సిటిజెన్స్‌కు మాత్రమే రాయితీ వర్తిస్తుందని సీనియర్ రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నిర్ణయం 2017 ఎప్రిల్ నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆధార్ ఆధారిత టికెట్ సిస్టమ్‌ను రెండు దశల్లో అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. తొలుత 2017 జనవరి 1 నుంచి మార్చి 31 వరకు రైలు టికెట్ల బుకింగ్ కోసం ఆధార్ వివరాలను నమోదు చేసుకుంటారు. అనంతరం ఎప్రిల్ నుంచి మాత్రం ఆధార్ వివరాలను సమర్పించిన వారికి మాత్రమే రాయితీ ఇస్తారు. ఇప్పటికే డిసెంబర్ 1 నుంచి ఆధార్ నెంబర్ ద్వారా సీనియర్ సిటిజన్స్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారభించారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్, రిజర్వేషన్ కౌంటర్లలో తమ ఆధార్ వివరాలను అందించాల్సిందిగా సీనియర్ సిటిజన్స్‌ను రైల్వే శాఖ కోరింది. చాలా మంది నకిలీ ఏజెంట్లు సీనియర్ సిటిజన్ల పేరుమీద టికెట్లు బుక్ చేసి బ్లాక్‌లో విక్రయిస్తుండటంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. -
రైతులను ఆదుకోవాలి
- ఇన్పుట్ సబ్సిడీతో పాటు అన్ని రాయితీలు ఇవ్వాలి - లోకసభలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, తిరుపతి: అన్నదాతలను ఆదుకోవాలని రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి లోకసభలో సోమవారం గళమెత్తారు. రైతు సమస్యలపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రధానంగా అన్నదాతల సమస్యలను కళ్లకు కట్టినట్లు వివరించారు. రాష్ట్రంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వం రైతులకు ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సూచించిన మేర కనీస మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టాలోని రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర *780కు ధాన్యం విక్రయిస్తున్నారన్నారు. హుదూద్ బాధితులను ఇంతవరకు ఆదుకోలేదని ఆయన సభ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నారు. దీంతో సుమారు 35 ఏళ్లకు పైబడిన మామిడి చెట్లు నిలువునా ఎండిపోయాయన్నారు. గోరుచుట్టుపై రోకటిపోటు అన్న చందంగా ఇటీవల కురిసిన అకాలవర్షం, వడగండ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ 5 కిలోల వడగండ్లు పడిన విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న అన్నదాతను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా కనీస మద్దతు ధర ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్‌తో పాటు అన్ని రాయితీలు ప్రభుత్వం రైతులకు అందించాలన్నారు. రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.