వాషింగ్టన్ : పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఆమె అమెజాన్ ఆడిట్ కమిటీలో తన సేవలు అందించనున్నారు.ఈ మేరకు అమెజాన్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంద్రా నూయి చేరికతో అమెజాన్ బోర్డు సభ్యుల్లో మహిళల సంఖ్య ఐదుకు చేరింది. కంపెనీ కొత్త పాలసీ ప్రకారం వివిధ కంపెనీల్లో ఉత్తమ సేవలు అందించిన, అందిస్తున్న కార్పోరేట్ దిగ్గజాలను బోర్డు డైరెక్టర్లుగా నియమిస్తూ వస్తోంది. అదే విధంగా మహిళా ప్రాధాన్యం పెంచే క్రమంలో గతేడాది స్టార్‌బక్స్ కార్పోరేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోసాలిండ్ బ్రూవర్‌ను బోర్డు డైరెక్టర్‌గా నియమించిన అమెజాన్... జామీ గోరెలిక్, జూడిత్ మెగ్రాత్, పాట్రిసియా స్టోన్సిఫర్‌లకు అవకాశం కల్పించింది. తాజాగా ఇంద్రా నూయి నియామకంతో 11 మంది సభ్యులతో కూడిన బోర్డులో మహిళల సంఖ్య ఐదుకు చేరింది.
కాగా శీతల పానీయాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తయారీలో ప్రపంచ రెండో అగ్రగామి సంస్థ, అమెరికాకు చెందిన ‘పెప్సీకో’ సీఈవోగా పనిచేసిన ఇండో-అమెరికన్ ఇంద్రా నూయి తన పదవి నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.12 ఏళ్ల పాటు కంపెనీకి సారథ్యం వహించిన ఆమె గతేడాది అక్టోబర్ 3న తన బాధ్యతల నుంచి వైదొలగారు. ఆమె స్థానంలో కంపెనీ ప్రెసిడెంట్ రామన్ లగుర్తా నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.
అమెజాన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు వీరే..
జెఫ్ బెజోస్ (అమెజాన్ సీఈఓ, చైర్మన్)
టామ్ అల్‌బర్గ్ (మద్రోనా వెంచర్ గ్రూపు స్థాపకులు)
*రోసాలిండ్ బ్రూవర్(స్టార్‌బక్స్ సీఓఓ)
*జామీ గోరెలిక్(యూఎస్ మాజీ డిప్యూటీ అటార్నీ జనరల్)
డానియల్ హట్టెన్‌లోచర్(డీన్ ఆఫ్ కార్నెల్ టెక్)
*జూడిత్ మెగ్రాత్(ఎంటీవీ నెట్‌వర్క్ మాజీ సీఈఓ)
జొనాథన్ రూబీన్‌స్టీన్(పాల్ సీఈఓ, ఆపిల్ మాజీ ఎగ్జిక్యూటిక్)
థామస్ రైడర్(ది రీడర్స్ డైజెస్ట్ అసోసియేషన్ మాజీ సీఈఓ)
*పెట్రిసియా స్టోన్సిఫర్(మార్తా టేబుల్ సీఈఓ)
వెండల్ వీక్స్(కార్నింగ్ సీఈఓ)
*ఇంద్రా నూయి(పెప్సీకో మాజీ సీఈఓ)
Comments
Please login to add a commentAdd a comment