
న్యూఢిల్లీ: శీతల పానీయ బ్రాండ్ స్లయిస్‌కి ప్రచారకర్తగా సినీ నటి నయనతార నియమితులయ్యారు. లేడీ సూపర్‌స్టార్‌గా పేరొందిన నయనతార చేరిక అనేది స్లయిస్ బ్రాండ్ మరింత మందికి చేరువయ్యేందుకు తోడ్పడగలదని పెప్సీకో ఇండియా అసోసియేట్ డైరెక్టర్ అనుజ్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవి సీజన్ సందర్భంగా కొత్త ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించనున్నట్లు వివరించారు. స్లయిస్ కుటుంబంలో భాగమవడంపై నయనతార సంతోషం వ్యక్తం చేశారు.