న్యూఢిల్లీ: కోవిడ్-19 సంకక్షోభ సమయంలో రద్దు చేసిన సీనియర్ సిటిజన్ల రైల్వే రాయితీ పొందే తరుణం రానుంది. ఈ మేరకు వారికి రాయితీ ఛార్జీలను పునరుద్ధరించాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. రైల్వేలు సాధారణ స్థితికి చేరుకుంటున్నందున, వివిధవర్గాలకు చెందిన ప్రయాణికులకు గతంలో అందించిన రాయితీలను తిరిగి అందించేలా చర్యలు చేపట్టాలని కమిటీ కోరింది.
ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు రైల్వే రాయితీ ఛార్జీల రాయితీ పునరుద్ధరణపై ఆలోచించాలని రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖను కోరింది. వారికి స్లీపర్ క్లాస్, ఏసీ-3 కేటగిరీల్లో మొత్తం ఛార్జీలో 40 శాతం నుండి 50 శాతం వరకు రాయితీని అందించాలని సిఫార్సు చేసింది. గతవారం ఆగస్టు 4న పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కమిటీ ఈ మేరకు పేర్కొంది. అయితే రాయితీ పునరుద్ధరణపై రైల్వే శాఖ అధికారిక స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
సీనియర్ సిటిజన్లు,జర్నలిస్టులకు అందించే రైల్వే ఛార్జీల రాయితీలు 2020 మార్చి 20నుంచి రద్దైన సంగతి తెలిసిందే. బీజేపీ లోక్‌సభ ఎంపీ రాధామోహన్ సింగ్ రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment