![Centre Announces Tax Concessions On Money Received For Covid 19 - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/26/Tax.jpg.webp?itok=Pltq2CWL)
హైదరాబాద్: కరోనా కష్టకాలంలో ఉద్యోగులకు అండగా నిలిచిన యాజమాన్యాలు, కష్టాల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం అందించి బాసటగా నిలిచిన వారిని ప్రోత్సహించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడ్డ ఉద్యోగులను ఆదుకునేందుకు యాజమాన్యాలు చెల్లించిన మొత్తానికి పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది.
పన్ను మినహాయింపు
ఆదాయపు పన్ను శాఖ తాజాగా జారీ చేసిన సూచనల ప్రకారం ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులకు సంస్థలు ఇచ్చిన పరిహారం మొత్తంపైనా ఎలాంటి పన్ను వసూలు ఉండదు. అదే విధంగా కరోనా చికిత్స కోసం పలువురికి వారి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆర్థిక సహాయం చేశారు. ఈ సాయం మొత్తం రూ. 10 లక్షల లోపు వరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
ఆగష్టు 31 వరకు
పన్ను చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించే వివాద్ సే విశ్వాస్ పథకాన్ని ఆగస్టు 31 వరకు కేంద్రం పొడిగించింది. అదే విధంగా అక్టోబరు 31 వరకు పన్ను చెల్లించే అవకాశం కల్పించింది.
చదవండి : మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొంటాం!
Comments
Please login to add a commentAdd a comment